
2015 నుంచి 2021 వరకు ‘హరితహారం’తో పెరిగిన పచ్చదనంలో తగ్గుదల
2023లో పోడు భూములకు పట్టాల జారీయే కారణం
ఫారెస్ట్ సర్వే రిపోర్ట్–2023లో ఆందోళనకర గణాంకాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం మళ్లీ తగ్గినట్లు ‘ఫారెస్ట్ సర్వే రిపోర్ట్–2023’లో తేలింది. తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడిన తర్వాత చేపట్టిన హరితహారం, వనమహోత్సవం కార్యక్రమాలతో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే పోడు భూములకు (Podu Lands) పట్టాలు జారీ చేసిన తర్వాత నుంచి అడవులు తగ్గటం మొదలైందని రిపోర్ట్‌లో వెల్లడైంది.
13 జిల్లాల్లో తగ్గుదల
హరితహారం (Haritha Haram)తో రాష్ట్రంలో మోస్తరుగా ఉన్న అడవులు (Forests) చిక్కబడడం మొదలైంది. 2015లో 511 చ.కి.మీ.లు ఉన్న దట్టమైన అడవులు.. 2021 నాటికి 1,623 చ.కి.మీ.కు పెరిగాయి. అదే కాలంలో బహిరంగ అడవుల విస్తీర్ణం 7,477 చ.కి.మీ.ల నుంచి 10,471 చ.కి.మీ.కు పెరిగింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోడు భూములకు పట్టాలు జారీ చేయడంతో వనాల పెరుగుదలకు బ్రేక్ పడినట్లయింది. మొత్తం 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. 20 జిల్లాల్లో పెరుగుదల నమోదైంది. మొత్తంగా 2021 నాటి గణాంకాలతో పోలిస్తే 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 100 చ.కి.మీ.లు అటవీ విస్తీర్ణం తగ్గింది.
అగ్నిప్రమాదాలు, స్మగ్లర్ల నుంచి ముప్పు ఉన్నప్పటికీ అడవులు తగ్గిపోవడానికి పోడు సాగే ప్రధాన కారణమని అటవీశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు గడిచిన పదేళ్లలో హరితహారం, వన మహోత్సవాలతో అడవులు తక్కువగా ఉన్న జిల్లాలో పచ్చదనం పెరిగింది. రోడ్ల పక్కన, ఖాళీ, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బంజరు భూములు, గుట్టలు, చెరువులు, కాల్వల వెంట, ప్రజల ఇళ్ల ప్రాంగణాల్లో మొక్కలు పెంపకం వల్ల ఈ జిల్లాల్లో పచ్చదనం మెరుగైంది. కనుమరగయ్యే దశలో ఉన్న మోస్తరు అడవులు ఉనికిని నిలుపుకోగలిగాయి.
చదవండి: స్కూల్ చుట్టూ చీరలు.. సంగతేంటి సారూ!
పదేళ్లలో హరితహారం, వన మహోత్సవాలతో అడవులు తక్కువగా ఉన్న జిల్లాలో పచ్చదనం పెరిగింది. రోడ్ల పక్కన, ఖాళీ, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బంజరు భూములు, గుట్టలు, చెరువులు, కాల్వల వెంట, ప్రజల ఇళ్ల ప్రాంగణాల్లో మొక్కలు పెంపకం వల్ల ఈ జిల్లాల్లో పచ్చదనం మెరుగైంది. కనుమరగయ్యే దశలో ఉన్న మోస్తరు అడవులు ఉనికిని నిలుపుకోగలిగాయి.

అడవులను కాపాడుకోవాలి
మొక్కలే ప్రాణకోటికి మూలాధారం. అడవుల విస్తీర్ణం పెంచేలా ప్రభు త్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. అడవిలో ఒక చెట్టు పోతే 4 చెట్లు నాటాలి. లేదంటే రాబోయే తరాలకు భవిష్యత్తే ఉండదు.
– వనజీవి రామయ్య, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రెడ్డిపల్లి, ఖమ్మంజిల్లా

పోడుతోనే నష్టం
అడవులు విస్తారంగా ఉన్న జిల్లాల్లో రెవెన్యూ స్థలాలు తక్కువ. హరితహారంతో ఈ జిల్లాల్లో మోస్తరు అడవులు దట్టంగా మారాయి. అయితే, ఈ జిల్లాల్లో పోడు కారణంగా ఎక్కువ అటవీ భూభాగం కోల్పోయాం.
– కిష్టాగౌడ్, భద్రాద్రి జిల్లా అటవీ శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment