Godavari flow
-
పోలీసులు వెళ్తేనే.. మేమెళ్తాం!
గూడూరు : రైల్వే గేట్ వేస్తే ఈ వాహనదారులు ఇలా రోడ్డుపై నిల్చున్నారు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరబడినట్లే. మహబూబాబాద్ జిల్లా గూడూరు నుంచి నెక్కొండ వైపు వెళ్లే రోడ్డులో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. అన్ని పత్రాలు పరిశీలించి ఏదీ లేకున్నా జరిమానా విధించడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటుగా వచ్చే వాహనదారులు పోలీసులు తనిఖీలు ముగించాకే అక్కడి నుంచి వెళ్లాలని ఇలా రోడ్డుపై వాహనాలను నిలిపి రోడ్డుపై వేచి ఉండటం గమనార్హం. ఉధృతంగా గోదావరి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడంతో వరద నీరు గోదావరి నదిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం బాసర వద్ద నది నిండుగా కనిపించింది. మంజీర, గోదావరితోపాటు ఉప నదుల నీరంతా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద కలుస్తుంది.ఈ నీరంతా గోదావరిలో కలవడంతో ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం బాసర వద్ద నదిలోని కొత్తనీటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. – భైంసా (ముధోల్) -
సహజ మార్గంలోకి గోదావరి ప్రవాహం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో గోదావరి సహజ ప్రవాహ మార్గానికి అడ్డుకట్ట వేసి.. సింగన్నపల్లి ఎగువన అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా మళ్లించిన గోదావరి ప్రవాహం శనివారం పోలవరానికి దిగువన నదీ సహజ మార్గంలోకి ప్రవేశించింది. ప్రవాహ జలాలు ధవళేశ్వరం బ్యారేజీ వైపు దూసుకెళ్తున్నాయి. దీంతో ఈ నెల 15న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా చేపట్టిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణానికి వీలుగా గోదావరిని స్పిల్‌వే వైపు మళ్లించేందుకు ఎగువ కాఫర్ డ్యామ్‌ను ప్రభుత్వం నిర్మించింది. స్పిల్‌వే వైపు గోదావరిని మళ్లించేందుకు అప్రోచ్ చానల్ తవ్వకం పనులు కొలిక్కి రావడంతో శుక్రవారం అడ్డుకట్టను తెంచి.. 2.18 కి.మీ. పొడవున తవ్విన అప్రోచ్ చానల్ మీదుగా ప్రవాహాన్ని దారి మళ్లించారు. సుమారు పది వేల క్యూసెక్కుల ప్రవాహం రివర్ స్లూయిజ్‌ల ద్వారా స్పిల్ చానల్‌కు చేరుతోంది. 4.42 కి.మీ. పొడవున ఉన్న స్పిల్ చానల్, పైలట్ చానల్ నిండితేనే గోదావరి ప్రవాహం సహజ మార్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ చానళ్లు నిండాలంటే కనీసం ఒక టీఎంసీకి పైగా అవసరం. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పిల్ చానల్, పైలట్ చానల్ నిండటంతో ప్రవాహం తిరిగి సహజ మార్గంలోకి ప్రవేశించింది. కాఫర్ డ్యామ్‌కు ఎగువన సహజ మార్గం నుంచి అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా 6.6 కి.మీ. పొడవున దారి మళ్లిన గోదావరి 24 గంటలపాటు ప్రవహించి తిరిగి సహజ మార్గంలోకి ప్రవేశించడం గమనార్హం. పైలట్ చానల్ ద్వారా సుమారు 10 వేల క్యూసెక్కులు ప్రవాహం సహజ మార్గం మీదుగా ధవళేశ్వరం బ్యారేజీ వైపు వెళుతోంది. ఆదివారం సాయంత్రానికి ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీని చేరుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోజురోజుకూ ప్రవాహ ఉద్ధృతి పెరగనుంది. ఎగువ కాఫర్ డ్యామ్ ప్రభావం వల్ల నీటిమట్టం 25 అడుగుల ఎత్తు దాటితే.. పోలవరం స్పిల్ వే రేడియల్ గేట్ల మీదుగా తొలిసారిగా గోదావరి వరద జలాలు దిగువకు చేరతాయి. -
తెరుచుకున్న బాబ్లీగేట్లు
నిజామాబాద్: సుమారు ఎనిమిది నెల ల పాటు గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వేసిన మహా రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మంగళవారం వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో బాబ్లీకి ఉన్న 14 గేట్లను ఎత్తారు. బాబ్లీ ప్రాజెక్టు అధికారి ఎస్వీ సాల్వి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మీడియాను సైతం ప్రాజెక్టు వద్దకు అనుమతించలేదు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు విజయ్ చోబే, ఇంజనీర్ జీఎస్ లోఖండే, బాబ్లీ గ్రామ సర్పంచ్ గంగాబాయి, నాందేడ్ సీఐ పంకజ్ దేశ్‌ముఖ్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు తీర్పు ప్రకారం రానున్న అక్టోబర్ 28 వరకు గేట్లు ఎత్తి ఉంచనున్నారు.మన రాష్ట్రానికి, మహారాష్ట్రకు గతం లో బాబ్లీ వివాదం నెలకొన్న నేపథ్యంలో మన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు ఏటా అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లను మూసి ఉంచాలని, జూలై 1న తెరిచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం కలగకుండా గేట్లు ఎత్తి ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు.