సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తుండటంతో కృష్ణా జిల్లాలోని కీసర టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
టోల్‌గేట్ వద్ద భారీగా వాహనాలు వస్తుండంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి కీసర టోల్‌గేట్ వద్ద పెద్ద మొత్తంలో వాహనాలు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు ప్రతినిధులు తెలిపారు. రద్దీ మరింత పెరగనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment