
'రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు దోచుకుని దాచుకోవడానికే అనే విధంగా ప్రభుత్వ పాలన ఉందని ఆయన విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం లేదని.. రాజకీయ వ్యాపారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్న జరిగిన ఎమ్మార్వోపై దాడికి ప్రభుత్వ ఎమ్మెల్యేకు ప్రభుత్వం అండగా నిలబడటం సిగ్గు చేటన్నారు. సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మ్యాప్ ఇచ్చిందంటున్నారు. కానీ, సింగపూర్లో ఉన్న వారి భాగస్వాములను వ్యాపారం చేయడానికే తీసుకువచ్చారని ఆరోపించారు. దీనిపై మరిన్ని ఆధారాలు త్వరలోనే వెల్లడిస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు.