Narasapur
-
సీఎం జగన్ సాహసం..|
-
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నర్సాపూర్-బెంగళూరు మధ్య వేసవి రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా నర్సాపూర్–బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. నర్సాపూర్–బెంగళూరు ప్రత్యేక రైలు (07153) మే 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. చదవండి: సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07154) మే 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పట్టాయ్, బంగార్పేట్, కృష్ణార్జునపూరం స్టేషన్లలో ఆగుతుంది. చదవండి: బీచ్‌లో శ్వేత మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు, సూసైడ్ నోట్ -
నరసాపురం–విజయవాడ మధ్య కొత్త రైలు సర్వీస్
సాక్షి, నరసాపురం: నరసాపురం–విజయవాడ మధ్య ప్రతిరోజూ నడిచేలా కొత్త రైలు సర్వీస్‌ను ప్రవేశపెట్టారు. ఈ నెల 17 నుంచి ఈ ప్యాసింజర్ రైలు నడుస్తుందని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం స్టేషన్ మేనేజర్ మధుబాబు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 07877 నంబరు గల ఈ రైలు ప్రతిరోజూ విజయవాడ నుంచి ఉదయం 7.10కి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. మళ్లీ నరసాపురం నుంచి 07281 నంబర్‌తో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. (చదవండి: దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు) ప్రతిరోజూ నరసాపురం–విజయవాడ మధ్య నడిచే ఫాస్ట్ ప్యాసింజర్ రైలును ఇటీవల రైల్వేశాఖ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేసింది. అదీగాక మధ్యాహ్నం పూట నరసాపురం నుంచి విజయవాడకు ఎలాంటి సర్వీసులూ ప్రస్తుతం నడవడం లేదు. దీంతో ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తున్నారు. మధ్యాహ్నం వేళ నరసాపురం నుంచి విజయవాడకు రైలు నడపాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది. మధ్యాహ్నం వేళ నడిచే ఈ రైలు ఎట్టకేలకు ఈ నెల 17 నుంచి పట్టాలెక్కనుంది. (చదవండి: థ్యాంక్యూ టీటీడీ.. మహిళా భక్తురాలు ఈ–మెయిల్) -
డబుల్ లైన్‌కు పట్టాభిషేకం
సాక్షి, ఆకివీడు: ఇది ఎన్నాళ్లో వేచిన ఉదయం.. విజయవాడ–నరసాపురం బ్రాంచి మార్గంలో డబుల్ ట్రాక్ దశాబ్దాల కల.. అది ఈనాటికి సాకారమవుతోంది. తొలిదఫాగా ఆకివీడు– మోటూరు మధ్య డబుల్ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి రెండు పట్టాలపై రైళ్లు దౌడుతీయనున్నాయి. నరసాపురం– విజయవాడ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఈ మార్గంలో తొలిదఫాగా ఆకివీడు– మోటూరు మధ్య డబుల్ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. ఆశించిన మేరకు నిధులు విడుదల కావడంతో పనులు వేగవంతంగా జరిగాయి. గురువారం ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. దీంతో శుక్రవారం నుంచి రైళ్లను రెండో లైన్‌పైనా నడిపించనున్నారు. దీంతో విజయవాడ నుంచి భీమవరం వైపు వచ్చే రైళ్లు రెండో ట్రాక్‌పైన, భీమవరం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు పాత ట్రాక్‌పైనా వెళ్లనున్నాయి. నరసాపురం మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజుతోపాటు ప్రస్తుత వైఎస్సార్సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ డబుల్ లైన్ కోసం ప్రత్యేక కృషి చేశారు. సందడే సందడి డబుల్ లైన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుండడంతో 38కిలోమీటర్ల మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్లలో సందడి వాతావరణం నెలకొంది. గురువారం ట్రయల్ రన్‌ను ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భారీగా తరలివచ్చి తిలకించారు. 8 దశాబ్దాల చరిత్రగల బ్రాంచి లైన్ నరసాపురం– విజయవాడ బ్రాంచి రైల్వే లైన్‌కు 8 దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలోనే విజయవాడ నుంచి నరసాపురం బ్రాంచి రైల్వేలైన్ ఏర్పడింది. సముద్ర తీరంలో ఉన్న నర్సాపురం ప్రాంతం నుంచి రైలు మార్గం కోసం బ్రాంచి లైన్‌ను మొదట మీటర్‌గేజ్‌గా నిర్మించారు. స్వాతంత్య్రానంతరం బ్రాడ్‌గేజ్‌గా అభివద్ధి చేశారు. అప్పటి నుంచి బ్రాంచి రైల్వే లైన్ అభివద్ధి అంగుళం కూడా కదల్లేదు. చెక్క స్లీపర్లపై పట్టాలను ఏర్పాటుచేసి రైళ్లు నడిపారు. దశాబ్దాలుగా బొగ్గు రైళ్లను ఈ ప్రాంతంలో నడిపారు. 1990లో బ్రాంచి రైల్వే లైన్లో డీజిల్ ఇంజిన్లతో రైళ్ళను నడిపారు. బ్రాంచి లైన్లో మొట్టమొదటిగా కాకినాడ–మద్రాసు సర్కార్ఎక్స్ప్రెస్ను నడిపారు. బొగ్గుతో నడిచే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఈ లైన్లో కేవలం 20 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లేది. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రాంతంలో కొంత చరిత్ర కూడా ఉంది. జై ఆంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులు సర్కార్ ఎక్స్‌ప్రెస్ చక్రాల్ని పీకేసి, పట్టాని కూడా ఊడబీకి, పక్కనే ఉన్న రైల్వే కొలిమిలో పారవేశారు. కోస్తాలో బ్రాంచి రైల్వే లైన్లు కోస్తా ప్రాంతాల్ని అభివద్ధి చేయడంలో భాగంగా 1936–38 ప్రాంతంలో విజయవాడ నుంచి ఆయా మార్గాలకు రైలు సౌకర్యాన్ని కల్పించారు. మొట్టమొదటిగా విజయవాడు–నరసాపురం లైన్ నిర్మించారు. ఆ తరువాత విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–గుడివాడ, భీమవరం–నిడదవోలు బ్రాంచి రైల్వే లైన్లను మీటర్ గేజ్‌లో ఏర్పాటు చేశారు.2013లో కేంద్ర ప్రభుత్వం బ్రాంచి రైల్వేలైన్ల ఆధునికీకరణకు రూ.1,850 కోట్లు కేటాయించింది. నాలుగు విభాగాలుగా టెండర్లు బ్రాంచి రైల్వే లైన్లు విద్యుదీకరణ, డబులింగ్ పనులను ముక్కలుగా విభజించి టెండర్లు పిలిచారు. మొదట్లో విజయవాడ–గుడివాడ, గుడివాడ–భీమవరం, భీమవరం–నిడదవోలు, విజయవాడ–మచిలీపట్నం, భీమవరం–నరసాపురం ప్రాంతాల అభివద్ధికి నిధులు కేటాయించి, టెండర్లు పిలిచారు. తొలుత విజయవాడ–గుడివాడ, గుడివాడ–నరసాపురం మధ్య పనులు మొదలుపెట్టారు. అయితే కాంట్రాక్టర్ కొంతమేర పనులు చేసి చేతులెత్తేయడంతో మళ్లీ పనులు స్తంభించిపోయాయి. ఆ తరువాత మళ్లీ టెండర్లు పిలవడంతో గుడివాడ–భీమవరం మధ్య నాగార్జున కనస్ట్రక్షన్ పనులు దక్కించుకుని వేగవంతం చేసింది. హౌరాకు రైలు నడపాలి బ్రాంచి రైల్వేలైన్ ఆధునికీకరణ చేయడంతో కొత్త రైళ్లు నడిపేందుకు అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధికి రైల్వే దోహదపడాలి. హౌరా, బెంగళూరు ప్రాంతాలకు కొత్త రైళ్లను నడపాలి. డబులింగ్, విద్యుదీకరణతో రైళ్ల వేగం పెరిగి, కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంది. – సిహెచ్.నాగరాజు, ఆకివీడు ఆనందదాయకం బ్రాంచి రైల్వే లైన్ అభివృద్ధిలో ఆకివీడు–మోటూరు వరకూ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరగడం హర్షదాయకం. ఈ ప్రాంతానికి చెందిన అప్పటి ఎంపీ కనుమూరి బాపిరాజు కృషి వల్ల డబులింగ్, విద్యుదీకరణ పనులకు నిధులు మంజూరయ్యాయి. – నేరెళ్ల పెదబాబు, రైల్వే బోర్డు సభ్యుడు, ఆకివీడు -
జాగా.. ఎక్కడా..!
సాక్షి, నర్సాపూర్ : మండల కేంద్రమైన శివ్వంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీచాలని ఉన్నత పాఠశాల భవనంలో ప్రస్తుతం కాలేజీ కొనసాగుతుండడంతో అందులో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఫీజు రాయితీ పథకాన్ని సైతం అమలు చేస్తున్నా మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల చేరిక పడిపోతుంది. 2008లో శివ్వంపేటకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది. ఎనిమిదేళ్లపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో కాలేజీ కొనసాగింది. ఆ భవనం సైతం శిథిలావస్థకు చేరడంతో భవనాన్ని ఖాళీచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి శివ్వంపేటలోని ఓ అద్దెభవనంలో కాలేజీ నిర్వహించారు. నెలవారి అద్దె చెల్లించకపోవడంతో ఆ భవనం సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల భవనంలో.. ప్రస్తుతం కాలేజీని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతుంది. కేవలం నాలుగు గదులు మాత్రమే కేటాయించడంతో విద్యార్థులకు సరిపోని పరిస్థితి నెలకొంది. సరిపడా గదులు లేకపోవడంతో పాటు విద్యార్థుల ప్రాక్టికల్స్ చేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత భవనం లేకపోవడంతోనే విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వెనుకడుగు వేస్తున్నారు. శివ్వంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు అనుకూలంగా కాలేజీ ఉన్నా సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులను కళాశాలలో బోధిస్తున్నారు. ద్వితీయ సంవత్సరంలో 55 మంది విద్యార్థులు ఉండగా మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. స్థానికంగా వసతులు లేకపోవడంతో విద్యార్థులు తూప్రాన్, నర్సాపూర్ ప్రాంతాల్లోని ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మండలంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2018–2019 విద్యా సంవత్సరానికి సంబంధించి 544 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. శివ్వంపేట, చెండి, చిన్నగొట్టిముక్కల్ల, దొంతి గ్రామాలకు సంబంధించి ఇంటర్ చదివేందుకు శివ్వంపేట కాలేజీ అనుకూలంగా ఉంటుంది. ఆయా పాఠశాలల్లో 200 మంది విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులు మాత్రమే శివ్వంపేట ప్రభుత్వ కాలేజీలో పేర్లు నమోదు చేసుకున్నారు. స్థలం లేక వృథాగా నిధులు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంతభవనం నిర్మాణానికి 8 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం 40లక్షల నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు జరగకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. 6 సంవత్సరాల క్రితం మరోమారు నాబార్డు నుంచి ఆధునిక జూనియర్ కళాశాల భవననిర్మాణానికి 10కోట్లు మంజూరయ్యాయి. నిధులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ భూమి కేటాయింపు చేపట్టకపోవడంతో ఆ నిధులు సైతం వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. భవన నిర్మాణానికి భూమిని కేటాయిస్తే అన్ని హంగులతో విద్యార్థులకు పూర్తి వసతులతో భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. భూమి కేటాయించకపోవడంతో కాలేజీ భవన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కాలేజీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని పలుమార్లు అప్పటి మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలేజీ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. -
నర్సాపురంలో K.A.పాల్ నామినేషన్
-
ప్రజాసేవే ఆర్టీసీ లక్ష్యం : మహేందర్‌రెడ్డి
నర్సాపూర్ మెదక్ : ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజాసేవే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. గురువారం నర్సాపూర్‌లో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సంస్థ నష్టాల్లో ఉండడంతో దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారని చెప్పారు. నర్సాపూర్ డిపో ఏర్పాటుకు పది కోట్ల రూపాయలను సీఎం మంజూరు చేశారని, ఆరు నెలల్లో డిపోను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మంత్రిని సన్మానించిన యూనియన్ నాయకులు మంత్రి మహేందర్‌రెడ్డిని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజినల్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు సంగమేశ్వర్, అహ్మద్, శాఖయ్య, శ్యాంసుందర్‌గౌడ్ తదితరులు శాలువ, పూలమాలలతో సన్మానించారు. డిపో ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల ఆత్మహత్య
కొల్చారం(నర్సాపూర్) : మండలంలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన తాండాకు చెందిన లంబాడి లక్ష్మణ్ భార్య ప్రేమ్‌లి(45) ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందును సేవించడంతో చికిత్స కోసం మెదక్ తరలిస్తుండగా మార్గమద్యంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమ్‌లి మృతికి కుటుంబ కలహాలే కారణమని కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ పెంటయ్య తెలిపారు. పదిహేను రోజుల నుంచి ప్రేమ్‌లికి, భర్త లక్ష్మణ్, కుమారులకు మధ్య గొడవలు జరగినట్లు తెలిసింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం సైతం గొడవ జరగడం, కుమారుడు చేయి చేసుకోవడంతో పనస్థాపం చెందిన ప్రేమ్‌లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. పైతరలో : మండల పరిధిలోని పైతర గ్రామానికి చెందిన బోయిని మల్లేశం భార్య రాజమణి(35) కుటుంబ కలహాల కారణంగా మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగినట్లు గ్రామస్థులు తెలిపారు. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ పెంటయ్య తెలిపారు. -
నరసాపురంలో ఉద్రిక్తత
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనచైతన్య యాత్ర సందర్భంగా మంగళవారం ఆయా గ్రామాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యే బండారు మాధవనాయుడును రావద్దని గ్రామస్థులు చెప్పిన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఆక్వాపార్క్ నిర్మాణం విషయంలో తమకు అండగా నిలబడకపోవటంతో గ్రామాలకు రావద్దని ఎమ్మెల్యే బండారుకు గ్రామ పెద్దలు సూచించారు. ఆయన వస్తే అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్లపై సిద్దంగా ఉన్నారు. జనచైతన్య యాత్రను అడ్డుకుంటే అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే మాధవనాయుడు గ్రామాల్లో పర్యటించేందుకు కొద్దిసేపట్లో రానున్నారు. -
కడలి తరంగం
` వీధులన్నీ నిండిపోగా.. రోడ్లపై రాకపోకలు స్తంభించిపోయూరుు. వైఎస్సార్ జనభేరి పేరిట ఎన్నికల సమర శంఖారావం పూరించేందుకు శుక్రవారం నరసాపురం వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఆయనపై తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. స్టీమర్ రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. నిజాయితి, విశ్వసనీయత అనే పదాలకు అర్థం తెలిసిన వాడే నాయకుడు. కార్యకర్తలు కాలర్ ఎగరేసి అతనే మా నాయకుడని గర్వంగా చెప్పుకునేలా మసలుకునే వాడే నాయకుడు. ఒక మాట చెబితే దానిని నిలుపుకోవడంలో మడమ తిప్పని వాడే నాయకుడనిపించుకుంటాడ’ని నాయకుడనే పదానికి వైఎస్ జగన్ నిర్వచనం చెప్పారు. ఆయన ప్రసంగించినంతసేపూ ప్రతి మాటకు జనం జయజయధ్వానాలు పలికారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆల్ ఫ్రీ హామీల మర్మాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డివిడమరిచి చెబుతున్నప్పుడు జనం ఆసక్తిగా విన్నారు. బాబు బుర్రలో ఇన్ని కుట్రలున్నాయా అని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన సోదరుడు కొత్తపల్లి జానకిరామ్, వందలాది మంది అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆప్యాయంగా పలకరిస్తూ... శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమాశ్ర యం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు బయలుదేరారు. హనుమాన్ జంక్షన్ వద్ద కని పించిన వృద్ధులను ఆప్యాయంగా పలకరిం చారు. అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం సమీపంలో వైఎస్సార్ సీపీ నేత చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఫామ్ హౌస్‌లో కొద్దిసేపు ఆగారు. అక్కడి నుంచి తణుకు, పెరవలి, పెనుగొండ మీదుగా నరసాపురం పయనమయ్యారు. అడుగడుగునా ఆయనకు అభిమాన ప్రవాహం అడ్డుపడింది. ప్రతి ఒక్కరినీ ఆగిమరీ ఆయన పలకరించారు. మార్టేరు, పాలకొల్లు సెంటర్లలో పెద్దఎత్తున ప్రజలు జననేతకు జేజేలు పలికారు. నరసాపురంలో అడుగుపెట్టే సందర్భంలో జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగ తం లభించింది. యువకులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పూలతో అలంకరించిన ఏడు పంచకల్యాణి ఆశ్వాలతో కూడిన రథంపై జగన్మోహన్రెడ్డిని ఎక్కించి సభావేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు జనభేరి బహిరంగ సభ మొదలైంది. వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంతసేపూ జనం పూల వర్షం కురిపించారు. చంద్రబాబులా సాధ్యం కాని హామీలు ఇచ్చి మాట తప్ప డం తనకు రాదని, చెప్పినవన్నీచేసి తీరుతానని, చెప్పనివి కూడా చేస్తానని జనానికి జగన్ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆవేశాన్ని రగిలించేలా.. జనాన్ని ఆలోచింపజేసేలా సాగింది. సభానంతరం వేదిక దిగుతున్నప్పుడు కూడా సమీప భవంతులపై నుంచి అభిమానులు పూలు చల్లి వీడ్కోలు పలికారు. అంతకుముందు సభలో వైఎస్ జగన్‌ను కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇతర నాయకులు గజమాలతో సత్కరించారు. పూల కిరీ టాన్ని జననేతకు అలంకరించేందుకు ప్రయత్నించగా జగన్ దానిని కొత్తపల్లి శిరస్సున ఉంచారు. అవినీతిపై రామబాణాన్ని ఎక్కుపెట్టినట్టు పూల ధనుస్సుతో బాణాన్ని జగన్ ఎక్కుపెట్టారు. సభ ముగించుకుని రాత్రి బసకు పాలకొల్లులోని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నివాసానికి వెళ్లారు. జగన్మోహన్రెడ్డి వెంట పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్‌గౌడ్, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, నిడదవోలు వైసీపీ నేత జీఎస్‌రావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు, రాజోలు నియోజకవర్గ సమన్వయకర్త బొంతు రాజేశ్వరావు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాస్, నరసాపురం పట్టణ, మండల అధ్యక్షులు నల్లిమిల్లి జోషప్, దొంగ గోపాలకృష్ణ, పార్టీ నాయకులు సాయినాథ్ ప్రసాద్, తదితరులు ఉన్నారు. -
91 శాతం మందికి డీఈసీ మాత్రలు పంపిణీ
నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ :జిల్లాలో పైలేరియా నివారణ కార్య క్రమంలో భాగంగా 91.39 శాతం మందికి మంగళవారం డీఈసీ మాత్రలను పంపిణీ చేసినట్టు జిల్లా ఆరోగ్య విస్తరణ, మీడియా అధికారి చదలవాడ నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం నరసాపురం వచ్చిన ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లాలో 39 లక్షల 56వేల 859 జనాభాలో రెండేళ్ల లోపు పిల్లలు, గర్భిణలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించగా, 35 లక్ష 21వేల 605 మంది డీఈసీ మాత్రలు వేసుకునేందుకు అనుకూలురని గుర్తించామన్నారు. వారిలో 32 లక్షల 18వేల 616 మందికి మాత్రలు పంపిణీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో 15వేల 831 మంది వలంటీర్లు ఇంటింటికీ తిరిగి మాత్రలు పంపిణీ చేశారన్నారు. వలంటీర్లలో అంగనవాడీ, ఆశ వర్కర్లతోబాటు కళాశాలల విద్యార్థినులు ఉన్నారని చెప్పారు. డీఈసీ మాత్రలను వరుసగా అయిదారేళ్ళు తీసుకుంటే పైలేరియా దరిచేరదన్నారు. డీఈసీ మాత్రలను తీసుకున్న తర్వాత కళ్లు తిరగడం, జ్వరం వంటి లక్షణాలు కనబడితే పైలేరియా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని సూచించారు. కాళ్లు, శోష గ్రంధులు, నాళాల వాపు, వరిబీజం మొదలైన వాటిని వ్యాధి లక్షణాలుగా పరిగణించవచ్చన్నారు. తొలిదశలో ఇటువంటి లక్షణాలు బయటపడటం ద్వారా బోధ వ్యాధిని గుర్తించగలమని వివరించారు. పైలేరియా రోగకారక మైక్రోబ్యాక్టీరియా ఆరు నుంచి ఎనిమిదేళ్ల వరకు బయటపడదని వివరించారు. కనుక డీఈసీ మాత్రలను కనీసం అయిదేళ్లపాటు వరుసగా తీసుకోవాలని స్పష్టం చేశారు.