Yeshwanthpur
-
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్ల కేటాయింపు
లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ఆంజనేయులు మంగళవారం వెల్లడించారు. రైలు నంబర్ 07153 నరసాపూర్–యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీ ఉంటుందన్నారు. ఈ రైలు మధ్యాహ్నం 3.10 గంటలకు నరసాపూర్ స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 7.50 గంటలకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. రైలు నంబర్ 07514 ప్రత్యేక రైలును (యశ్వంత్‌పూర్–నరసాపూర్) ఈ నెల 19న కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు యశ్వంత్‌పూర్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజాము 3.35 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 8.30 గంటలకు నరసాపూర్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07156 యశ్వంత్‌పూర్–నరసాపూర్ రైలు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2.20 గంటలకు నరసాపూర్ స్టేషన్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 6.25 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని, అక్కడ నుంచి శనివారం ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్ స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించారు. 07517 యశ్వంత్‌పూర్–నరసాపూర్ రైలు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు యశ్వంతపూర్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి అదే రోజు ఉదయం 10.30 గంటలకు నరసాపూర్ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. 07046 సికింద్రాబాద్–దిబ్రూగ్రహ్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ఫిబ్రవరి 2, 9, 16, 23వ తేదీల్లో ప్రత్యేక రైలును కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రైలు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3.50 గంటలకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి శనివారం రాత్రి 8.50 గంటలకు దిబ్రూగ్రహ్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07047 ప్రత్యేక రైలును ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు ఆదివారం రాత్రి 7.25 గంటలకు దిబ్రూగ్రహ్ స్టేషన్ నుంచి బయలుదేరి గుంటూరు రైల్వే స్టేషన్‌కు మంగళవారం రాత్రి 10.10 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. (క్లిక్ చేయండి: సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఎప్పటినుంచంటే..) -
'నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు'
సాక్షి, బెంగళూరు: నాన్నా నువ్వు రోజూ అమ్మను ఎందుకు కొడతావు. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు అని పిల్లలు అడుగుతుంటే తల్లి రోదిస్తూ చూస్తుంది. కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకున్నా భర్త చెడు నడవడిక వల్ల ఓ వివాహిత పిల్లలతో కలిసి జల సమాధి అయ్యింది. మద్యం తాగి భర్త పెట్టే వేధింపులను భరించలేక ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి చెక్‌డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా మళలి గ్రామంలో జరిగింది. తాలూకాలోని జానకల్ లంబాణి కాలనీకి చెందిన అర్పిత (28), కూతురు మానస(6), కొడుకు మదన్(4)లు మృతి చెందారు. అనుమానం, మద్యం వ్యసనం వివరాలు... 8 ఏళ్ల క్రితం హొసదుర్గ తాలూకా జానకల్ లంబాణి కాలనీకి చెందిన అర్పితకు కొండజ్జి లంబాణి కాలనీవాసి మంజా నాయక్‌తో పెళ్లయింది. భర్త అనుమానంతో తరచూ వేధించేవాడు. రోజు మద్యం తాగి గొడవపడేవాడు. భర్త సతాయింపులతో ఆవేదన చెందిన ఆమె ఆదివారం రాత్రి పిల్లలతో కలిసి దగ్గరలోని చెక్‌డ్యాంలో దూకడంతో ప్రాణాలు విడిచారు. అంతకుముందు అర్పిత సెల్ఫీ వీడియో తీసింది. అందులో కొడుకు మదన్ నాన్న అంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. హొసదుర్గ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి) -
దర్శకుని కుమారుడు దుర్మరణం
యశవంతపుర(కర్ణాటక) : ట్యాంకర్, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బ్యాడరహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని దర్శకుడు సూర్యోదయ కుమారుడు మయూర్ (20)గా గుర్తించారు. మయూర్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌లో ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో బ్యాడరహళ్లి న్యూ లింక్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ట్యాంటర్ బైక్‌ను ఢీకొంది. దీంతో మయూర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సూర్యోదయ పెరంపల్లి పలు కన్నడ, తులు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన దర్శకత్వ వహించిన ‘దేయి బైడేతి’చిత్రానికి మూడు రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. -
తిమింగలం వాంతి.. విలువ రూ.8 కోట్లు
యశవంతపుర: సముద్రాల్లో తిమింగళాలు చేసుకునే వాంతి (అంబర్గ్రిస్) బెంగళూరులో పెద్దమొత్తంలో పట్టుబడింది. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల తయారీ ముడిపదార్థంగా అంబర్గ్రిస్కు పేరుంది. బెంగళూరు కేజీహళ్లి పోలీసులు సయ్యద్ తజ్ముల్పాషా (54), సలీంపాషా (48), నాసీర్ పాషా(34), రఫీవుల్లా షరీఫ్ (45) అనే నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 కేజీల అంబర్గ్రిస్ ముద్దలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.8 కోట్ల వరకూ ఉంటుందని తెలిపారు. నగరంలోని ఓ కొబ్బరితోటలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసి పోలీసులు దాడి చేయగా ఇది పట్టుబడింది. వీరికి అంబర్గ్రిస్ ఎక్కడ నుండి వచ్చిందనేది విచారణ చేపట్టారు. (చదవండి: Bombay HC: కరోనా మనందరి అతిపెద్ద శత్రువు.. సర్జికల్ దాడి చేయాల్సిందే!) -
గవర్నర్ పదవి ఆశపెట్టి.. రూ.కోటి నొక్కేశాడు
యశవంతపుర: సర్కారీ ఉద్యోగాలను ఇప్పిస్తానని, ప్రభుత్వంలో పనులు చేయిస్తానని పలువురిని నమ్మించి భారీగా డబ్బులు గుంజిన బెంగళూరు చీటర్ యువరాజ్ అలియాస్ సేవాలాల్ సాధారణ వ్యక్తి కాదని, పెద్ద తలకాయలతో పరిచయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకుముందే చీటింగ్ కేసుల్లో ఇతడు ఇరుక్కోగా బడా నాయకులు విడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ పార్టీ ముఖ్య నేతలతో తీయించుకున్న ఫోటోలను అడ్డం పెట్టుకుని దందా సాగించేవాడు. బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తకు కేఎస్ ఆర్టీసీ అధ్యక్ష పదవిని ఇప్పిస్తానంటూ నమ్మించి కోటి రూపాయలను వసూలు చేశాడు. ఎన్నిరోజులైన పదవీ లేదు, డబ్బులు వాపస్ ఇవ్వకుపోవటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత బాధితులు ఒక్కొక్కరే బయటకు రావడంతో యువరాజ్ బాగోతం రచ్చకెక్కింది. తన దందాలో విశ్రాంత ఎస్పీ పాపయ్యను మధ్యవర్తిగా ఉపయోగించుకున్నట్లు తెలిసింది. ఒక ఉన్నత పదవిలో ఉన్న మహిళకు గవర్నర్ పదవిని చేతిలో పెడతానని కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు ప్రచారం. పదవి రాకపోవడంతో ఆ మహిళ విల్సన్ గార్డెన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో యువరాజ్, పాపయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాపయ్య పరారీలో ఉన్నాడు. రాష్ట్రానికి చెందిన బలమైన బీజేపీ నాయకునితో కలిసి యడియూరప్పను సీఎం పదవి నుండి దించటానికి సైతం యువరాజ్ పథకం వేసినట్లు తెలిసింది. మోసం చేసి సంపాదించిన డబ్బులను నటి రాధికా కుమారస్వామితో పాటు ఇతరుల అకౌంట్‌కు బదిలీ చేసినట్లు సీసీబీ అధికారులు చెబుతున్నారు. -
ఆమెతో చాటింగ్ చేసి అంతలోనే..
యశవంతపుర : ఆన్లైన్లో పరిచయం వ్యక్తి మహిళ బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు రాజరాజేశ్వరినగరకు చెందిన గృహిణి అశ్వినికి, జేపీ నగర 6వ స్టేజీలో నివాసం ఉంటున్న వినోద్ అలియాస్ మంజునాథ్‌తో ఫేస్బుక్లో పరిచయం చేసుకున్నాడు. జూన్ 10న అతడు ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆమె ఓకే చేసింది. అప్పుడప్పుడు చాటింగ్ చేసుకునేవారు. ఇటీవల తన చెల్లికి, తల్లికి ఆరోగ్యం బాగాలేదని, అర్జంటుగా డబ్బు కావాలని అశ్వినికి మంజునాథ్ కోరాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పినా అతడు వినలేదు. ఆమె ఇంటికి వచ్చి ఆమె నుంచి రూ. రెండు లక్షలు విలువైన బంగారు గొలుసు, ఉంగరాలు, కమ్మలను మంజునాథ్ తీసుకున్నాడు. ఆ తరువాత అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఫేస్‌బుక్‌లోనూ స్పందించడం లేదు. మోసపోయానని బాధితురాలు జయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
అరుదైన ఆరు అడుగుల శ్వేత నాగు
సాక్షి, బెంగళూరు : సిలికాన్ సిటీ బెంగళూరులో అపురూపమైన శ్వేతనాగు కనిపించింది. ఇక్కడి న్యాయంగ లేఔట్ వద్ద తెల్లటి నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే పాముల నిపుణుడు మోహన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నాడు. దాదాపు ఆరు అడుగులు ఉన్న తెల్లటి నాగుపాము ఎంతో అరుదుగా ఉంటాయని, ఈ పామును సురక్షితంగా అడవుల్లోకి వదిలి పెడతామన్నారు. -
దసరా రద్దీ.. ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్–కాకినాడ మధ్య 4 సువిధ ప్రత్యేక రైళ్లు నడుపనుంది. హైదరాబాద్–కాకినాడ టౌన్ సువిధ స్పెషల్ (82709) అక్టోబర్ 18, 20 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 7.20కు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. కాకినాడ టౌన్–హైదరాబాద్ సువిధ స్పెషల్ (82710) అక్టోబర్ 19, 21 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 8.50కు హైదరాబాద్‌కు చేరుతుంది. సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట ప్రాంతాల్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ఏసీ టూ టైర్, త్రీ టైర్ సదుపాయాలున్నాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. యశ్వంత్‌పూర్–విశాఖ ప్రత్యేక రైళ్లు యశ్వంత్‌పూర్– విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. యశ్వంత్‌పూర్–విశాఖపట్నం ప్రత్యేక రైలు (06579) అక్టోబర్ 12, 19, 26, నవంబర్ 2, 9వ తేదీల్లో సాయంత్రం 6.35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. విశాఖ–యశ్వంత్‌పూర్ రైలు (06580) అక్టోబర్ 14, 21, 28, నవంబర్ 4, 11 తేదీల్లో మధ్యాహ్నాం 1.45కి విశాఖలో బయలు దేరుతుంది.