
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తిరుపతి–సికింద్రాబాద్ (07481/07482) స్పెషల్ ట్రైన్ నవంబర్ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 7.50 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5.50కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకి తిరుపతికి చేరుకుంటుంది.
పలు రూట్లలో 174 అదనపు రైళ్లు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో నవంబర్ నుంచి వచ్చే జనవరి వరకు 174 అదనపు రైళ్లను నడుపనున్నట్లు సీహెచ్ రాకేశ్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్– నర్సాపూర్, కాజీపేట్–దాదర్, సికింద్రాబాద్–అగర్తల, హైదరా బాద్– జైపూర్, హైదరాబాద్– గోరఖ్‌పూర్, విశాఖపట్టణం–సికింద్రాబాద్, విశాఖపట్టణం–మహ బూబ్‌నగర్, విశాఖపట్టణం–తిరుపతి, భువనేశ్వర్–తిరుపతి, విశాఖపట్టణం–బెంగళూరు, కాచిగూడ–మధురై తదితర మార్గాల్లో ప్రయాణికుల రద్దీకనుగుణంగా అదనపు రైళ్లను నడపనున్నారు.