ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం | RTC driver negligence | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం

Published Thu, Oct 30 2014 4:14 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం - Sakshi

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం

ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి బస్సు బోల్తా కొట్టింది. ప్రయాణికుల అదృష్టం కొద్ది తృటిలో వారు ప్రాణాపాయస్థితినుంచి బయటపడ్డారు. ఆరుమందికి తీవ్ర గాయాలయ్యాయి. సెల్‌ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం తోలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు డ్రైవర్‌ను చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేశారు.                            - పెబ్బేరు
 
 కొందరు ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారనడానికి ఇదొ క ఉదాహరణ. వనపర్తికి చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 28జెడ్ 3331) బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సం ప్రటావ్‌పల్లికి వెళ్లేందుకు ఆయా గ్రామాలకు చెందిన సుమారు 40 మంది ప్రయాణికులతో వనపర్తి నుంచి బయలు దే రింది. పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ గ్రామం దాటాక  పుల్గర్‌చర్ల వరకు రా గానే ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.

ప్రయాణికులు ఒకరిమీద మరొకరు సీట్లకింద పడిపోయారు. వెనుక, ముందున్న అద్దాలతోపాటు కిటికీ అద్దాలు పగలడంతో స్వల్ప గాయాలైన ప్రయాణికులు లోపలినుంచి బయటికి వచ్చారు. సంఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చా రు. అనంతరం బస్సులో ఇరుక్కుపోయి న ప్రయాణికులను బయటికి తీసి వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

గాయపడిన వారిలో వనపర్తి చెందిన చిన్న హనుమన్న, వీపనగండ్లకు చెందిన ఈశ్వరయ్య ఆచారి, దేవమ్మ, రామలక్ష్మ మ్మ, కల్వరాలకు చెందిన కుర్మయ్య, గుం టూరు జిల్లాకు చెందిన కంబ్లీబాయిలు ఉన్నారు. వారిలో ఈశ్వరయ్య ఆచారిని, రామలక్ష్మమ్మలను మెరుగైన వైద్యం కో సం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మిగిలిన వారికి వనపర్తిలోనే చికిత్సలు చేయిస్తున్నారు.

 డ్రైవర్‌ను చితకబాదిన ప్రయాణికులు
 ఇదిలావుండగా డ్రైవర్ బాలకృష్ణ సెల్‌ఫో న్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పడంతో కొందరు ప్రయాణికులు అతన్ని వెంబడించి చితకబాదా డు. కాసేపటి తర్వాత డ్రైవర్ వారినుంచి తప్పించుకొని పారిపోయాడు. ఇదిలావుంటే బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటన స్థలాన్ని పెబ్బేరు ఎస్‌ఐ జితేందర్‌రెడ్డి పరిశీలించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు.

 బాధితుల పరామర్శ
 వనపర్తి రూరల్ : బస్సు ప్రమాదంలో గా యపడిన ఆరుగురిని వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆర్డీఓ రాంచందర్ పరామర్శించారు. సంఘటన జరిగిన తీ రును తెలుసుకున్నారు. గాయపడిన వా రినిప్రభుత్వం తరుపున ఆదుకుంటామ ని భరోసా ఇచ్చారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. బాధితు లు కోలుకునేవరకు మెరుగైన వైద్యం అం దించాలని వైద్యులు భాస్కర్‌ను ఆదేశించారు. అనంతరం అక్కడినుంచి డిపో మేనేజర్ కృష్ణయ్యతో సంఘటన గురించి మాట్లాడారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement