సాక్షి, నరసాపురం: నరసాపురం–విజయవాడ మధ్య ప్రతిరోజూ నడిచేలా కొత్త రైలు సర్వీస్‌ను ప్రవేశపెట్టారు. ఈ నెల 17 నుంచి ఈ ప్యాసింజర్ రైలు నడుస్తుందని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం స్టేషన్ మేనేజర్ మధుబాబు చెప్పారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 07877 నంబరు గల ఈ రైలు ప్రతిరోజూ విజయవాడ నుంచి ఉదయం 7.10కి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. మళ్లీ నరసాపురం నుంచి 07281 నంబర్‌తో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. (చదవండి: దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు)
ప్రతిరోజూ నరసాపురం–విజయవాడ మధ్య నడిచే ఫాస్ట్ ప్యాసింజర్ రైలును ఇటీవల రైల్వేశాఖ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేసింది. అదీగాక మధ్యాహ్నం పూట నరసాపురం నుంచి విజయవాడకు ఎలాంటి సర్వీసులూ ప్రస్తుతం నడవడం లేదు. దీంతో ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తున్నారు. మధ్యాహ్నం వేళ నరసాపురం నుంచి విజయవాడకు రైలు నడపాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది. మధ్యాహ్నం వేళ నడిచే ఈ రైలు ఎట్టకేలకు ఈ నెల 17 నుంచి పట్టాలెక్కనుంది. (చదవండి: థ్యాంక్యూ టీటీడీ.. మహిళా భక్తురాలు ఈ–మెయిల్)
Comments
Please login to add a commentAdd a comment