సాక్షి, హైదరాబాద్/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్–కాకినాడ మధ్య 4 సువిధ ప్రత్యేక రైళ్లు నడుపనుంది. హైదరాబాద్–కాకినాడ టౌన్ సువిధ స్పెషల్ (82709) అక్టోబర్ 18, 20 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 7.20కు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్–హైదరాబాద్ సువిధ స్పెషల్ (82710) అక్టోబర్ 19, 21 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 8.50కు హైదరాబాద్‌కు చేరుతుంది. సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట ప్రాంతాల్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ఏసీ టూ టైర్, త్రీ టైర్ సదుపాయాలున్నాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
యశ్వంత్‌పూర్–విశాఖ ప్రత్యేక రైళ్లు
యశ్వంత్‌పూర్– విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. యశ్వంత్‌పూర్–విశాఖపట్నం ప్రత్యేక రైలు (06579) అక్టోబర్ 12, 19, 26, నవంబర్ 2, 9వ తేదీల్లో సాయంత్రం 6.35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. విశాఖ–యశ్వంత్‌పూర్ రైలు (06580) అక్టోబర్ 14, 21, 28, నవంబర్ 4, 11 తేదీల్లో మధ్యాహ్నాం 1.45కి విశాఖలో బయలు దేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment