రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/విజయనగరం టౌన్: వేసవి సెలవుల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–తిరుపతి–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 07433 నంబర్ హైదరాబాద్–తిరుపతి ప్రత్యేక రైలు ఈ నెల 17న సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07434 నంబర్‌తో ఈ నెల 19న రాత్రి 8.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
చదవండి: నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
రెండు మార్గాలలో ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. 07435 నంబర్ తిరుపతి – కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు ఈ నెల 18న సాయంత్రం 4.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07436 నంబర్‌తో ఈ నెల 19న ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 6.40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.
పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ట్రాఫిక్ పవర్ బ్లాక్‌తో పాటు ఖరగ్‌పూర్–హిజ్లీ స్టేషన్‌ల మధ్య ఇంటర్‌లాకింగ్ పనులు, థర్డ్ లైన్ పనులు ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను ఆయా తేదీల్లో రద్దు చేశామని, మరికొన్నింటిని మిడ్నాపూర్ మీదుగా దారిమళ్లించినట్టు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్ 12703 హౌరా–సికింద్రాబాద్ 22న రద్దు చేశారు.
12704 సికింద్రాబాద్–ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 21న, 12864 యశ్వంత్‌పూర్–హౌరా 21న, 12863 హౌరా–యశ్వంత్‌పూర్ 22న రద్దు చేశారు. వీటితో పాటు 12245 హౌరా–యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ 22న, 12246 యశ్వంత్‌పూర్–హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ 24న రద్దు చేశారు. 18045 షాలీమార్–హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 22న, 18046 హైదరాబాద్–షాలీమార్ 21న, 22855 సంత్రగచ్చి–తిరుపతి 22న, 22856 తిరుపతి–సత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ 23న రద్దు చేశారు. 12841 షాలీమార్–చెన్నై 22న, 12842 చెన్నై–షాలీమార్ ఎక్స్‌ప్రెస్ 21న రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment