సాక్షి, హైదరాబాద్: భారీ వర్షం నగరానికి మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
నగరంలో చాలాచోట్ల వాన నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే భారీగా పలు రూట్‌లలో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ కారిడార్.. హైదరాబాద్ శివారు అయిన సైబరాబాద్‌లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.
ఐకియా నుంచి జేఎన్‌టీయూ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు నానక్‌రామ్ గూడ, బయో డైవర్సిటీ రూట్‌లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ రూట్‌లలోనూ భారీ వర్షంతో ట్రాఫిక్‌కు విఘాతం కలుగుతోంది. మరికాసేపట్లోనూ వర్షం కురవొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో.. ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశాలతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఇదీ చదవండి: మళ్లీ తెలంగాణకు ఎల్లో అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment