సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.శ్రీశైలం ముఖద్వారం నుంచి ఈగలపెంట వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 20 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో సందర్శకులు తాకిడి భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకులు క్యూ కట్టారు.
ఘాట్ రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. మున్ననూర్ అటవీ చెక్ పోస్టు నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. డ్యామ్‌కు రెండువైపులా సుమారు 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షలకుపైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా కళకళ లాడుతోంది. దీంతో సాగర్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment