టీడీపీ జెండా ఉంటేనే పోనిస్తాం... | Heavy traffic jam due to Sankalpa Yatra in Guntur district | Sakshi
Sakshi News home page

టీడీపీ జెండా ఉంటేనే పోనిస్తాం...

Published Mon, Jun 8 2015 5:09 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Heavy traffic jam due to Sankalpa Yatra in Guntur district

తాడేపల్లి (గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంకల్ప యాత్ర కారణంగా జాతీయ రహదారిపై టీడీపీ జెండా ఉన్న వాహనాలకు మాత్రమే అధికారులు అనుమతినిస్తున్నారు. సోమవారం నాలుగు లైన్ల జాతీయ రహదారిపై రెండు లైన్లలో మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను అనుమతిస్తున్నారు. మరో వైపు ఉన్న రెండు లైన్లలో సంకల్ప యాత్రకు వచ్చిన వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో జాతీయరహదారిపై వెళ్తున్న అనేక వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అంబులెన్స్‌ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా అంబులెన్స్‌లో తరలిస్తున్న ఒక రోగిని కొంతదూరం నడిపించి అక్కడి నుంచి వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement