భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 8 ప్రత్యేక రైళ్లు | 8 Special Trains From Telugu States To Sabarimala | Sakshi
Sakshi News home page

భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 8 ప్రత్యేక రైళ్లు

Published Fri, Nov 15 2024 5:35 PM | Last Updated on Fri, Nov 15 2024 5:53 PM

8 Special Trains From Telugu States To Sabarimala

సాక్షి, హైదరాబాద్‌: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి(హైదరాబాద్‌)-కొల్లాం, ఈ నెల 24, డిసెంబర్‌ 1వ తేదీల్లో కొల్లాం-మౌలాలి, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం.. 20, 27 తేదీల్లో  కొల్లాం-మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్న దక్షిణమధ్య  రైల్వే.. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

సికింద్రాబాద్‌–లక్నో మధ్య ప్రత్యేక రైలు 
రైల్వేస్టేషన్‌ (విజయవాడపశి్చమ): సికింద్రాబాద్‌–లక్నో మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌–లక్నో రైలు (07084) ఈ నెల 15, 22 తేదీల్లో శుక్రవారం రాత్రి 7.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, ఆదివారం సాయంత్రం లక్నో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07083) ఈ నెల 18, 25 తేదీల్లో సోమవారం ఉదయం 9.50 గంటలకు లక్నోలో బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement