ప్రతీకాత్మక చిత్రం
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా నర్సాపూర్–బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. నర్సాపూర్–బెంగళూరు ప్రత్యేక రైలు (07153) మే 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
చదవండి: సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి
తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07154) మే 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలర్‌పట్టాయ్, బంగార్‌పేట్, కృష్ణార్జునపూరం స్టేషన్లలో ఆగుతుంది.
చదవండి: బీచ్‌లో శ్వేత మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు, సూసైడ్ నోట్
Comments
Please login to add a commentAdd a comment