![Bollepally Land Dispute: Farmers Prayer To Forest Officers For Podu lands - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/2/Podu-Lands-Bollepalli.jpg.webp?itok=cT9-vE9e)
Podu Lands: బొల్లేపల్లిలో అధికారుల కాళ్లు మొక్కుతున్న రైతులు
గూడూరు: ‘కాళ్లు మొక్కుతా.. దళితులం.. పంట నాశనం చేయకండి’.. అంటూ ఓ పోడు రైతు అటవీ అధికారి కాళ్లు మొక్కాడు. అయినా కనికరం చూపకుండా అటవీ అధికారులు పంటను ధ్వంసం చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి శివారు పోడు భూముల్లో శుక్రవారం జరిగింది. కొన్ని నెలలుగా బొల్లేపల్లి శివారులోని సర్వే నంబర్ 1 నుంచి 30 గల పోడు భూముల్లో స్థానిక దళిత, గిరిజన రైతులు 1985కు ముందు నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు.
చదవండి: టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు
ఆ భూమి అటవీ శాఖది పేర్కొంటుండడంతో ఏడాదిగా అధికారులు, రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి జోక్యం చేసుకోవడంతో నాటి గొడవలు సద్దుమణిగాయి. దీంతో రైతులు వారి భూముల్లో పంటలు సాగు చేసుకున్నారు. అయితే శ్రీను అనే రైతు మిర్చి పంట వేసుకోగా శుక్రవారం డీఎఫ్‌ఓ కిరణ్ సమక్షంలో మానుకోట అటవీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అటవీ భూమిగా పేర్కొంటూ పంటను ధ్వంసం చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఓ రైతు ఏకంగా డీఎఫ్‌ఓ కాళ్లపై పడి వేడుకున్నా కనికరం చూపకుండా పంటను నాశనం చేసి వెళ్లిపోయారు.
చదవండి: నేను గెలిస్తే కేసీఆర్ రోడ్డుమీదకు: ఈటల రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment