గూడూరు: ఇంతకాలం వ్యాక్సిన్ అంటే భయపడిన వారు కూడా కరోనా కేసులు పెరుగుతుండడంతో ముందుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కు బుధవారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం 9 గంటలకే తరలివచ్చారు. టీకా ఆవశ్యకతపై గ్రామాల్లో అధికారులు ప్రచారం చేస్తుండడంతో వ్యాక్సిన్ కోసం తరలివచ్చిన ప్రజలు ఇలా బారులు తీరి కనిపించారు. క్యూలో నిలుచున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. అయితే, కరోనా భయంతో టీకా కోసం వచ్చిన వారిలో చాలా మంది మాస్క్ ధరించకపోగా, భౌతిక దూరాన్ని విస్మరించి దగ్గరదగ్గరగా నిల్చోవడం గమనార్హం.
ప్రజలందరు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని, భౌతిక దూరంపాటించాలని.. వైద్యారోగ్యశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఇంకా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మరోవైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్లకు అదనంగా, మరో 25 శాతం పెంచాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇక్కడ చదవండి:
స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment