
గూడూరు : రైల్వే గేట్ వేస్తే ఈ వాహనదారులు ఇలా రోడ్డుపై నిల్చున్నారు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరబడినట్లే. మహబూబాబాద్ జిల్లా గూడూరు నుంచి నెక్కొండ వైపు వెళ్లే రోడ్డులో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. అన్ని పత్రాలు పరిశీలించి ఏదీ లేకున్నా జరిమానా విధించడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటుగా వచ్చే వాహనదారులు పోలీసులు తనిఖీలు ముగించాకే అక్కడి నుంచి వెళ్లాలని ఇలా రోడ్డుపై వాహనాలను నిలిపి రోడ్డుపై వేచి ఉండటం గమనార్హం.
ఉధృతంగా గోదావరి
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడంతో వరద నీరు గోదావరి నదిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం బాసర వద్ద నది నిండుగా కనిపించింది. మంజీర, గోదావరితోపాటు ఉప నదుల నీరంతా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద కలుస్తుంది.ఈ నీరంతా గోదావరిలో కలవడంతో ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం బాసర వద్ద నదిలోని కొత్తనీటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. – భైంసా (ముధోల్)
Comments
Please login to add a commentAdd a comment