Heavy Traffic Jam
-
ట్రాఫిక్ లోనే సగం జీవితం.. కొవ్వొత్తిలా కరిగిపోతున్న సమయం.. సమస్య తీరేది ఎప్పుడు..?
-
వరుసగా సెలవులు.. ఊర్లకు పరుగులు
-
శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.శ్రీశైలం ముఖద్వారం నుంచి ఈగలపెంట వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 20 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో సందర్శకులు తాకిడి భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకులు క్యూ కట్టారు.ఘాట్ రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. మున్ననూర్ అటవీ చెక్ పోస్టు నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. డ్యామ్‌కు రెండువైపులా సుమారు 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షలకుపైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా కళకళ లాడుతోంది. దీంతో సాగర్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వల్ల నల్గొండ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
-
Hyderabad: నగరంలో భారీగా ట్రాఫిక్‌జాం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షం నగరానికి మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. నగరంలో చాలాచోట్ల వాన నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే భారీగా పలు రూట్లలో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ కారిడార్.. హైదరాబాద్ శివారు అయిన సైబరాబాద్‌లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఐకియా నుంచి జేఎన్టీయూ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు నానక్‌రామ్ గూడ, బయో డైవర్సిటీ రూట్లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ రూట్లలోనూ భారీ వర్షంతో ట్రాఫిక్‌కు విఘాతం కలుగుతోంది. మరికాసేపట్లోనూ వర్షం కురవొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో.. ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశాలతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదీ చదవండి: మళ్లీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ -
Hyderabad Rains Traffic Photos: విశ్వ నగరంలో ట్రాఫిక్‌లో పడిగాపులు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం
-
సంక్రాంతి ఎఫెక్ట్.. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
-
మూసాపేట నుంచి కేపీహెచ్‌బీ వరకు భారీగా ట్రాఫిక్ జామ్
-
లాక్డౌన్ 4.0 : భారీగా ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ : ఢిల్లీ-నోయిడా సరిహద్దులో సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేటి నుంచి ప్రారంభమైన నాలుగో విడత లాక్డౌన్లో భాగంగా పలు సడలింపులు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైకి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోపక్క చెక్‌పోస్ట్‌ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించడం కూడా ఇందుకు కారణమయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు సూచనలు జారీచేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు నోయిడా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఈ-పాస్‌లు ఉన్నవారినే మాత్రమే నోయిడాలోకి అనుమతిస్తున్నారని తెలిపారు. కలిండి కుంజ్ బ్యారేజ్ ఫ్లైఓవర్, డీఎన్డీ ఫ్లై ఓవర్ ద్వారా ప్రయాణం చేయాలని అనుకునేవారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కాగా, లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ఆదివారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ 4.0లో భాగంగా షాపులు, మార్కెట్లు, కార్యాలయాలు ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించింది. ఒకవేళ అవసరమనుకుంటే రాష్ట్రాలు అదనపు అంక్షలు విధించుకోవచ్చని తెలిపింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం ఈ సడలింపులు ఉండబోవని స్పష్టం చేసింది. (చదవండి : లాక్డౌన్ : కేంద్రం కీలక ఆదేశాలు) -
ఏపీ-తెలంగాణ బోర్డర్లో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్-తెలంగాణ బోర్డర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ నుంచి వెళ్లే వాహనాలను తెలంగాణ అధికారులు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాలను ఏపీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గరికపాడు చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ విధులు నిర్వరిస్తున్న సిబ్బంది.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ క్రమంలో కలెక్టర్ల జోక్యంతో సమస్య పరిష్కారమైంది. దీంతో ఇరువైపుల సరైన పత్రాలు కలిగిన వాహనాల ప్రయాణానికి అనుమతించారు. మరోవైపు వలస కూలీలు ప్రయాణిస్తున్న నాలుగు బస్సులను మాత్రం పునరావాసానికి తరలించారు. వారి ప్రయాణానికి అనుమతి వచ్చాక పంపుతామని చెక్‌పోస్ట్ సిబ్బంది తెలిపారు. చదవండి : ‘చిన్న తరహా పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం’ కరోనా యోధులకు గౌరవ వందనం -
చలో ప్రగతి భవన్: నగరంలో భారీ ట్రాఫిక్ జామ్!
-
స్వామీజీతో ప్రచారం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
స్వామీజీతో ప్రచారం.. కి.మీ మేర ట్రాఫిక్ జామ్..!
సాక్షి, నల్లగొండ : నార్కెట్ పల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నార్కెట్ పల్లి-చిట్యాల మధ్య కిలోమీటర్ల పొడవున వాహనాలు జామ్ కావడంతో కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ సిబ్బంది చేతులెత్తేశారు. బుధవారం రోజున వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే సర్వ రోగాలు నయమవుతాయని ఓ స్వామీజీ చెప్పడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వచ్చారు. హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వేణుగోపాలస్వామి దర్శనం కోసం వచ్చిన వేలాదిమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులను తప్పుదోవ పట్టించేందుకు కావాలనే స్వామీజీ చేత ప్రచారం చేయించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం
చౌటుప్పల్: సంక్రాంతి సెలవులు ముగిశాయి. తమ స్వగ్రామాలకు వెళ్లిన వారు అందరూ హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో వారు ప్రయాణిస్తున్న వాహనాలతో యాదాద్రి భువనగిరిజిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. -
కీసర టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్‌జాం
సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తుండటంతో కృష్ణా జిల్లాలోని కీసర టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు వస్తుండంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి కీసర టోల్గేట్ వద్ద పెద్ద మొత్తంలో వాహనాలు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు ప్రతినిధులు తెలిపారు. రద్దీ మరింత పెరగనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
సికింద్రాబాద్ - బేగం పేట భారీ ట్రాఫిక్ జమ్
-
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భాగ్యనగరం నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వేల సంఖ్యలో వెళ్తున్న వాహనాలతో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై నల్గొండజిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్ను చెల్లించేందుకు వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగడంతో రద్దీ చాలా పెరిగిపోతుందని వాహనదారులు చెబుతున్నారు. ఒకవైపు సొంత వాహనాలున్న వారు, మరోవైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య నేడు అధికంగా ఉంది. నేడు భోగి పండుగ కాగా, రేపు (శనివారం) మకర సంక్రాంతిని కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ఇళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు నగరం ఖాళీ అవుతుంటే.. పండక్కి గ్రామాలకు వెళ్లేవారితో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. -
టోల్‌ప్లాజాల దగ్గర సంక్రాంతి సందడి
-
సంక్రాంతి ఎఫెక్ట్, భారీగా ట్రాఫిక్ జాం
-
సంక్రాంతి ఎఫెక్ట్, భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఉదయం భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంక్రాంతి పండగ పురస్కరించుకుని హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాల్లో బయలుదేరారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి వాహనాల రాకపోకలతో మరింత రద్దీ పెరిగింది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పన్ను చెల్లించేందుకు వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నకిరేకల్ సమీపంలోని కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నోట్ల రద్దుతో స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్: పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మన నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోల్‌ప్లాజాల వద్ద రూ. 500, రూ.1000 నోట్లు తీసుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని టోల్గేట్ల వద్ద బుధవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. టోల్గేట్ సిబ్బంది ‘పెద్ద’నోట్లు తీసుకోవడానికి నిరాకరించడంతో.. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలోని పంతంగి, మాడ్గులపల్లి, సూర్యాపేట జిల్లాలోని కేతెపల్లి టోల్గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ అంశంపై టోల్ ప్లాజా అధికారులను సంప్రదించగా నోట్లు తీసుకోవడానికి నిరాకరించడం లేదని.. సరిపడ చిల్లర లేకపోవడం వల్లే ఈ ఇబ్బంది తలెత్తుతుందని అంటున్నారు. -
దీపావళి షాపింగ్‌తో ట్రాఫిక్ జామ్
-
3 కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
-
తెలంగాణలో పుష్కరాలకు ట్రాఫిక్ కష్టాలు
-
రాజమండ్రిలో భారీగా నిలిచిపోయిన వాహనాలు
-
ఖమ్మంలో భారీగా ట్రాఫిక్‌జామ్
-
టీడీపీ జెండా ఉంటేనే పోనిస్తాం...
తాడేపల్లి (గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంకల్ప యాత్ర కారణంగా జాతీయ రహదారిపై టీడీపీ జెండా ఉన్న వాహనాలకు మాత్రమే అధికారులు అనుమతినిస్తున్నారు. సోమవారం నాలుగు లైన్ల జాతీయ రహదారిపై రెండు లైన్లలో మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను అనుమతిస్తున్నారు. మరో వైపు ఉన్న రెండు లైన్లలో సంకల్ప యాత్రకు వచ్చిన వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో జాతీయరహదారిపై వెళ్తున్న అనేక వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అంబులెన్స్‌ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా అంబులెన్స్‌లో తరలిస్తున్న ఒక రోగిని కొంతదూరం నడిపించి అక్కడి నుంచి వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. -
కండెక్టర్ ను కొట్టిన ఎస్ ఐ..భారీగా ట్రాఫిక్ జాం
గుంటూరు: నరసరావు పేటలో రోడ్డుపై బస్సు ఆపారని ఆర్టీసీ కండెక్టర్ ను ఎస్ఐ లోక్ నాథ్ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆర్టీసీ సిబ్బంది బస్సులను బస్టాండ్ వద్ద ఆపి ఎస్సై వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.కండక్టర్ కు క్షమాపణ చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని సిబ్బంది తెగేసి చెప్పారు. -
రైలులో ఊపిరాడక చిన్నారి మృతి!