- మరిన్ని వందేభారత్ రైళ్లకు పచ్చజెండా
- సికింద్రాబాద్-నాగ్‌పూర్,దుర్గ్-విశాఖ రైళ్లు ప్రారంభం
- 19 నుంచి సికింద్రాబాద్-నాగ్‌పూర్ రైలు అందుబాటులోకి
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ సోమవారం(సెప్టెంబర్16) ప్రారంభించారు. భుజ్-అహ్మదాబాద్ మధ్య నడిచే వందేభారత్ మెట్రో రైలు సర్వీసుల పేరును నమోభారత్ ర్యాపిడ్ రైలుగా మార్చారు. ఈ రైలుతో మరిన్ని వందేభారత్ రైళ్లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
దుర్గ్-విశాఖపట్నం,వందేభారత్,నాగ్‌పుర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-నాగ్‌పుర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. వందేభారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు తన పట్ల ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయన్నారు. అయితే, ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి.. ఈ టర్ములోనే ఒకే దేశం-ఒకే ఎన్నికలు
Comments
Please login to add a commentAdd a comment