'ప్రజలే మీ గుడ్డలు ఊడదీస్తారు' | bothsa fires on tdp mps | Sakshi
Sakshi News home page

'ప్రజలే మీ గుడ్డలు ఊడదీస్తారు'

Published Sat, Aug 1 2015 6:54 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'ప్రజలే మీ గుడ్డలు ఊడదీస్తారు' - Sakshi

'ప్రజలే మీ గుడ్డలు ఊడదీస్తారు'

హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజలే టీడీపీ ఎంపీల గుడ్డలు ఊడదీస్తారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీల వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం తాపత్రయ పడుతూ.. రాష్ట్ర ప్రతిష్టను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్ర మంత్రి చెబుతుంటే.. మిగతా మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను పణంగా  పెట్టొద్దని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ఈనెల 10న దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. ఈ ధర్నా కోసం ఏపీ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు బొత్స విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement