srisailam ghat road
-
శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం
-
శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.శ్రీశైలం ముఖద్వారం నుంచి ఈగలపెంట వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 20 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో సందర్శకులు తాకిడి భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకులు క్యూ కట్టారు.ఘాట్ రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. మున్ననూర్ అటవీ చెక్ పోస్టు నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. డ్యామ్‌కు రెండువైపులా సుమారు 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షలకుపైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా కళకళ లాడుతోంది. దీంతో సాగర్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
వన విహారం చేద్దాం రండి
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం... ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులులు, చిరుతలు, జింకలు, దుప్పులు మరెన్నో వన్యప్రాణులు కనువిందు చేస్తాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చికబయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ ఓపెన్ జిప్సీల్లో పర్యటిస్తూ ఉంటే ఆ అనుభూతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి అద్భుత అవకాశాన్ని అటవీశాఖ పర్యాటకులకు కల్పించింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డులో తుమ్మలబైలు సమీప ప్రాంతం నుంచి ‘జంగిల్ సఫారీ’ పేరుతో అటవీ ప్రాంత సందర్శనకు ఏర్పాట్లు చేసింది. వివిధ ప్యాకేజీలతో పర్యాటకులు సురక్షితంగా అటవీ ప్రాంతాన్ని చుట్టి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది.విభిన్న ప్యాకేజీలతో టైగర్ సఫారీ..పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలో మీటరు వద్ద ఉన్న గోర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి ఓపెన్ జిప్సీల్లో ‘టైగర్ సఫారీ’ ప్రయాణం మొదలవుతుంది. మొదటి ప్యాకేజీగా రాను, పోనూ కలిపి 26 కిలోమీటర్ల మేర ప్రయాణం ఉంటుంది. దీని ధర రూ.2,400. (ఆరుగురు) లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూ పాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా సాగే ఈ ప్రయాణం తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో ముగుస్తుంది. రెండవ ప్యాకేజీ ధర రూ.4 వేలు(ఆరుగురు). ఈ ప్యాకేజీలో 40 కిలోమీటర్ల మేర నల్లమలలో ప్రయాణం ఉంటుంది. నల్లమలలోని పెద్దారుట్ల గేట్, పెద్దారుట్ల వాచ్ టవర్, బేస్ క్యాంపు, పుల్లలదొన, గుడిమెట్ల, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా ప్రయాణం ఉంటుంది.కనువిందు చేస్తున్న వన్యప్రాణులు జంగిల్ సఫారీలో భాగంగా నల్లమలలో జిప్సీ వాహనంలో పర్యటిస్తున్న సందర్శకులకు రాజసానికి ప్రతీకగా నిలిచే పెద్దపులులు కనువిందు చేస్తుంటాయి. పులిచెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న పెద్దపులులు, చిరుతలు, కృష్ణజింకలు, దుప్పులు, నెమళ్లు తారసపడుతుండటంతో పర్యాటకులు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతున్నారు. అదేవిధంగా జంగిల్ సఫారీ ప్రారంభమయ్యే గోర్లెస్ కాలువ ప్రాంతం వద్ద ఏర్పాటుచేసిన పర్యావరణ విజ్ఞాన కేంద్రం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ కేంద్రంలో పెద్దపులి, జింకలు, కృష్ణజింక, నీల్గాయ్, సాంబార్, హనీబ్యాడ్జర్, మూషిక జింకలు, రెడ్ జంగిల్ పౌల్, గ్రే జంగిల్ పౌల్, హార్న్‌బిల్ పక్షులు, గుడ్లగూబ, నెమలితోపాటు ఎన్నో రకాల పక్షుల అందమైన ఆకృతులను ప్రతిష్టించారు.దీంతోపాటు సరికొత్త టెక్నాలజీతో ఒక్కో వన్యప్రాణి బొమ్మ వద్ద నిలబడినప్పుడు ఆ వన్యప్రాణి అరుపులతోపాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లౌడ్ స్పీకర్లో వినబడేలా ఏర్పాట్లుచేశారు. వాహనాలు ప్రయాణించే దారి పొడవునా ఉండే వివిధ జాతుల వృక్షాలపై వాటి పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటుచేసి సందర్శకులకు అవగాహన కలి్పస్తున్నారు. మరోవైపు నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సాగే ఈ జంగిల్ సఫారీని సుక్షితులైన అటవీ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణం మధ్యలో వాహనాలు మరమ్మతులకు గురైతే ఉన్నతాధికారులకు సమాచారం అందించి మరో వాహనాన్ని ఘటనాస్థలానికి పంపించేలా అధునాతన టెక్నాలజీతో కూడిన వాకీటాకీలను వినియోగిస్తున్నారు. -
వనం నుంచి జనం మధ్యకు వస్తున్న మృగాలు
-
శివనామస్మరణతో మారుమోగిన నల్లమల్ల అడవి
-
శ్రీశైలం ఘాట్ రోడ్డులో తృటిలో తప్పిన పెను ప్రమాదం..
సాక్షి, శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ధ ఘాట్ రోడ్డులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తృటిలో ఈ ప్రమాదం నుంచి 30 మంది ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా.. అదుపు తప్పి ప్రాజెక్ట్ లోయ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డివైడర్ రైయిలింగ్‌కు ఆనుకుని ఆగిపోయింది. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
-
Tiger Mating Season: ఏకాంతమైతేనే 'సై'ఆట
ఆత్మకూరు రూరల్: జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు శ్రీశైలం అటవీ రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలను తాత్కాలికంగా అటవీ శాఖ నిలిపేసింది. ఇష్టకామేశ్వరి క్షేత్రం ఒక్కటే కాదు.. అన్ని పర్యావరణ పర్యాటక కేంద్రాలనూ ఈ మూడు నెలలు మూసివేశారు. ఇది పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం(బ్రీడింగ్ పీరియడ్) అయినందున వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షలకు కారణమని అటవీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్దపులి ఎంతో సిగ్గరి మనస్థత్వం కలిగినది. ఎంతో ఠీవీగా రాజసంతో నడిచే పెద్దపులి తన సంగమ సమయంలో మాత్రం పూర్తిగా ఏకాంతాన్ని కోరుకుంటుంది. అడవిలో ఏ చిన్న అలజడి రేగినా పులులు సంగమంలో పాల్గొనవు. అయితే తరుచూ అడవుల్లో మానవ సంచారం కారణంగా పెద్ద పులుల్లో సంగమించడం తగ్గిపోయి గర్భధారణ అవకాశాలు పడిపోతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) 2015లో పులుల అభయారణ్యాలున్న రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు రుతుపవనాల సమయమైన జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు అభయారణ్యాల్లో మానవ సంచారాన్ని అదుపు చేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలను ఎన్ఎస్టీఆర్(నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్), జీబీఎం(గుండ్ల బ్రహ్మేశ్వరం) అభయారణ్యాల పరిధిలో అటవీ శాఖ అమలు చేస్తోంది. దీంతో అభయారణ్యాల పరిధిలోని అన్ని ఎకో టూరిజం రిసార్ట్లు, జంగల్ సఫారీలు, పుణ్యక్షేత్రాలను మూసివేశారు. అవసరం అనుకుంటే ఈ నిషేధాజ్ఞలను మరో రెండు నెలలు కూడా పొడిగించే అవకాశాలున్నాయి. తల్లి తలపైకెక్కిన పులి కూనలు ఆ సమయంలో మనుషుల పైనా దాడి చేసే అవకాశం పులులు సంతానోత్పత్తి సమయాల్లో చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. సంగమం సమయంలో ఆవేశంతో మనుషులపై దాడులకు పాల్పడతాయి. అందుకే పులుల సంతానోత్పత్తి కాలంలో నల్లమలలోని అన్ని పర్యాటక, పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేయించాం. – అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్‌వో, ఆత్మకూరు డివిజన్, నంద్యాల జిల్లా -
నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్
అసలే దట్టమైన నల్లమల అభయారణ్యం.. ఎత్తయిన ఘాట్ రోడ్డు.. భారీ మలుపులు.. వాహనదారుల అజాగ్రత్తలతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే రెండువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. సంఘటన స్థలానికి అంబులెన్స్, పోలీసు వాహనాలు చేరుకునేందుకు కూడా అష్టకష్టాలు పడాలి.. ఈలోపు క్షతగాత్రుల ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొని ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లలో వాహన ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయడం.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో చెక్ పెడుతున్నారు. పెద్దదోర్నాల: ► శ్రీశైలం వైపు వేగంగా వెళ్తున్న ఓ టూరిస్టు బస్సు ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోయి అదుపుతప్పి తుమ్మలబైలు వద్ద బోల్తాపడిన సంగతి పాఠకులకు విధితమే. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ► మూడు రోజుల కిందట ఓ కారు శ్రీశైలం ఘాట్ రోడ్డులో సాక్షి గణపతి ఆలయ సమీపంలో బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. అధిక శాతం వాహనదారులకు ఘాట్ రోడ్లపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. అతివేగం కారణంగా జరుగుతున్న అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తోంది. ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక రోడ్లతో పాటు అత్యంత ప్రమాదకర రోడ్లుగా నల్లమల అభయారణ్యంలోని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లను గుర్తించారు. ఘాట్ రోడ్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు లేజర్ స్పీడ్ గన్లతో పరిశీలించి వాహనాల మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా జరిమానాలు విధించేందుకు బ్రీత్ ఎనరైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో వాహనదారులకు పరీక్షలు.. మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు కర్నూలు రహదారిపై వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం వలన అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తేలడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దానివలన ఏ తప్పూ చేయని ఎదుటి వ్యక్తుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఘాట్ రోడ్లపై 40 కి.మీ వేగానికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వేగంతోనే తరుచూ ప్రమాదాలు.. మితిమీరిన వేగం, వాహనాలను నడిపే సమయంలో నిర్లక్ష్యం కారణంగానే ఘాట్ రోడ్లపై ఎక్కువగా వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు రోడ్డులోని రోళ్లపెంట నుంచి మండల కేంద్రం వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు రహదారులూ ఘాట్ రోడ్లే. ఈ మార్గాలలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు, భక్తులు వందలాది వాహనాల్లో శ్రీశైలం వెళ్తారు. కొన్నేళ్లుగా ఘాట్ రోడ్లలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని ముఖ్య రహదారులపై ప్రయాణించే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు లేజర్ గన్లను వినియోగిస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు జరిమానాలు, ఈ–చలానాలు విధిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి వెళ్లే రహదారులతో పాటు, అత్యంత క్లిష్టమైన శ్రీశైలం ఘాట్ రోడ్డులో స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. మితిమీరిన వేగంగా వెళ్తున్న వాహనాలను కంట్రోలు చేసేందుకు స్పీడు గన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేగ నియంత్రణకు పటిష్ట చర్యలు మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల వలనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందువలన అతివేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు ఘాట్ రోడ్లలో స్పీడ్ గన్లను వినియోగిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించి జరిమానాలు విధిస్తున్నాం. దీనివలన రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలుగుతున్నాం. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం. సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపటం అనర్థదాయకం. - మారుతీకృష్ణ, సీఐ, యర్రగొండపాలెం -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి
-
శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్‌లో టిప్పర్ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో 2 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన మండల పరిధి చింతల గిరిజన గూడెం సమీపంలో శుక్రవారం జరిగింది. శ్రీశైలం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో సంఘటన స్థలానికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అందిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం నుంచి శ్రీశైలానికి కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ టైర్.. మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చింతల వద్ద బరస్టయింది. టిప్పర్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. వారి వివరాలు తెలియలేదు. రోడ్డు పక్కన కొంత మేర ఖాళీ ఉండటంతో చిన్న వాహనాలు మాత్రం ట్రాఫిక్ నుంచి బయట పడ్డాయి. రోడ్డుకు ఇరువైపులా ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్ బస్సులు, టారీలు టిప్పర్ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కొందరు ఆర్టీసీ, టిప్పర్ల సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ఉన్న టిప్పర్‌ను తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్ఐ రామకోటయ్య, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న టిప్పర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. సుమారు 2 గంటల తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో ప్రయాణాకులు బతుకు జీవుడా..అంటూ బయటపడ్డారు. ప్రయాణికుల అవస్థలు ట్రాపిక్కు అంతరాయం ఏర్పడటంతో రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. సుమారు 43 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నట్టనడివిలో వాహనాలు నిలిచి పోవడంతో ఆయా వాహనాల్లో ప్రయాణించే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం తొలగే వరకూ తీవ్ర ఉక్కపోత నడుమే ప్రయాణికులు తమ తమ వాహనాల్లో ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు వాహనాల్లో ఉండలేక సమీపంలో ఉన్న చెట్ల నీడన సేదతీరినా భానుడి ప్రచండ వీక్షణాలకు తట్టుకోలేక అల్లాడిపోయారు. ప్రయాణికుల నీటి ఇబ్బందులను ముందే గ్రహించిన ఎస్ఐ రామకోటయ్య తన వాహనంలో కూల్ కంటైనర్‌తో నీరు తెప్పించి ప్రయాణికుల దాహార్తి తీర్చారు. -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో బుధవారం ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా కైకలూరు చెందిన వీరంతా శ్రీశైలం యాత్రకు వచ్చారు. ఈ క్రమంలో ఉదయం ఓ ప్రైవేటు బస్సులో వెళ్తుండగా ఘాట్ రోడ్డులోని రామయ్య మలుపు వద్దకు చేరుకోగానే బస్సు బోల్తా పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ జగన్ దిగ్ర్భాంతి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించి జిల్లా పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాడ సానుభూతి తెలిపారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని రామయ్య టర్నింగ్ పాయింట్ వద్ద ఘాట్ రోడ్డులో ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 10 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి శ్రీశైలానికి తీర్ధయాత్రలో భాగంగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా
పెద్దదోర్నాల : ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం పరిధిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పారిశుద్ధ్య కార్మికులు మండలంలోని చింతల గ్రామంలో పారిశుద్ధ్య పనులు చూసుకుని మంగళవారం సాయంత్రం శ్రీశైలం వైపు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పెద్దమూల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్మికులు కిరణ్, రత్నం, వెంగళరావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అభయారణ్యంలో.. భయం భయంగా..
పెద్దదోర్నాల, న్యూస్‌లైన్ : అడవుల్లో చెట్లను విచక్షణ లేకుండా నరికేయడంతో వన్యప్రాణులకు రక్షణ కరువవుతోంది. అడవుల్లో నీరు, ఆహారం దొరక్కపోవడంతో కొన్ని ప్రాంతాల్లో జంతువులు జనవాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇలా వచ్చిన జంతువులు మానవ మృగాల ఉచ్చులో చిక్కి బలవుతున్నాయి. రోడ్లను దాటే క్రమంలో అతి వేగంగా వెళ్లే వాహనాల కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. మనుషుల్లా పశుపక్ష్యాదులకూ అది వర్తిస్తుంది. వన్యప్రాణులు, అటవీ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి బాధ్యతగా అధికారులకు సహకరించాలి. లేదంటే జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అతివేగానికి బలవుతున్న జంతువులు ఘాట్ రోడ్లలో వాహనాలపై వేగ నియంత్రణ ఉన్నా.. కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి వన్యప్రాణుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. రోడ్లపై అటూఇటూ స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల మరణానికి కారకులవుతున్నారు. అభయారణ్యంలో ఇటువంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటుండటంతో వన్యప్రాణుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన తల్లితో పాటు రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. చిరుతకు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలజికల్ పార్క్‌కు తరలించారు. 2012 ఫిబ్రవరి 16వ తేదీన కర్నూలు రోడ్డులోని పెద్ద మంతనాల సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో జింక మృత్యువాత పడింది. మృతిచెందిన జింక మాంసాన్ని సేకరించిన నల్లగుంట్ల, అయ్యన్నకుంటకు చెందిన కొందరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2012 ఫిబ్రవరి 20వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు దాటుతున్న చారల దుప్పిని వేగంగా వస్తున్న ఓ వాహనం ఢీకొనడంతో దుప్పి రెండు కాళ్లు నలిగిపోయాయి. 2013 నవంబర్ 28వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని పెద్దచేమ బీట్ పరిధిలో రోడ్డు దాటుతున్న ఓ జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కడుపులోని బిడ్డతో సహా జింక మృత్యువాతపడింది. కొన్నేళ్ల క్రితం హర్యానాకు చెందిన ఓ ముఠా అభయారణ్యంలోని ఓ పెద్దపులిని, ఎలుగుబంటిని హతమార్చింది. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. చెంచు కుంట సమీపంలో చిరుత తమ మేకలను చంపుతోందంటూ కొందరు గొర్రెల కాపరులు చనిపోయిన మేక కళేబరంలో విషం పెట్టడంతో.. దాన్ని తిన్న ఓ చిరుత మృత్యువాతపడింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై ఎటువంటి సాక్ష్యాలు లభించకపోవడంతో ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు. విషం తిని మరణించిన చిరుత సంఘటన మరవక ముందే ల క్ష్మీపురం వద్ద సాగర్ కాలువ నీటిలో ఓ చిరుత మృతదేహం కొట్టుకొచ్చింది. ఇవే కాకుండా ఘాట్ రోడ్లలో జరిగిన ప్రమాదాల్లో ఎన్నో జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. సాక్ష్యాలను సమర్పించడంలో అధికారుల వైపల్యం.. వణ్యప్రాణులు, అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడాలంటే నిజ నిర్ధారణకు అవసరమయ్యే సాక్ష్యాలను న్యాయస్థానాలకు సమర్పించాల్చిన అవసరం ఉంది. వైల్డ్ లైఫ్ యాక్ట్, అటవీ చట్టాల ఉల్లంఘన, అక్రమార్కులకు విధించే శిక్షలు, సిబ్బంది ప్రాథమిక విధులు, తదిత ర అంశాలపై అటవీ శాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు.. నేరపరిశోధనలో మాత్రం వెనుకబడుతున్నారు. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయకపోవడం, నేరారోపణకు సంబంధించి సరైన సాక్ష్యాలను కోర్టు ఎదుట ప్రవేశపెట్టకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కేసులు బలహీనపడుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో నేర ప్రవృత్తి ఉన్న దుండగులు బరితె గించి విలువైన వనసంపదను తరలించడంతో పాటు, వన్యప్రాణులపై దాడులకు తెగబడుతున్నారు. అటవీ సిబ్బంది విధి నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుని దోషులను గుర్తించి శిక్షలుపడేలా చేయగలిగితే వనాలను, వణ్యప్రాణాలన కాపాడుకోగలం. -
మృత్యువులోనూ వీడని బంధం
పెద్దదోర్నాల, న్యూస్‌లైన్: నిండు నూరేళ్లూ కలిసి జీవించాల్సిన ఆ దంపతులను మృత్యువు లారీ రూపంలో కబళించింది. అప్పటి వరకూ సొంతూరు వెళ్తున్నామన్న ఆనందం వారిలో క్షణాల్లో ఆవిరైంది. ఆ జంట ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని తుమ్మల బైలు సమీపంలో తెట్టగుండం గేటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పెద్దదోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన కంభం పాలంకయ్య (44) శ్రీశైలం ప్రాజెక్టు ఏపీజెన్‌కోలో ప్లాంట్ అటెండెంట్‌గా పనిచేస్తున్నారు. తన భార్య లింగమ్మ(38)తో కలిసి బైకుపై శ్రీశైలం నుంచి స్వగ్రామం బయల్దేరారు. తెట్టగుండం గేటువద్ద వెనుకగా వచ్చిన లారీ వేగాన్ని నియంత్రించుకోలేక వీరు ప్రయాణిస్తున్న బైకును వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా మృతుల వివరాలు గుర్తించారు. స్థానిక ఎస్సై బీవీవీ సుబ్బారావు వచ్చి ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు ఉద్యోగులు, చిన్నదోర్నాలలో ఉన్న పాలంకయ్య బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సొంతింటి కల నెరవేరకుండానే.. పాలంకయ్య దంపతులు ఇటీవల స్వగ్రామం చిన్నదోర్నాలలో సొంతింటి నిర్మాణానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా వారసత్వంగా వచ్చిన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన పాలంకయ్య దంపతులు.. కొంతకాలం నుంచి విధుల అనంతరం తరచూ చిన్నదోర్నాలకు వచ్చి వెళ్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇంటిని చూసుకునేందుకు వస్తున్న పాలంకయ్య దంపతులను మృత్యువు లారీ రూపంలో కబళించింది. మిన్నంటిన రోదనలు పాలంకయ్య దంపతుల మృతదేహాలను చూసి బంధువులు, సహోద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడు అందిరితో స్నేహభావంతో ఉండేవాడని స్థానికులు పేర్కొన్నారు. మృతుల కుమారుడు మల్లికార్జున, కుమార్తె మల్లేశ్వరితో పాటు లింగమ్మ తల్లిదండ్రులు చిన్నగురవయ్య, కాశమ్మలు సంఘటన స్థలంలో రోదించినతీరు అక్కడి వారిని కలచి వేసింది. స్వగ్రామంపై మమకారంతో.. పాలంకయ్య, లింగమ్మలిద్దరి స్వగ్రా మం చిన్నదోర్నాల. స్వయానా తన సోదరి కాశమ్మ కుమార్తె లింగమ్మను 16 ఏళ్ల క్రితం పాలంకయ్య వివాహం చేసుకున్నారు. స్వగ్రామంపై మమకారంతో వారు తరచూ వచ్చే వారని స్థానికులు పేర్కొంటున్నారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామంలో జీవించాలని దంపతులు భావించారు. ఆ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు అన్యోన్యంగా జీవిం చే ఆ జంట ద్విచక్ర వాహనంపై వస్తుం డగా అనుకోని సంఘటన జరిగింది.