యువకుడి దారుణ హత్య
గూడూరు : ఇరువర్గాల మధ్య రగులుతున్న పాతకక్షలు ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీశాయి. ఈ సంఘటన గురువారం రెండో పట్టణంలోని రిల యన్స్ పెట్రోల్ బంకు సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. రెండో పట్టణంలోని ఎగువవీరారెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన వెడిచర్ల రమణయ్య సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకడైన చైతన్య (20) పాలిటెక్నిక్ వరకు చదివాడు. కొంత మందితో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని జులాయిగా తిరుగుతూ గొడవలకు పాల్పడుతుండేవాడు. ఒకటో పట్టణ ం లోని బనిగీసాహెబ్‌పేటకు చెందిన శ్రీహరి అలియాస్ జెమిని, రాణీపేట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ నారాయణతోపాటు మరి కొందరు జులాయిలుగా తిరుగుతూ గొడవలకు పాల్పడుతుండేవారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్ది కాలం క్రితం గొడవలు జరిగాయి. హతుడు చైతన్య స్నేహితుడిపై జెమిని దాడిచేసి గాయపరిచాడు. దీంతో ఇరువురి మధ్య గొడవలు, కక్షలు నెలకొన్నాయి. వినాయక చవితి సందర్భంగా జెమిని వర్గం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్దకు చైతన్యతో పాటు మరికొందరు వచ్చి గొడవ పెట్టుకునేలా ప్రవర్తించారు. జెమిని వర్గం కూడా చైతన్య వర్గం ఏర్పాటు చేసిన విగ్రహాల వద్దకు వెళ్లి వారిని రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించారు. ఈ క్రమం లో చైతన్యతో పాటు బయట ప్రాంతాలకు చెందిన మరికొందరు బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకు Ðð ళ్లి బనిగీ సాహెబ్‌పేట, తాళమ్మగుడి ప్రాంతంలో ఉండడాన్ని చూసిన జెమిని, తదితరులు అదను కోసం ఎదురు చూస్తూ వారిని వెంబడించి రెండో పట్టణంలోని రిలయన్స్ పెట్రోలు బంకు సమీపంలో చైతన్య తలపై దుడ్డుకర్రతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రికత్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సుబ్బారావు, ఎస్సై నరేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.