పెదకూరపాడు నియోజకవర్గంలో జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ (ఫైల్)
నాలుగేళ్ల టీడీపీ నయవంచక పాలనలో జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు, సమస్యలతో విసిగివేసారిన ప్రజల కన్నీరు తుడిచి కొండంత భరోసా నింపేందుకు పాదయాత్రగా జిల్లాలోకి అడుగుపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. తమ బాధలను ఆలకిస్తూ.. ఆత్మీయత పంచుతూ సాగిన అభిమాన నేత అడుగులో అడుగువేస్తూ జిల్లా ప్రజలు వెల్లువలా కదిలారు. ఆయన నడిచిన దారుల్లో పూలబాటలు పరిచి ఎదురేగి స్వాగతాలు పలికారు. ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చెరగని ముద్ర వేసింది. జిల్లా ప్రజానీకానికి ఎన్నో స్మృతులను అందించింది.
‘నవ వసంతం’ తెచ్చింది..
కాకుమాను సమీపంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉగాది పండుగ జరుపుకున్నారు. పంచాగ శ్రావణం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 135 సీట్లు వస్తాయని పంచాంగ కర్త పేర్కొన్నారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు.
⇔ ముప్పాళ్ల సమీపంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించారు.
⇔ పేరేచర్ల సమీపంలో గుడ్‌ఫ్రైడే పండుగను జరుపుకున్నారు.
⇔ ప్రత్తిపాడు, మంగళగిరి నియోజకవర్గాలో అత్యధికంగా ఆరు రోజుల పాటు పాద యాత్ర సాగింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకొని, ప్రత్తిపాడు నియోజకవర్గం మొత్తం జననేత వెంట గుంటూరు పార్లమెంట్ సేవాదళ్ అధ్యక్షుడు మెట్టు వెంకటఅప్పారెడ్డి నడవటం విశేషం.
ఆసక్తిర ఘటనలు..
⇔ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఇంజినీరింగ్ చదివి విదేశాలల్లో ఉద్యోగం చేస్తున్న సౌమ్య తన తండ్రి ద్వారా జననేతకు లోహపు సింహం విగ్రహాన్ని కానుకగా పంపింది.
⇔ ప్రజా సంకల్పయాత్రలో ప్రత్తిపాడు నియోజక వర్గంలో ప్రకాశం జిల్లా తెలగాయపాలెం అనగపాడుకు చెందిన గొర్రెల కాపరులు తమ అభిమాన నేతకు మేక పిల్లను బహూకరించారు.
⇔ ప్రత్తిపాడు నియోజక వర్గం నాగులపాడులో దుర్గా అనే మహిళ తన చంటి బిడ్డను జగన్ చెంతకు తెచ్చి ,పేరు పెట్టాలని కోరగా.. ఆయన ఆ పాపకు విజయమ్మగా నామకరణం చేశారు.
⇔ ప్రజా సంకల్పయాత్రలో ప్రకాశం జిల్లా మర్కాపురం మండలం కర్రాల గ్రామానికి చెందిన జక్కంపూడి లావణ్య, వీరనారాయణరెడ్డి దంపతుల కుమారుడికి రాజశేఖరరెడ్డిగా నామకరణం చేశారు.
⇔ జిల్లాలో నవరత్నాల పథకాల గురించి ఏర్పాటు చేసిన పలురకాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
⇔ ‘ప్రత్యేక హోదా మన ఊపిరి.. చంద్రబాబు ఎంపీలు ముందుకొచ్చినా.. రాకున్నా.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైఎస్సార కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా వర్షాకాల పార్లమెంటు సమావేశాల చివరి రోజునే రాజీనామాలు చేస్తారని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పేరేచెర్ల బహిరంగ సభలో వైఎస్ జగన్ సంచలనాత్మక ప్రకటన చేశారు.
⇔ ఘాత్మీయ నేతపై తనకున్న అభిమాన్ని చాటుకుంటూ పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తును తలపై భుజాన పెట్టుకుని, పార్టీ జెండా రంగు దుస్తులతో జిల్లాకు గొర్రె డెనియల్ జననేత ముందు అడుగులో అడుగేస్తూ ప్రత్యేక ఆకర్షణ నిలిచారు.
మాటతప్పని నైజం
ఫిరంగిపురం మండలం రేపూడి శివారులో 2017 డిసెంబర్ 28వ తేదీన ఆటో ప్రమాదంలో ఆటోడ్రైవర్ సహా నలుగురు పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం మొండిచేయి చూపిందని పాదయాత్రలో జననేతను కలిసిన బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జననేత మాటిచ్చినట్టుగానే అప్పటి తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హేనీక్రిస్టినా, రవి వెంకటరమణ శ్రీకృష్ణదేవరాయలు తమ వంతుగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25వేలు, క్షతగాత్రులకు రూ. 10వేలు, ఆటోడ్రైవర్ భార్యకు రూ. 50వేలు ఆర్థికసాయం చేశారు.
కౌలు రైతులకు భరోసా
నేడు వ్యవసాయ రంగ ంలో ఎక్కువగా కౌలు రైతులు ఉంటున్నారని వైఎస్ జగన్‌కు వివరిచాం. భూమిపై భూ యాజమానులు తక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు కౌలు రైతులకు అందటంలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు భరోసా కల్పిస్తానని చెప్పారు. – బోనిగల వేణుప్రసాద్, పొన్నూరు
తమలపాకు తోటలకు ఆదరణ
పొన్నూరులో తమలపాకు తోటలు ఎక్కువగా ఉన్నాయి. కానీ రైతులకు గిట్టుబాటు ధర కావటం లేదని జననేత దృష్టికి తీసుకెళ్లాం. అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటామని తెలిపారు. పేదలకు పక్కగృహలు కట్టించాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. –నల్లమోతుల రూత్‌రాణి, మున్సిపల్ æమాజీ చైర్‌పర్సన్
Comments
Please login to add a commentAdd a comment