Indian Railways To Run Summer-Special Trains - Sakshi
Sakshi News home page

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్

Published Thu, Apr 28 2022 11:48 AM | Last Updated on Thu, Apr 28 2022 12:20 PM

Indian Railways To Run Special Trains In Summer - Sakshi

Summer Special Trains.. రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్. ప్రయాణికుల కోసం స్పెషల్‌ ట్రైన్స్‌ను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే పేర్కొంది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్‌ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ కొత్త రైళ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌, మన్మాడ్ మధ్య 126 రైళ్లు ఉన్నాయి. మాల్దా టౌన్, రేవా మధ్య దాదాపు ఆరు వేసవి స్పెషల్స్ ప్రయాణించనున్నాయి. 
దాదర్, మడ్గావ్ మధ్య మరో ఆరు వేసవి స్పెషల్స్ నడుస్తాయి. ఇక, తిరుపతి-హైదరాబాద్‌, తిరుపతి-ఔరంగాబాద్‌ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.

హైదరాబాద్‌-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్‌ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.అదేవిధంగా తిరుపతి-హైదరాబాద్‌ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌ చేరకుంటుంది. ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. 

మరోవైపు.. తిరుపతి-ఔరంగాబాద్‌ (07511) స్పెషల్‌ ట్రెయిన్‌ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్‌ చేరుకుంటుందని వెల్లడించారు. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుంది. 

ఇది కూడా చదవండి: ఫోర్త్‌ వేవ్‌లో అనవసర ఆంక్షలు ఉండవు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement