bus roll
-
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో బుధవారం ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా కైకలూరు చెందిన వీరంతా శ్రీశైలం యాత్రకు వచ్చారు. ఈ క్రమంలో ఉదయం ఓ ప్రైవేటు బస్సులో వెళ్తుండగా ఘాట్ రోడ్డులోని రామయ్య మలుపు వద్దకు చేరుకోగానే బస్సు బోల్తా పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ జగన్ దిగ్ర్భాంతి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించి జిల్లా పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాడ సానుభూతి తెలిపారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
పెళ్లి బస్సు బోల్తా: 10 మందికి గాయాలు
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొళ్లపల్లి వద్ద పెళ్లి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. హిందూపురం డిపోకు చెందిన బస్సు ఉరవకొండ నుంచి పాలసముద్రం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు టైరు పంక్చర్ కావడంతోనే బస్సు బోల్తాపడినట్లు ప్రాధమికంగా సమాచారం. -
విహారయాత్రలో అపశ్రుతి
- బస్సు బోల్తా -25 మంది విద్యార్థులకు గాయాలు కోవెలకుంట్ల: విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు అనంతపురం జిల్లా నుంచి బయలుదేరిన విహారయాత్ర బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు ఉపాధ్యాయుల పరిస్థితి విషమంగా ఉంది. సంజామల ఎస్ఐ విజయభాస్కర్, గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు వివరాలు... జిల్లాలోని అహోబిల్, బెలుం గుహలు, మహానంది, శ్రీశైలం, యాగంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం ఉడ్డేగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 68 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంగళవారం ఉదయం బయలుదేరారు. పేరుసోమల-ఆల్వకొండ ఆర్అండ్ బీ రహదారి గుండా అహోబిలం వెళుతుండగా సంజామల మండలం రెడ్డిపల్లి సమీపంలోని ఈద్గా మలుపు వద్ద బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనను తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థుల -
మినీ బస్సు బోల్తా: నలుగురికి గాయాలు
నకరికల్లు: గుంటూరు జిల్లాలో మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో నల్లగొండ జిల్లా వాసులు గాయపడ్డారు. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన 13 మంది అయ్యప్పభక్తులు మినీ బస్సులో శబరిమలై నుంచి వస్తున్నారు. వారి వాహనం శనివారం ఉదయం అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లవారిపాలెం గ్రామం వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
బస్సు బోల్తా: 18 మంది విద్యార్థులకు గాయాలు
ఉంగటూరు: ఓ కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది విద్యార్థులు గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం కాకర్లమూడి వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడేనికి చెందిన యూకే కళాశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో 18 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ కారణమని విద్యార్థులు తెలిపారు. కాగా, డ్రైవర్ పరారయ్యాడు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా: 40 మందికి గాయాలు
రామాయం పేట: మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సు బాసర నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. -
కేశినేని బస్సు బోల్తా: 15 మందికి గాయాలు
-
కేశినేని బస్సు బోల్తా: 15 మందికి గాయాలు
నల్లగొండ: కేశినేని ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు అదే దారిలో వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం
ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి బస్సు బోల్తా కొట్టింది. ప్రయాణికుల అదృష్టం కొద్ది తృటిలో వారు ప్రాణాపాయస్థితినుంచి బయటపడ్డారు. ఆరుమందికి తీవ్ర గాయాలయ్యాయి. సెల్ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం తోలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు డ్రైవర్‌ను చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేశారు. - పెబ్బేరు కొందరు ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారనడానికి ఇదొ క ఉదాహరణ. వనపర్తికి చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 28జెడ్ 3331) బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సం ప్రటావ్పల్లికి వెళ్లేందుకు ఆయా గ్రామాలకు చెందిన సుమారు 40 మంది ప్రయాణికులతో వనపర్తి నుంచి బయలు దే రింది. పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ గ్రామం దాటాక పుల్గర్‌చర్ల వరకు రా గానే ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రయాణికులు ఒకరిమీద మరొకరు సీట్లకింద పడిపోయారు. వెనుక, ముందున్న అద్దాలతోపాటు కిటికీ అద్దాలు పగలడంతో స్వల్ప గాయాలైన ప్రయాణికులు లోపలినుంచి బయటికి వచ్చారు. సంఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చా రు. అనంతరం బస్సులో ఇరుక్కుపోయి న ప్రయాణికులను బయటికి తీసి వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో వనపర్తి చెందిన చిన్న హనుమన్న, వీపనగండ్లకు చెందిన ఈశ్వరయ్య ఆచారి, దేవమ్మ, రామలక్ష్మ మ్మ, కల్వరాలకు చెందిన కుర్మయ్య, గుం టూరు జిల్లాకు చెందిన కంబ్లీబాయిలు ఉన్నారు. వారిలో ఈశ్వరయ్య ఆచారిని, రామలక్ష్మమ్మలను మెరుగైన వైద్యం కో సం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మిగిలిన వారికి వనపర్తిలోనే చికిత్సలు చేయిస్తున్నారు. డ్రైవర్‌ను చితకబాదిన ప్రయాణికులు ఇదిలావుండగా డ్రైవర్ బాలకృష్ణ సెల్ఫో న్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పడంతో కొందరు ప్రయాణికులు అతన్ని వెంబడించి చితకబాదా డు. కాసేపటి తర్వాత డ్రైవర్ వారినుంచి తప్పించుకొని పారిపోయాడు. ఇదిలావుంటే బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటన స్థలాన్ని పెబ్బేరు ఎస్ఐ జితేందర్‌రెడ్డి పరిశీలించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు. బాధితుల పరామర్శ వనపర్తి రూరల్ : బస్సు ప్రమాదంలో గా యపడిన ఆరుగురిని వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆర్డీఓ రాంచందర్ పరామర్శించారు. సంఘటన జరిగిన తీ రును తెలుసుకున్నారు. గాయపడిన వా రినిప్రభుత్వం తరుపున ఆదుకుంటామ ని భరోసా ఇచ్చారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. బాధితు లు కోలుకునేవరకు మెరుగైన వైద్యం అం దించాలని వైద్యులు భాస్కర్‌ను ఆదేశించారు. అనంతరం అక్కడినుంచి డిపో మేనేజర్ కృష్ణయ్యతో సంఘటన గురించి మాట్లాడారు.