సాక్షి, హైదరాబాద్: వేసవి ప్రత్యేక రైళ్లకు పొడిగింపుగా దక్షిణ మధ్య రైల్వే మరో 106 ట్రిప్పులను ప్రకటించింది. ఈ మేరకు అదనపు ట్రిప్పుల వివరాలను వెల్లడించింది.
తిరుపతి–నాగర్‌సోల్: జూలై 6, 13, 20, 27 తేదీల్లో తిరుపతిలో ఉదయం 7.30కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో 7, 14, 21, 28 తేదీల్లో నాగర్‌సోల్‌లో రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. ఇవి గుంటూరు, నడికుడి, వికారాబాద్ మార్గంలో ప్రయాణిస్తాయి.
నాందేడ్–తిరుపతి: జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో నాందేడ్‌లో సాయంత్రం 6.45కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1 తేదీల్లో తిరుపతిలో మధ్యాహ్నం 3.45కి బయలుదేరతాయి. ఇవి మల్కాజ్‌గిరి, కాజీపేట మీదుగా ప్రయాణిస్తాయి.
కాచిగూడ–టాటానగర్: జూలై 2, 9, 16, 23, 30 తేదీల్లో కాచిగూడలో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో అదే నెల 3, 10, 17, 24, 31 తేదీల్లో టాటానగర్‌లో రాత్రి 10.50కి బయలుదేరతాయి. ఇవి మల్కాజ్‌గిరి, నల్లగొండ, గుంటూరు, దువ్వాడ మార్గంలో ప్రయాణిస్తాయి.
హైదరాబాద్–జైపూర్: జూలై 6, 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 4.25కు బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో 8, 15, 22, 29 తేదీల్లో జైపూర్‌లో మధ్యాహ్నం 2.35కు బయలుదేరతాయి. ఇవి సికింద్రాబాద్, మేడ్చల్, కామారెడ్డి మార్గంలో ప్రయాణిస్తాయి.
కాచిగూడ–కృష్ణరాజపురం: జూలై 1, 8, 15, 22, 29 తేదీల్లో కాచిగూడలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో 2, 9, 16, 23, 30 తేదీల్లో కృష్ణరాజపురంలో మధ్యాహ్నం 3.25కి ప్రారంభమవుతాయి. ఇవి మహబూబ్‌నగర్, అనంతపూర్ మార్గంలో ప్రయాణిస్తాయి.
హైదరాబాద్–కొచువెలి: జూలై 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో 9, 16, 23, 30 తేదీల్లో కొచువెలిలో ఉదయం 7.45కి మొదలవుతాయి. ఇవి సికింద్రాబాద్, నల్లగొండ, గూడూరు, తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి.
హైదరాబాద్–ఎర్నాకులం: జూన్ 4, 11, 18, 25 తేదీల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12.50కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు 5, 12, 19, 26 తేదీల్లో ఎర్నాకులంలో రాత్రి 9.45కి మొదలవుతాయి. ఇవి సికింద్రాబాద్, నల్లగొండ, తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి.
కాచిగూడ–కాకినాడ: జూలై 6, 13, 20, 27 తేదీల్లో కాచిగూడలో సాయంత్రం 6.45కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు 7, 14, 21, 18 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.50కి మొదలవుతాయి. ఇవి నల్లగొండ, పిడుగురాళ్ల, ఏలూరు మీదుగా ప్రయాణిస్తాయి.
కాచిగూడ–విశాఖపట్నం: జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో సాయంత్రం 6.45కి కాచిగూడలో బయలుదేరే ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, నల్లగొండ, గుంటూరు, రాజమండ్రి మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటాయి.
తిరుపతి–కాచిగూడ: జూలై 5, 12, 19, 26, ఆగస్టు 2 తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు గూడూరు, విజయవాడ, వరంగల్ మీదుగా కాచిగూడకు చేరుకుంటాయి.
లింగంపల్లి–కాకినాడ: ఏప్రిల్ 28న ఉదయం 5 గంటలకు లింగంపల్లిలో బయలుదేరే ప్రత్యేక రైలు కాజీపేట మార్గంలో కాకినాడ చేరుకుంటుంది.
ప్రత్యేక రైళ్లకు అదనంగా 106 ట్రిప్పులు
Published Thu, Apr 26 2018 3:42 AM | Last Updated on Thu, Apr 26 2018 3:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment