bothsa sathya narayana
-
చిన్న వయసులోనే అవార్డు తీసుకుంటే మిగిలిన విద్యార్థులు ఎలా ఉంటారంటే
-
పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు వద్దు: బొత్స
సాక్షి, విజయనగరం : నలభై ఏళ్ల క్రితం విజయనగరం జిల్లాగా ఏర్పడినప్పుడు ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాం కానీ మూడు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి అభివృద్దిపై దృష్టి సారించకపోవడం మన దురదృష్టమని ఆ జిల్లా నేత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విజయనగరం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను మున్సిపాలిటీలుగా మార్చినప్పుడు ఆనందపడ్డాం గానీ, తర్వాత వాటిని ఒక్క జీవోతో రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగడంతో పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతోందని, దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు అత్యవసరమని భావించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో శత పనుల శంఖుస్థాపన కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. పట్టణంలో 24 గంటల నీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఇసుక సమస్యను అధిగమించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. సోషల్ మీడియాలో రాతల గురించి ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అందరిళ్లల్లోనూ మహిళలు ఉంటారని వారిని కించపరుస్తూ మాట్లాడవద్దని హితవు పలికారు. పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలాడడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. -
చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు: బొత్స
సాక్షి, విజయవాడ : గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు ముందే వస్తే ఎందుకు అమలు చేయలేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం మన్సిపల్ కమిషనర్లు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడిందని విమర్శించారు. ఒక్క మున్సిపల్ శాఖలోనే రూ. 15 వేల కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు. ప్రచార ఆర్భాటాలకు వందల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసిందని, అన్నా క్యాంటీన్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న విషయం వాస్తవమేనని అందుకు బొగ్గు కొరత కారణమన్నారు. ప్రభుత్వంపై కన్నా లక్ష్మీ నారాయణ చేస్తున్న విమర్శలు ఏ దృష్టితో చేస్తున్నారో ఆయనే చెప్పాలని స్పష్టం చేశారు. 110 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని బొత్స వెల్లడించారు. మరోవైపు నిరాశ్రయులకు పునరావాసం కల్పించేందుకు ముగ్గురు అధికారులు, మూడు ఎన్జీవోలతో కలిసి అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు జరిగిన వర్క్‌షాప్ సమావేశంలో ఎమ్ఎ అండ్ యుడి శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ.. మోప్మా ద్వారా షల్టర్ ఫర్ హోంలెస్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కార్యక్రమాలు, ప్రాథమిక ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి నలభై మందికి పైగా ఎన్జీవోలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆ శాఖ సెక్రటరీ శ్యామలారావు మాట్లాడుతూ.. పురపాలక కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం లాంటి కొన్ని లోపాలు ఉన్నాయన్న ఆయన షల్టర్లు ఉన్నాయన్న విషయం చాలామంది కమిషనర్లకు తెలీదని వ్యాఖ్యానించారు. అధికారులు ఆఫీసులకు పరిమితం కావద్దని, క్షేత్రస్థాయిలో వెళ్తేనే ఫలితాలు ఉంటాయని సూచించారు. ఒక స్థాయిలో మార్కెట్లో మంచి పేరు వచ్చాక ఆన్లైన్ సైట్లకు లింక్ చేసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. అంతేకాక, యువతకు స్కిల్ ట్రైనింగ్, ఎంప్లాయిమెంట్ సరిగ్గా జరగడం లేదని సమావేశ దృష్టికి తీసుకొచ్చారు. -
విశ్వసనీయత... విధేయత...
రాష్ట్ర కేబినెట్లో జిల్లాకు తగిన ప్రాధాన్యం లభించింది. ఇద్దరిని మంత్రి పదవులు వరించాయి. ఒకరు అనుభవంలో దిట్ట... మరొకరు విశ్వసనీయతకు మారుపేరు. వారే బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి. సామాజిక వర్గ సమతూకం పాటించి... పాత కొత్తలను మేళవించి... పార్టీ పురోగమనమే లక్ష్యంగా భావించి... సంచలన నిర్ణయంతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం జిల్లావాసులను ఆనందంలో ముంచెత్తింది. సాక్షిప్రతినిధి, విజయనగరం: అనుభవానికి, విశ్వసనీయతకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టం గట్టారు. సీనియర్ నేత బొత్ససత్యనారాయణ, ఎస్టీ మహిళా నేత పాముల పుష్పశ్రీవాణిలకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వవస్థీకరణ ఉంటుందని, కొత్తవారికి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చి అసంతృప్తి అనేదే లేకుండా సుపరిపాలనవైపు అడుగులు వేయిస్తున్నారు. పరిచయం అవసరం లేనిసీనియర్ ప్రజా ప్రతినిధి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడిగా ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రాధాన్యక్రమంలోనే ఉంటారు. ప్రజా సేవలో తాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన అసలు సిసలైన రాజకీయ నేతగా కీర్తి గడించారు. తన ఎదుగుదలకు పునాది వేసిన చీపురుపల్లి నియోజకవర్గంపై అమితమైన ప్రేమాభిమానాలను మదినిండా నింపుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో వైఎస్సార్సీపీ నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొం దారు. ఇప్పుడు ఏకంగా జగన్ మంత్రి వర్గం లో స్థానం సంపాదించారు. విద్యార్థిసంఘ నాయకుడిగా మొదలుపెట్టి, డీసీసీబీ చైర్మ న్, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, పీసీసీ అధ్యక్షు డు వంటి అత్యున్నత హోదాల్లో పనిచేసిన అనుభవం బొత్సకు ఉంది. దివంగత ము ఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హ యాంలో కీలక భూమిక పోషించిన బొత్స తదనంతర పరిణామాల్లో జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడ్డారు. సతీమణి బొత్సఝాన్సీ కూడా ఎంపీగా పనిచేసిన అనుభవంతో పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. జిల్లాలో జగన్ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న సమయంలోనూ, విజయమ్మ జిల్లాలో పర్యటించినపుడు వారి వెన్నంటి ఉన్నారు. బొత్స దంపతులు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి అహర్నిశలు పరితపించారు. జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృ షి చేశారు. రాష్ట్రంలో పార్టీ విజయదుందుభి మోగించడానికి అవసరమైన ప్రణాళికల రచనల్లో జగన్‌కు చేదోడువాదోడుగా ఉన్నారు. బొత్స అనుభవం రాష్ట్రంలో సంక్షేమ పాలనకు అవసరమని భావించిన సీఎం జగన్మోహన్రెడ్డి తన టీమ్‌లో బొత్స సత్యనారాయణ ప్రాధాన్యం ఇచ్చారు. గిరిజనులకు అండదండ... పుష్పశ్రీవాణి గిరిజనులు తమ ఇంటి ఆడబిడ్డగా భావించే పాముల పుష్పశ్రీవాణి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి నుంచి విజయనగరం జిల్లాకు కోడలిగా వచ్చారు. 2014లో కురుపాం నియోజకవర్గం చినమేరంగికి చెందిన శత్రుచర్ల పరీక్షిత్‌రాజును వివాహం చేసుకున్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె పరీక్షిత్‌ను వివాహమాడి అదే ఏడాది ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో 19 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. మొదటి నుంచీ వైఎస్ కుటుంబాన్ని అమితంగా అభిమానించే శ్రీవాణి తనకేదైనా కష్టం వస్తే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో దగ్గరకు వెళ్లి చెప్పుకుంటుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు దేవుడితో సమానమని అంటుంటారు. తాము విలువలకే ప్రాధాన్యం ఇస్తామని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించారు. టీడీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా... ఎంతటి ప్రలోభాలు ఎదురైనా లొంగలేదు. జగన్‌పైనే విశ్వసనీయత చూపించారు. తమకున్న అభిమానాన్ని చాటిచెప్పడం కోసం చేతిపై ‘వైఎస్ఆర్’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలకోసం నిరంతరం పోరాడారు. తాజా ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు టీడీపీ చేసిన వశ్వప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆమెపైనా, ఆమె భర్తపైనా హత్యాయత్నానికి పాల్పడినా బెదరలేదు. అనేక కుట్రలను ఎదుర్కొని ఈ రోజు మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. పేరు: పాముల పుష్పశ్రీవాణి తండ్రి: నారాయణరావు తల్లి: గౌరీ పార్వతి భర్త: శత్రుచర్ల పరీక్షిత్‌రాజు గ్రామం: చినమేరంగి, విజయనగరం జిల్లా విద్యార్హతలు: బీఎస్సీ, బీఈడీ పుట్టినతేది: 22–6–1986 పేరు : బొత్స సత్యనారాయణ విద్యార్హత: బీఏ, మహారాజా కళాశాల,విజయనగరం తండ్రి: బొత్స గురునాయుడు తల్లి: ఈశ్వరమ్మ భార్య : బొత్స ఝాన్సీలక్ష్మి(మాజీ ఎంపి) జననం : 9–7–1958 పిల్లలు : ఒక కుమారుడు, ఒక కుమార్తె నివాసం : కోరాడ వీధి, విజయనగరం పొలిటికల్ కెరీర్: 1978–80: విజయనగరం మహరాజా కళాశాలలో విద్యార్థి సంఘ నాయకత్వం 1992–99: విజయనగరం డీసీసీబీ చైర్మన్ 1996, 1998లో ఎంపీగా పోటీ చేసి ఓటమి 1999లో ఎంపీగా గెలుపు 2004, 2009: చీపురుపల్లి ఎమ్మెల్యేగా విజయం. 2004 నుంచి వైఎస్సార్ కేబినెట్లో మొదటి విడతలో భారీ పరిశ్రమలశాఖ, రెండవ విడతలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పని చేశారు. రోశయ్య కేబినెట్లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్ కేబినెట్లో రవాణాశాఖా మంత్రిగా పని చేశారు. 2012 – 2015: పీసీసీ చీఫ్‌గా అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై 26,518 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయ ప్రవేశం 2014లో పుష్పశ్రీవాణి వైఎస్సార్సీపీ తరఫున కురుపాం నుంచి పోటీచేసి సమీప టీడీపీ అభ్యర్థి వి.టి.జనార్దన్ థాట్రాజ్‌పై 19,083 ఓట్లు మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థి నర్శింహప్రియ థాట్రాజ్‌పై 26,602 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. -
రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణం వీడిపోయింది
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌తో ఐదు సంవత్సరాలుగా ప్రజలు పడిన ఇబ్బందులతో పాటు రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడిపోయిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం రాత్రి విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు సంబంధించి కొన్ని ఘటనలు మినహా పోలింగ్ శాతం పెరగడం మంచి పరిణామమన్నారు. చివరిలో టీడీపీ దౌర్జన్యపూరితమైన, వారికున్న సహజగుణంతో దారుణమైన ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రధానంగా కురుపాం శాసనసభ్యురాలు పుష్పశ్రీవాణి, ఆమె భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి.. రాష్ట్రమంతా ఉధృతంగా ఫ్యాన్ గాలి వీచిందని బొత్స చెప్పారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కళ్లకు కట్టినట్లు కనిపించిందనీ, చట్టాలను చేతుల్లోకి తీసుకుని, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వారికి, సంప్రదాయాలకు తూట్లు పొడిచేలా పాలన సాగించే వారెవ్వరికైనా శిక్ష తప్పదని అన్నారు. హామీలన్నీ తప్పక నెరవేరుస్తాం.. ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి, ఏమైతే హమీలిచ్చారో వాటిని తప్పక నెరవేరుస్తామని బొత్స చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్ మళ్లీ రాజకీయంగా పుట్టాలని కోరుకున్నారనీ, అందుకే జగన్ నాయకత్వాన్ని బలపరిచారని స్పష్టం చేశారు. సాక్షాత్తూ స్పీకరే పోలింగ్ బూత్‌లో కూర్చుని బయటకు వెళ్లాలంటూ ఓటర్లపై దౌర్జన్యం చేస్తే ఏ విధంగా ప్రజలు ఎదురు తిరుగుతారో రుజువైందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం టీఆర్ఎస్ తమకు మద్దతిస్తుందని, దానిని పూర్తిగా స్వాగతిస్తామని చెప్పారు. ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ మద్దతిచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. -
రాష్ట్రం ఇక కురుక్షేత్రమే..
విశాఖపట్నం , ఆనందపురం(భీమిలి): రాష్ట్రంలో కురుక్షేత్రం మొదలైందని, ఈ యుద్ధంలో అవినీతితో కూరుకుపోయిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే వైఎస్సార్సీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. అందుకు ప్రతీ నాయకుడు, కార్యకర్త కంకణబద్ధులై ముందుకు నడవాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బంక సత్యం అధ్యక్షతన ఆనందపురంలో శుక్రవారం నిర్వహించిన భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలను నాశనం చేసే గంటా లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వరాదని, అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్లు, సీట్లు కోసం జగన్ మోహన్ రెడ్డి బీసీ డిక్లరేషన్ చేయలేదని, అట్టడుగు సామాజికవర్గాల సంక్షేమాన్ని కాంక్షించి వైఎస్సార్ పాలనను తిరిగి తేవడానికే సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని వివరించారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: బూడి శాసనసభాపక్ష ఉపనేత, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకొని రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేయడంతో రాష్ట్రాభివృద్ధి జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని భావించి అవంతి శ్రీనివాస్ పార్టీలోకి వచ్చారన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్లపై పోరాటం చేయకుండా సొంత ఎంపీలనే కట్టడి చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. హోదా గురించి ప్రస్తావిస్తే సీఎం మందలించేవారు వైఎస్సార్సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, ఆయన అనుచరగణం భూకబ్జాలు, అవినీతి గురించి చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లినా పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి ఎప్పడు ప్రస్తావించినా మందలించేవారని, అలాంటి ముఖ్యమంత్రితో రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించి తాను జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీలోకి వచ్చానని స్పష్టం చేశారు. భీమిలిలో గట్టిగా పునాది వేసిన తన శ్రమ ఫలితంగానే గంటా గెలవగలిగారన్నారు. పార్టీ పార్టమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్ మాట్లాడుతూ అవంతి శ్రీనివాసరావు గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఇక్కడ ప్రజలు మరలా ఇక్కడకు రావాలని కోరుకోవడంతోనే ఆయన విజయం ఖరారైందన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ అవంతి విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల సమన్వయకర్తలు కె.కె.రాజు, పి.వి.రమణమూర్తి మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త శరగడం చిన్న అప్పలనాయుడు, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నియోజకవర్గాల సమన్వయకర్తలు అదీప్‌రాజు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, యు.కన్నబాబు రాజు, పార్టీ సీయూసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి, విశాఖ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, సుంకరి గిరిబాబు, డి.గోపిరాజు, కోరాడ వెంకటరావు, చందక బంగారునాయుడు, ఆనందపురం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కనకల రామారావు తదితరులు పాల్గొన్నారు. భారీగా టీడీపీ నాయకుల చేరిక సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, వారి అనుచరులు వైఎస్సార్సీపీలో భారీ సంఖ్యలో చేరారు. భీమిలి మండలం రేఖవానిపాలెం మాజీ సర్పంచ్ సమ్మిడి శ్రీనివాస్, భీమిలి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లి కోటిరెడ్డి, మూలకుద్దు మాజీ ఉపసర్పంచ్ కొయ్యి రామకృష్ణ, చిప్పాడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గిరజాల రమణ, పద్మనాభం మండలం పాండ్రంగి ఎంపీటీసీ పాలూరి స్వామినాయుడు, కోన అప్పలనాయుడు, కర్రోతు రాంబాబు, మద్ది గ్రామం నుంచి కనకాల నాయుడు, ఆనందపురం మండలం, చందక మాజీ ఉప సర్పంచ్ పాలూరి అప్పలస్వామి, సహకార సంఘం మాజీ డైరెక్టర్ యర్ర రామకృష్ణతో పాటు ఆయా నాయకులు, ముఖ్య అనుచరులు సుమారు 300 మంది వరకు పార్టీలో చేరారు. -
జిల్లాకు అశోక్ ఏం చేశారు!
విజయనగరం, నెల్లిమర్ల: కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు జిల్లాకు ఏం చేశారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నెల్లిమర్ల–విజయనగరం రహదారిలో సారిపల్లి జంక్షన్లో ఉన్న జగన్నాధ ఫంక్షన్ హాలులో గురువారం నిర్వహించిన నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా కొనసాగిన ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఎందుకు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. ప్యాకేజీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మొదట్నుంచీ వత్తాసు పలికిన అశోక్ నాలుగేళ్లలో జిల్లాకు కేవలం రూ.50కోట్లు మాత్రమే తెప్పించగలిగారని ఆరోపించారు. ఆ విధంగా వచ్చిన నిధుల్లో రూ.22కోట్లు తన కోట చుట్టూ కందకం తవ్వించడానికే వినియోగించారని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించడం వెనుక అశోక్‌తో పాటు టీడీపీ నేతల స్వార్ధం ఉందన్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి కాంట్రాక్టును అప్పగించేందుకే టెండర్లను రద్దు చేసిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు అశోక్ దోపిడీని బయటపెడతానని బొత్స స్పష్టం చేశారు. రామతీర్ధ సాగర్ సంగతేంటి! నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన రామతీర్ధ సాగర్ ప్రాజెక్టును టీడీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు ఎందుకు గత నాలుగున్నరేళ్లలో పూర్తి చేయలేకపోయారని బొత్స ప్రశ్నించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత కలిగిన పతివాడ ప్రాజెక్టు నిర్మాణంపై ఎందుకు శ్రద్ధ చూపించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంచే కనీసం పిడికెడు మట్టి కూడా వేయించలేదన్నారు. కాంట్రాక్టర్లను మార్చినప్పుడల్లా కమీషన్లు వస్తాయనే కక్కుర్తితోనే ఈ విధంగా ఎమ్మెల్యే పతివాడ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలోని పరిశ్రమలన్నీ మూతబడ్డాయని, తాజాగా నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు కూడా మూతబడిందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనే భయంతోనే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తోందని బొత్స ఆరోపించారు. సర్వేల పేరుతో ఇంటింటికీ పంపించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పేవారి ఓట్లను ఆధార్ సాయంతో తొలగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని బొత్స సూచించారు. వారి పరిధిలోని ఓట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని, ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స సాంబశివరాజు, కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, పతివాడ అప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు. -
టీడీపీ పాలనలో ఒరిగింది శూన్యం
విజయనగరం , డెంకాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఒరిగింది శూన్యమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో మోపాడ గ్రామంలోని ఓ లేఅవుట్లో డెంకాడ, భోగాపురం మండలాలకు చెందిన పార్టీ బూత్ కన్వీనర్లు, సభ్యులు, నాయకులకు శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ముందుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రిగా మృణాళిని పని చేశారని, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా సుజయ్‌కృష్ణ రంగారావు పని చేస్తున్నారని వీరి హయాంలో జిల్లాలో ప్రజలు గుర్తించుకునే మంచి పని ఒక్కటి కూడా చేయలేదన్నారు. వీరంతా డొల్ల నాయకులన్నారు. భోగాపురం ఎయిపోర్టుకు అవసరాన్ని మించి భూములను సేకరించాలని చూసిందని, దీనిపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మద్దతుగా భోగాపురం వచ్చి పోరాడటంతో భూ సేకరణను 18 వేల ఎకరాల నుంచి 2వేల 6 వందల ఎకరాలకు ప్రభుత్వం తగ్గించుకుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు మళ్లీ తనకు వచ్చిన గజకర్ణ, గోకర్ణ విద్యలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తాడని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో బూత్ కన్వీనర్లు పాత్ర చాలా కీలకమన్నారు. అందరి ఓట్లు ఓటర్ల జాబితాల్లో ఉన్నాయో లేదో చూసి లేకపోతే చేర్పించాలన్నారు. బూత్ కన్వీనర్ల పాత్ర కీలకం ఎన్నికల గెలుపులో బూత్ కన్వీనర్లు పాత్ర చాలా కీలకమని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని బూత్ కన్వీనర్లు చాలా అప్రమత్తంగా పని చేయాలన్నారు. ఓటర్ల జాబితాలను బూత్ కన్వీనరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి ఓట్లను కూడా తొలగించారని వైఎస్సార్ సీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఇప్పటికే చేర్పులు, మార్పులకు సంబంధించిన ధరఖాస్తులను నాయకులకు అందించామన్నారు. అధికార టీడీపీ నాయకులు అధికారం కోసం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, దీనిలో భాగంగా ఓట్లు తొలగింపు, మార్పులు వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని, అందువలన బూత్ కన్వీనర్లు, సభ్యులు చాలా అప్రమత్తంగా ఉండాలని నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. ప్రతీ కుటుంబాన్ని కలవాలి ప్రతీ ఎన్నికల బూత్‌కి వైఎస్సార్సీపీ ఒక కన్వీనర్, పది మంది సభ్యులను నియమించిందని, వీరు ప్రతీ కుటుంబాన్ని కలిసి ఓటర్ల జాబితాల్లో ఓట్లు ఉన్నయో లేదో తెలుసుకోవడంతో పాటు నవరత్నాలు పథకాలను ప్రతీ ఇంటికీ వెళ్లి అందరికీ వివరించాలని కార్యక్రమం పరిశీలకుడు ఆదిత్య మనోహర్ అన్నారు. గతంలో ఇలాంటి వ్యవస్థ వైఎస్సార్ సీపీకి లేకపోవడం వలన ఎలాంటి నష్టం జరిగిందో వివరించారు. బూత్ కమిటీలు ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యక్రమం పరిశీలకుడు బాబిరెడ్డి, నాయకులు అంబళ్ల శ్రీరాములనాయుడు, జెడ్పీటీసీ గదల సన్యాశినాయుడు, డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ మండలాల పార్టీ అధ్యక్షులు బంటుపల్లి వాసుదేవరావు, చనుమల్లు వెంకటరమణ, ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, డెంకాడ, భోగాపురం మండలాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాలుగేళ్లలో చేసింది శూన్యం : బొత్స
మెరకముడిదాం: తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనలో జిల్లాలోగాని, చీపురుపల్లి నియోజకవర్గంలోగాని జరిగిన అభివృద్ధి శూన్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. మెరకముడిదాంలో రూ.3లక్షలతో నిర్మించిన తొమ్మిది అడుగుల దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనలో ఆ పార్టీ గ్రామ స్థాయి నేతల నుంచి అందరూ దోచుకో...దాచుకో...విధానమే పాటిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా టీడీపీ నాయకులు డబ్బులు వసూలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. గతంలో తాను మంత్రిగా ఉన్న కాలంలో ఒక్క మెరకముడిదాం గ్రామంలోనే 850 ఇళ్లను పేదలకు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు కనీసం అందులో పది శాతం ఇళ్లు 85 కూడా మంజూరు చేయలేదని చెప్పారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ...పేదల అభివృద్ధికే పాటుపడుతున్న జగన్మోహన్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో దీవించాలని కోరారు. జిల్లాలో ఓ వైపు డెంగీ జ్వరాలు బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే జిల్లా మంత్రికిగాని, ఎమ్మెల్యేలకుగాని పట్టడం లేదని, అధికారులు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం బాధాకరమన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను కూడా నిర్వహించలేని అసమర్ధ పాలన కొనసాగుతుందన్నారు. జిల్లా పార్టీ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానేత విగ్రహాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జనం మదిలో ఉన్న ఏకైక నాయకుడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందించిన మహావ్యక్తి అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణను, రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. టీడీపీ నాయకులు సంక్షేమ పథకాలు తమ ఇష్టానుసారం పంచుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వీ రమణరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు తాడ్డి కృష్ణారావు, తాడ్డి వేణుగోపాలరావు, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, గరివిడి మండల పార్టీ నాయకులు పొన్నాడ వెంకటరమణ, మీసాల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకులు శీర అప్పలనాయుడు, వరదా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధిలో బొత్స సేవలు ఎనలేనివి
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లా అభివృద్ధిలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ సేవలు ఎనలేనివని ఆ పార్టీ రాజకీయ, వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. సోమవారం బొత్స సత్యనారాయణ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలను మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. తమ అభిమాన నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక సత్య కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను బాణసంచా పేలుళ్ల సందడి నడుమ పార్టీ నాయకులు అవనాపు సోదరులు, యడ్ల రమణమూర్తి కట్ చేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తోటపల్లి, పెద్దగడ్డ, తారకరామ తీర్థసాగర్ వంటి జలాశయాల నిర్మాణానికి కృషి చేసి రైతులను ఆదుకున్నారన్నారు. పేదలకు పక్కా గృహాలు, పలు విద్యా సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించి విద్యాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో బొత్స నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నాయకుడు యడ్ల రమణమూర్తి మాట్లాడుతూ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన బొత్స సత్యనారాయణ ఆది నుంచి ప్రజా సమస్యలపై పోరాడేవారన్నారు. పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్ సోదరులు బొత్స సత్యనారాయణ సేవలను గుర్తు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయనగరం పట్టణంలో పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక సత్య కార్యాలయంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించగా... 200 మందికి పైగా విద్యార్థులు, నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కలెక్టరేట్ జంక్షన్, లంకవీధి, దాసన్నపేట మయూరి జంక్షన్లలో పేదలకు చీరలు పంపిణీ చేయగా.... గాజులరేగ, డక్కినవీధి ప్రాంతాల్లో గొడుగులు పంపిణీ చేశారు. కేవీఆర్ గోపాల్ సౌజన్యంతో ద్వారపూడి గ్రామానికి చెందిన ముగ్గురు వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేయగా, ఘోషాస్పత్రికి వీల్ చైర్ వితరణ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గాడు అప్పారావు, పిల్లా పద్మావతి, గంటా చినతల్లి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ లెంక వరలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు పిన్నింటి చంద్రమౌళి, కోరాడ సూర్యప్రభావతి, మంచాల శివాని, పొట్నూరు పద్మ, గదుల సత్యలత, దుక్క లక్ష్మి, ఎర్రంశెట్టి సునీత, యవర్ణ కుమారస్వామి, కరణం రమణరావు, పార్టీ నాయకులు ఎంఎల్ఎన్ రాజు, కలపర్తి లక్ష్మి, పిలకా శ్రీను, ముల్లు త్రినాథ్, చందక వెంకటరమణ, జనా ప్రసాద్, గదుల వెంకటరావు, దొంతల రమణ, ఒమ్మి శ్రీనివాసరావు, తోట మధు, రెడ్డి వెంకటేష్, సుంకరి నారాయణరావు, మునీర్, పతివాడ సత్యనారాయణ, కంది అప్పారావు పాల్గొన్నారు. -
నేడు బొత్స జన్మదిన వేడుకలు
విజయనగరం మున్సిపాలిటీ: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్టు పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, పిళ్లా విజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక సత్య కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బొత్స సత్యనారాయణ జన్మదినాన్ని పురష్కరించుకుని పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు స్థానిక సత్య కార్యాలయంలో మెగా రక్తదానం శిబిరం, 9 గంటలకు పట్టణంలోని గంజిపేట, కణపాక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ, 9.30 గంటలకు కలెక్టర్ ఆఫీసు జంక్షన్లో పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 10 గంటలకు గాజులరేగ మెయిన్రోడ్లో పేదలకు గొడుగులు పంపిణీ, 10.30 గంటలకు డక్కినవీధిలో పేదలకు గొడుగులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 12 గంటలకు మయూరి జంక్షన్ వద్ద పేదలకు చీరలు పంపిణీ, 12.30 గంటలకు ఆబాద్వీదిలో మదర్సా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ, పూల్‌బాగ్‌కాలనీలోని ద్వారకామయి అంధుల పాఠశాల, ప్రేమ సమాజంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. పార్టీ నాయకులు రొంగలి పోతన్న, ముల్లు త్రినాధ్, చందక రమణ, కంది అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మరింత చేరువ కావాలి
సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్ సీపీకి ప్రజలు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలను రూపొందించుకోవాలని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నేతలకు దిశానిర్దేశం చేశారు. గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర విజయవంతమైందని, అదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. పార్టీకి సంబంధించి బూత్ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమాలపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో పార్టీ స్థితిగతులపై ఆరా తీశారు. ప్రత్యేక హోదాతోపాటు పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో గుంటూరు, బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు రావి వెంకటరమణ, మోపిదేవి వెంకటరమణారావు, గుంటూరు, బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌కుమార్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, పార్టీ ప్రధాన కార్యదర్శులు మర్రి రాజశేఖర్, కిలారి రోశయ్య, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, వినుకొండ, తెనాలి, పెదకూరపాడు, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కావటి మనోహర్‌నాయుడు, మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు యేళ్ళ జయలక్ష్మి, జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు పానుగంటి చైతన్య, యువజన విభాగం నాయకుడు దుర్గ, రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, మందపాటి శేషగిరిరావు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి, గోళ్ల శివశంకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
విజయ మణిహారం
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఇంతవరకూ సొంతంగా పార్టీ కార్యాలయం లేకపోవడం.. ఇప్పుడు పూర్తి హంగులతో, అత్యాధునిక సౌకర్యాలతో మద్దిలపాలెం డాక్టర్.వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ కాలేజీ దగ్గర సొంత పార్టీ కార్యాలయం నిర్మితమవడం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. తమ గొంతు వినిపించేందుకు, తమ భావాలు పంచుకునేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు ఓ వేదిక దొరికినందుకు పార్టీ అంతర్గతంగానూ సమరోత్సాహం మొదలైంది. ఇందుకు పూర్తి సహాయం అందించిన పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ను ప్రశంసలతో ముంచెతుతున్నారు. కార్పొరేట్ లుక్‌తో కనిపిస్తున్న పార్టీ కార్యాలయాన్ని తిలకించేందుకు కార్యకర్తలు తరలివస్తున్నారు. వెయ్యిమందితో సమావేశానికి వీలుగా విశాలమైన సభాప్రాంగణం, ముఖ్యనేతల సమావేశానికి వీలుగా ఏసీ కాన్ఫరెన్స్ హాల్‌తోపాటు, ఎంపీ విజయసాయిరెడ్డి సహా, ఇతర నాయకులకు ప్రత్యేకంగా చాంబర్లు నిర్మించారు. పార్టీ కార్యాలయం విశాఖ ‘విజయ’ మణిహారంగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు. మళ్ల విజయప్రసాద్ తన సొంత నిధులతో అద్భుతంగా నిర్మించిన ఈ కొత్త కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మాడుగుల ఎమ్మెల్యే, శాసన సభాపక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం తదితరులు హాజరయ్యారు. నా చిరకాల కోరిక :మళ్ల విజయప్రసాద్ ‘సొంత నిధులతో సర్వాంగ సుందరంగా పార్టీ కార్యాలయం నిర్మించాలనే నా చిరకాల కోరిక నెరవేరింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీవెనలతో కార్యాలయం నిర్మించాం. సొంతింట్లో కలిసి మెలసి ఉండేలా కార్యకర్తలకు సదుపాయాలు కల్పించాం’. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు టీడీపీ నేతల అరాచకాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. దుష్టపాలనకు అంతిమ ఘడియలు: బూడి ముత్యాలనాయుడు ‘పార్టీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో రాష్ట్రంలో దుష్ట పరిపాలనకు అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయి. సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన టీడీపీని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నవరత్నాల పథకాలు నవ్యాంధ్రకు స్వర్ణమయం చేస్తాయి. పేదల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే జగన్ యాత్ర చేపట్టారు. జనం బ్రహ్మరథం పడుతున్నారు. మోసగాడు గంటా:గుడివాడ అమర్నాథ్ ‘ఒంగోలు నుంచి వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు రెండు దఫాలు మంత్రిగా చేసి, 20 ఏళ్లగా రాజకీయాల్లో ఉంటున్నా విశాఖ జిల్లాకు ఆయన చేసిందేమీ లేదు. మంత్రి ముగుసులో భూ కబ్జాలు, దందాలు చేస్తున్నారు. బ్యాంకులో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బురిడీ కొట్టించిన 420 మంత్రి ఆయన. జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి గురించి మాట్లాడే అర్హత ఇలాంటి మోసగాడికి లేదు. మంత్రి గంటా 420 అయితే సీఎం చంద్రబాబు 840. ప్రజాధనంతో చంద్రబాబు దుబాయ్‌కి, తనయుడు అమెరికాకు తిరుగుతున్నారు’. నిజాయితీకి మారుపేరు వైఎస్సార్ సీపీ: తైనాల ‘నిజాయితీ, నిబద్ధత, సొంత నిధులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నాం. టీడీపీలాగా దండుకొని, దందా చేసి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించలేదు. నిజాయితీగా సేవ చేయడానికి ప్రజాసంకల్పయాత్రతో మా పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి 3వేల కి.మీ పాదయాత్రకు పూనుకున్నారు. ఆ యాత్రకు వస్తున్న స్పందనతో టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా, ఇంత వరకు గవర్నర్‌ను మార్చమని అడగలేని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పడు కొత్త గవర్నర్ కావాలని అడగడం విడ్డూరంగా ఉంది’. -
'ప్రజలే మీ గుడ్డలు ఊడదీస్తారు'
హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజలే టీడీపీ ఎంపీల గుడ్డలు ఊడదీస్తారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీల వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం తాపత్రయ పడుతూ.. రాష్ట్ర ప్రతిష్టను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్ర మంత్రి చెబుతుంటే.. మిగతా మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టొద్దని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ఈనెల 10న దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. ఈ ధర్నా కోసం ఏపీ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు బొత్స విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
'రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు దోచుకుని దాచుకోవడానికే అనే విధంగా ప్రభుత్వ పాలన ఉందని ఆయన విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం లేదని.. రాజకీయ వ్యాపారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్న జరిగిన ఎమ్మార్వోపై దాడికి ప్రభుత్వ ఎమ్మెల్యేకు ప్రభుత్వం అండగా నిలబడటం సిగ్గు చేటన్నారు. సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మ్యాప్ ఇచ్చిందంటున్నారు. కానీ, సింగపూర్‌లో ఉన్న వారి భాగస్వాములను వ్యాపారం చేయడానికే తీసుకువచ్చారని ఆరోపించారు. దీనిపై మరిన్ని ఆధారాలు త్వరలోనే వెల్లడిస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొత్స
మాజీ ఎంపీ ఝాన్సీ, మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సయ్య సహా పెద్దఎత్తున చేరిన అనుచరగణం సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తన అనుచరగణంతో ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొత్సతోపాటుగా ఆయన సతీమణి ఝాన్సీ(మాజీ ఎంపీ), సోదరుడు అప్పల నర్సయ్య(మాజీ ఎమ్మెల్యే) తదితరులుసహా పెద్ద ఎత్తున నేతలు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీలో చేరారు. భారీ సంఖ్యలో అనుచరులు వెంట రాగా పీసీసీ మాజీ చీఫ్ బొత్స ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్‌లోని జగన్ నివాసానికి చేరుకున్నారు. తనతోపాటుగా కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్న విజయనగరం జిల్లా ముఖ్య నేతలందర్నీ జగన్‌కు పరిచయం చేసి పార్టీ కండువాలు కప్పించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వై.వి.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శులు ఎంవీ మైసూరారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, విజయనగ రం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి(ఎమ్మెల్సీ), మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, కె.పార్థసారథి, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, దాడిశెట్టి రాజా, బూడి ముత్యాలనాయుడు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కారుమూరు నాగేశ్వరరావుతో సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామి, సాంబశివరాజులను జగన్ ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. విజయనగరం కాంగ్రెస్ ఖాళీ... బొత్స, ఆయన అనుచరులు వైఎస్సార్సీపీలో చేరికతో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. మాజీ ఎమ్మెల్యేలు బి.అప్పలనాయుడు, పి.సూర్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ ఎం.తులసి, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వీ రమణరాజు, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వై.రమణమూర్తి, మాజీ డీసీసీ అధ్యక్షుడు పి.విజయకుమార్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఉమామల్లేశ్వరరావు, అర్బన్ బ్యాంకు చైర్మన్ పువ్వాజ నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నేతలు ఎం.శ్రీనివాసరావు, మరో 62 మంది ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లాలో ఒకటీ అరా నాయకులు మినహా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారంతా వైఎస్సార్సీపీలో చేరారని బొత్స స్వయంగా వెల్లడించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొత్స
-
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: బొత్స
విజయనగరం: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్దాలకోరని, తోటపల్లి ప్రాజెక్టు విషయంలో అన్నీ అసత్యాలు చెబుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. డీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టుకు 2003 బడ్జెట్లో రూ.352 కోట్లు కేటాయించినట్టు చంద్రబాబు అబద్ధం చెప్పారని ఆరోపించారు. ఇంత పచ్చిగా అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం పనులను పూర్తిచేసి నీరు అందించాలని టీడీపీ అధికారంలోకిరాగానే పత్రికా సమావేశం పెట్టి కోరామని పేర్కొన్నారు. కానీ ఈ ఖరీఫ్‌కు కూడా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రూ.120 కోట్లు ఖర్చు చేస్తే తోటపల్లి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. టీడీపీ నేతలు అర్భాటాలు మాని పనిచేసి చూపించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం తగదన్నారు. ప్రత్యేకా హోదాపై చట్టం తెస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అంటున్నారని, బిల్లు పెట్టినపుడు రాజ్యసభలో ఉన్న ఆయన చట్టంలో పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. -
ఎటు చూసినా వ్యతిరేకతే...!
-
'సీమాంధ్రను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతాం'