తిరుపతి అర్బన్: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ రైలు ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచి్చంది. తిరుపతిలో ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరింది. ఈ రైలులో టీసీలుగా నలుగురు మహిళలు నియమితులయ్యారు. పి.అనితా (సీటీఐ), ఎంఎస్ సెల్వీ (టీటీఐ), బి.భారతి (టీటీఐ), రమణమ్మ (టీటీఐ) విధులు నిర్వర్తిస్తున్నారు.
రైలును పరిశీలించేందుకు గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి తిరుపతి రైల్వేస్టేషన్‌కు విచ్చేశారు. ఆయన వెంట సీనియర్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్, స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ చిన్నరెడ్డెప్ప, రైల్వే ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ ఉన్నారు. మొదటి రోజే రైలులోని 520 టికెట్లు భర్తీ అయ్యాయని అధికారులు తెలిపారు. తొలిరోజు రూ.9.50 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. మరో రెండు రోజులకు కూడా టికెట్లు బుక్ అయినట్టు తెలిపారు.
ప్రయాణించిన సీఎస్..
వందే భారత్ రైలులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ప్రయాణించారు. రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి రైల్వేస్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ శనివారం సికింద్రాబాద్‌లో వందే భారత్ ట్రైన్ ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. యాత్రికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం సీఎస్ జవహర్‌రెడ్డి తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి వందే భారత్ రైలులో గుంటూరుకు వెళ్లారు. అక్కడ నుంచి విజయవాడకు వెళ్లనున్నారు. ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ, టీటీడీ జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మయ్య, నగరపాలక కమిషనర్ హరిత, స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ వీడ్కోలు పలికారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: 36 శాతం ‘వంట’ చెరకే! తొలి స్థానంలో మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే..
Comments
Please login to add a commentAdd a comment