
సాక్షి, నల్లగొండ : నార్కెట్ పల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నార్కెట్ పల్లి-చిట్యాల మధ్య కిలోమీటర్ల పొడవున వాహనాలు జామ్ కావడంతో కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ సిబ్బంది చేతులెత్తేశారు. బుధవారం రోజున వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే సర్వ రోగాలు నయమవుతాయని ఓ స్వామీజీ చెప్పడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వచ్చారు.
హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వేణుగోపాలస్వామి దర్శనం కోసం వచ్చిన వేలాదిమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులను తప్పుదోవ పట్టించేందుకు కావాలనే స్వామీజీ చేత ప్రచారం చేయించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment