అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అరాచక పాలనను కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ ఆరోపించారు.
నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అరాచక పాలనను కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ ఆరోపించారు. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్నారు. మద్యం మాఫియాను కొనసాగించేది కూడా టీడీపీ నేతలే అని సునిల్ కుమార్ తెలిపారు. అధికార పార్టీ నేతల అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారని సునిల్ కుమార్ స్పష్టం చేశారు.