![TSRTC Bus Hit Divider On Srisailam Ghat Road - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/29/Bus.jpg.webp?itok=cgbbh0SF)
సాక్షి, శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ధ ఘాట్ రోడ్డులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. టీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తృటిలో ఈ ప్రమాదం నుంచి 30 మంది ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వివరాల ప్రకారం.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. టీఎస్‌ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా.. అదుపు తప్పి ప్రాజెక్ట్ లోయ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డివైడర్ రైయిలింగ్‌కు ఆనుకుని ఆగిపోయింది. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment