జిల్లా అభివృద్ధిలో బొత్స సేవలు ఎనలేనివి | Greatly Bothsa Birthday Celebrations | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధిలో బొత్స సేవలు ఎనలేనివి

Published Tue, Jul 10 2018 11:12 AM | Last Updated on Tue, Jul 10 2018 11:12 AM

Greatly Bothsa Birthday Celebrations - Sakshi

కేక్‌ కట్‌ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు  రమణమూర్తి,  అవనాపు విజయ్,విక్రమ్‌ 

విజయనగరం మున్సిపాలిటీ : జిల్లా అభివృద్ధిలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ సేవలు ఎనలేనివని ఆ పార్టీ రాజకీయ, వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.

సోమవారం బొత్స సత్యనారాయణ  60వ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలను   మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. తమ అభిమాన నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ  కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం స్థానిక సత్య కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను బాణసంచా పేలుళ్ల సందడి నడుమ పార్టీ నాయకులు అవనాపు సోదరులు, యడ్ల రమణమూర్తి కట్‌ చేశారు.

ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న  బొత్స సత్యనారాయణ తోటపల్లి, పెద్దగడ్డ, తారకరామ తీర్థసాగర్‌ వంటి జలాశయాల నిర్మాణానికి కృషి చేసి రైతులను ఆదుకున్నారన్నారు.

పేదలకు పక్కా గృహాలు,  పలు విద్యా సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించి విద్యాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో  బొత్స నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ నాయకుడు యడ్ల రమణమూర్తి మాట్లాడుతూ, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన బొత్స సత్యనారాయణ ఆది నుంచి ప్రజా సమస్యలపై పోరాడేవారన్నారు.

పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్‌ సోదరులు బొత్స సత్యనారాయణ సేవలను గుర్తు చేసుకున్నారు. 

సేవా కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ నాయకులు

బొత్స సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయనగరం పట్టణంలో పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక సత్య కార్యాలయంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించగా... 200 మందికి పైగా విద్యార్థులు, నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.

అనంతరం కలెక్టరేట్‌ జంక్షన్, లంకవీధి, దాసన్నపేట మయూరి జంక్షన్‌లలో పేదలకు చీరలు పంపిణీ చేయగా.... గాజులరేగ, డక్కినవీధి ప్రాంతాల్లో గొడుగులు పంపిణీ చేశారు. కేవీఆర్‌ గోపాల్‌ సౌజన్యంతో ద్వారపూడి గ్రామానికి చెందిన ముగ్గురు వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేయగా, ఘోషాస్పత్రికి  వీల్‌ చైర్‌ వితరణ చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ గాడు అప్పారావు, పిల్లా పద్మావతి, గంటా చినతల్లి, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ లెంక వరలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు పిన్నింటి చంద్రమౌళి, కోరాడ సూర్యప్రభావతి, మంచాల శివాని, పొట్నూరు పద్మ, గదుల సత్యలత, దుక్క లక్ష్మి, ఎర్రంశెట్టి సునీత, యవర్ణ కుమారస్వామి, కరణం రమణరావు, పార్టీ నాయకులు ఎంఎల్‌ఎన్‌ రాజు, కలపర్తి లక్ష్మి, పిలకా శ్రీను, ముల్లు త్రినాథ్, చందక వెంకటరమణ, జనా ప్రసాద్, గదుల వెంకటరావు, దొంతల రమణ,  ఒమ్మి శ్రీనివాసరావు, తోట మధు, రెడ్డి వెంకటేష్, సుంకరి నారాయణరావు, మునీర్, పతివాడ సత్యనారాయణ, కంది అప్పారావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement