సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వందేభారత్‌లో బాంబు ఉందని ఓ ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు.
అయితే రైలులో బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని సమాచారంచ్చినక్తిని లింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్‌గా గుర్తించారు, దీంతో అతడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
కాగా సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించగా.. సెప్టెంబర్ 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త రైలు ఏర్పాటు చేశారు.
అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం ఖాళీతో నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. దాదాపు 1200 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 బోగీలతో నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment