
మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స, వేదికపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్కే, కోన, గోపిరెడ్డి్డ, పార్టీ నాయకులు రావి, మోపిదేవి, శ్రీకృష్ణదేవరాయలు, సురేష్, జంగా, సుచరిత తదితరులు
సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్ సీపీకి ప్రజలు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలను రూపొందించుకోవాలని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నేతలకు దిశానిర్దేశం చేశారు. గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర విజయవంతమైందని, అదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. పార్టీకి సంబంధించి బూత్ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమాలపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పార్టీ స్థితిగతులపై ఆరా తీశారు. ప్రత్యేక హోదాతోపాటు పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
సమావేశంలో గుంటూరు, బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు రావి వెంకటరమణ, మోపిదేవి వెంకటరమణారావు, గుంటూరు, బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌కుమార్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, పార్టీ ప్రధాన కార్యదర్శులు మర్రి రాజశేఖర్, కిలారి రోశయ్య, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, వినుకొండ, తెనాలి, పెదకూరపాడు, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కావటి మనోహర్‌నాయుడు, మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు యేళ్ళ జయలక్ష్మి, జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు పానుగంటి చైతన్య, యువజన విభాగం నాయకుడు దుర్గ, రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, మందపాటి శేషగిరిరావు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి, గోళ్ల శివశంకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment