శ్రీశైలం ఘాట్ రోడ్డు (ఫైల్ ఫొటో)
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో బుధవారం ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా కైకలూరు చెందిన వీరంతా శ్రీశైలం యాత్రకు వచ్చారు.
ఈ క్రమంలో ఉదయం ఓ ప్రైవేటు బస్సులో వెళ్తుండగా ఘాట్ రోడ్డులోని రామయ్య మలుపు వద్దకు చేరుకోగానే బస్సు బోల్తా పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించి జిల్లా పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాడ సానుభూతి తెలిపారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment