ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం పరిధిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పెద్దదోర్నాల : ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం పరిధిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పారిశుద్ధ్య కార్మికులు మండలంలోని చింతల గ్రామంలో పారిశుద్ధ్య పనులు చూసుకుని మంగళవారం సాయంత్రం శ్రీశైలం వైపు తిరుగు ప్రయాణం అయ్యారు.
కాగా వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పెద్దమూల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్మికులు కిరణ్, రత్నం, వెంగళరావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.