
తల్లి అర్పిత, చిన్నారులు (ఫైల్)
సాక్షి, బెంగళూరు: నాన్నా నువ్వు రోజూ అమ్మను ఎందుకు కొడతావు. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు అని పిల్లలు అడుగుతుంటే తల్లి రోదిస్తూ చూస్తుంది. కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకున్నా భర్త చెడు నడవడిక వల్ల ఓ వివాహిత పిల్లలతో కలిసి జల సమాధి అయ్యింది. మద్యం తాగి భర్త పెట్టే వేధింపులను భరించలేక ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి చెక్‌డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా మళలి గ్రామంలో జరిగింది. తాలూకాలోని జానకల్ లంబాణి కాలనీకి చెందిన అర్పిత (28), కూతురు మానస(6), కొడుకు మదన్(4)లు మృతి చెందారు.
అనుమానం, మద్యం వ్యసనం
వివరాలు... 8 ఏళ్ల క్రితం హొసదుర్గ తాలూకా జానకల్ లంబాణి కాలనీకి చెందిన అర్పితకు కొండజ్జి లంబాణి కాలనీవాసి మంజా నాయక్‌తో పెళ్లయింది. భర్త అనుమానంతో తరచూ వేధించేవాడు. రోజు మద్యం తాగి గొడవపడేవాడు. భర్త సతాయింపులతో ఆవేదన చెందిన ఆమె ఆదివారం రాత్రి పిల్లలతో కలిసి దగ్గరలోని చెక్‌డ్యాంలో దూకడంతో ప్రాణాలు విడిచారు. అంతకుముందు అర్పిత సెల్ఫీ వీడియో తీసింది. అందులో కొడుకు మదన్ నాన్న అంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. హొసదుర్గ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: (ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి)
Comments
Please login to add a commentAdd a comment