Summer special trains
-
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నర్సాపూర్-బెంగళూరు మధ్య వేసవి రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా నర్సాపూర్–బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. నర్సాపూర్–బెంగళూరు ప్రత్యేక రైలు (07153) మే 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. చదవండి: సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07154) మే 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పట్టాయ్, బంగార్పేట్, కృష్ణార్జునపూరం స్టేషన్లలో ఆగుతుంది. చదవండి: బీచ్‌లో శ్వేత మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు, సూసైడ్ నోట్ -
Summer Special Trains: హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చేవారికి అలర్ట్..
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/విజయనగరం టౌన్: వేసవి సెలవుల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–తిరుపతి–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 07433 నంబర్ హైదరాబాద్–తిరుపతి ప్రత్యేక రైలు ఈ నెల 17న సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07434 నంబర్‌తో ఈ నెల 19న రాత్రి 8.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. చదవండి: నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం రెండు మార్గాలలో ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. 07435 నంబర్ తిరుపతి – కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు ఈ నెల 18న సాయంత్రం 4.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07436 నంబర్‌తో ఈ నెల 19న ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 6.40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో ట్రాఫిక్ పవర్ బ్లాక్‌తో పాటు ఖరగ్‌పూర్–హిజ్లీ స్టేషన్ల మధ్య ఇంటర్‌లాకింగ్ పనులు, థర్డ్ లైన్ పనులు ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను ఆయా తేదీల్లో రద్దు చేశామని, మరికొన్నింటిని మిడ్నాపూర్ మీదుగా దారిమళ్లించినట్టు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్ 12703 హౌరా–సికింద్రాబాద్ 22న రద్దు చేశారు. 12704 సికింద్రాబాద్–ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 21న, 12864 యశ్వంత్‌పూర్–హౌరా 21న, 12863 హౌరా–యశ్వంత్‌పూర్ 22న రద్దు చేశారు. వీటితో పాటు 12245 హౌరా–యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ 22న, 12246 యశ్వంత్‌పూర్–హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ 24న రద్దు చేశారు. 18045 షాలీమార్–హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 22న, 18046 హైదరాబాద్–షాలీమార్ 21న, 22855 సంత్రగచ్చి–తిరుపతి 22న, 22856 తిరుపతి–సత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ 23న రద్దు చేశారు. 12841 షాలీమార్–చెన్నై 22న, 12842 చెన్నై–షాలీమార్ ఎక్స్‌ప్రెస్ 21న రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
Summer Special Trains.. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే పేర్కొంది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త రైళ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, మన్మాడ్ మధ్య 126 రైళ్లు ఉన్నాయి. మాల్దా టౌన్, రేవా మధ్య దాదాపు ఆరు వేసవి స్పెషల్స్ ప్రయాణించనున్నాయి. దాదర్, మడ్గావ్ మధ్య మరో ఆరు వేసవి స్పెషల్స్ నడుస్తాయి. ఇక, తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.అదేవిధంగా తిరుపతి-హైదరాబాద్ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరకుంటుంది. ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మరోవైపు.. తిరుపతి-ఔరంగాబాద్ (07511) స్పెషల్ ట్రెయిన్ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుంది. 20 Summer Weekly Special Trains between various destinations @drmhyb @drmgtl @drmned @drmsecunderabad #SummerSpecialTrains pic.twitter.com/m20zpM1rqj — South Central Railway (@SCRailwayIndia) April 27, 2022 ఇది కూడా చదవండి: ఫోర్త్ వేవ్‌లో అనవసర ఆంక్షలు ఉండవు -
ప్రత్యేక రైళ్లకు అదనంగా 106 ట్రిప్పులు
సాక్షి, హైదరాబాద్: వేసవి ప్రత్యేక రైళ్లకు పొడిగింపుగా దక్షిణ మధ్య రైల్వే మరో 106 ట్రిప్పులను ప్రకటించింది. ఈ మేరకు అదనపు ట్రిప్పుల వివరాలను వెల్లడించింది. తిరుపతి–నాగర్సోల్: జూలై 6, 13, 20, 27 తేదీల్లో తిరుపతిలో ఉదయం 7.30కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో 7, 14, 21, 28 తేదీల్లో నాగర్సోల్లో రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. ఇవి గుంటూరు, నడికుడి, వికారాబాద్ మార్గంలో ప్రయాణిస్తాయి. నాందేడ్–తిరుపతి: జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో నాందేడ్‌లో సాయంత్రం 6.45కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1 తేదీల్లో తిరుపతిలో మధ్యాహ్నం 3.45కి బయలుదేరతాయి. ఇవి మల్కాజ్గిరి, కాజీపేట మీదుగా ప్రయాణిస్తాయి. కాచిగూడ–టాటానగర్: జూలై 2, 9, 16, 23, 30 తేదీల్లో కాచిగూడలో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో అదే నెల 3, 10, 17, 24, 31 తేదీల్లో టాటానగర్‌లో రాత్రి 10.50కి బయలుదేరతాయి. ఇవి మల్కాజ్గిరి, నల్లగొండ, గుంటూరు, దువ్వాడ మార్గంలో ప్రయాణిస్తాయి. హైదరాబాద్–జైపూర్: జూలై 6, 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 4.25కు బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో 8, 15, 22, 29 తేదీల్లో జైపూర్‌లో మధ్యాహ్నం 2.35కు బయలుదేరతాయి. ఇవి సికింద్రాబాద్, మేడ్చల్, కామారెడ్డి మార్గంలో ప్రయాణిస్తాయి. కాచిగూడ–కృష్ణరాజపురం: జూలై 1, 8, 15, 22, 29 తేదీల్లో కాచిగూడలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో 2, 9, 16, 23, 30 తేదీల్లో కృష్ణరాజపురంలో మధ్యాహ్నం 3.25కి ప్రారంభమవుతాయి. ఇవి మహబూబ్‌నగర్, అనంతపూర్ మార్గంలో ప్రయాణిస్తాయి. హైదరాబాద్–కొచువెలి: జూలై 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో 9, 16, 23, 30 తేదీల్లో కొచువెలిలో ఉదయం 7.45కి మొదలవుతాయి. ఇవి సికింద్రాబాద్, నల్లగొండ, గూడూరు, తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి. హైదరాబాద్–ఎర్నాకులం: జూన్ 4, 11, 18, 25 తేదీల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12.50కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు 5, 12, 19, 26 తేదీల్లో ఎర్నాకులంలో రాత్రి 9.45కి మొదలవుతాయి. ఇవి సికింద్రాబాద్, నల్లగొండ, తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి. కాచిగూడ–కాకినాడ: జూలై 6, 13, 20, 27 తేదీల్లో కాచిగూడలో సాయంత్రం 6.45కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు 7, 14, 21, 18 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.50కి మొదలవుతాయి. ఇవి నల్లగొండ, పిడుగురాళ్ల, ఏలూరు మీదుగా ప్రయాణిస్తాయి. కాచిగూడ–విశాఖపట్నం: జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో సాయంత్రం 6.45కి కాచిగూడలో బయలుదేరే ప్రత్యేక రైళ్లు మల్కాజ్గిరి, నల్లగొండ, గుంటూరు, రాజమండ్రి మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటాయి. తిరుపతి–కాచిగూడ: జూలై 5, 12, 19, 26, ఆగస్టు 2 తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు గూడూరు, విజయవాడ, వరంగల్ మీదుగా కాచిగూడకు చేరుకుంటాయి. లింగంపల్లి–కాకినాడ: ఏప్రిల్ 28న ఉదయం 5 గంటలకు లింగంపల్లిలో బయలుదేరే ప్రత్యేక రైలు కాజీపేట మార్గంలో కాకినాడ చేరుకుంటుంది. -
వేసవికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో : వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... సికింద్రాబాద్-మచిలీపట్నం (07050/07049) మార్చి 1,8,15,22,29 తేదీలలో ఉదయం 10.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 7.45 కు మచిలీపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే తేదీలలో రాత్రి 9.30 కు మచిలీపట్నం నుంచి బయలుదేరి తెల్లవారు జామున 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. విజయవాడ-తిరుపతి (07259/ 072 60) స్పెషల్ ట్రైన్ మార్చి 5,12,19,26 తేదీలలో రాత్రి 11.15 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 8,15,22,29 తేదీలలో మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 11.55 కు విజయవాడకు చేరుకుంటుంది. తిరుపతి-కాకినాడ (07261/07262) ప్రత్యేక రైలు మార్చి 6,13,20,27 తేదీల్లో మధ్యాహ్నం 3.30 కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 కు కాకినాడ చేరుకుంటుంది. తిరు గు ప్రయాణంలో మార్చి 7,14,21,28 తేదీలలో సాయంత్రం 7.15 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 కు తిరుపతికి చేరుకుంటుంది. భువనేశ్వర్-బెంగళూర్ (00851/ 00 852) ప్రీమియం బై వీక్లీ ట్రైన్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 29 వరకు ప్రతి బుధ,శనివారాల్లో రాత్రి 10.50 కి భువనేశ్వర్ నుంచి బయలుదేరి గురు,ఆది వారాల్లో రాత్రి 10.40కి బెంగళూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్ర,సోమ వారాల్లో తెల్లవారు జామున ఒంటిగంటకు బయలుదేరి ఆది,బుధ వారాల్లో తెల్లవారు జామున 1.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. భువనేశ్వర్-పూనే (02882/02881) ప్రీమియం స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 5 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 10.15 కు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 5 గంటలకు పూనే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం ఉదయం 11.15 కు పూనే నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 5.35 కు భువనేశ్వర్ చేరుకుంటుంది.ఇది సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్-విశాఖ (08502/0 85 01) వీక్లీ స్పెషల్ ఏప్రిల్ 7 నుంచి జూలై 1 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖ-తిరుపతి (02873/02874) స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 6 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4.45కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ప్రతి మంగళవారం సాయంత్రం 4 గం టలకు తిరుపతి నుంచి బయలుదేరి మ రుసటి రోజు ఉదయం 5.15కు విశాఖ చేరుకుంటుంది. హోళీ ప్రత్యేక రైళ్లు... హోళీ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-పట్నా మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-పట్నా (02791/02792) స్పెషల్ మార్చి 1వ తేదీన ఉదయం 6.15 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.45 కు పట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 3వ తేదీన రాత్రి 11.40 కి పట్నా నుంచి బయలుదేరి మార్చి 5వ తేదీ ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.