Hyderabad-Vijayawada highway
-
పల్లెబాట పట్టిన నగర వాసులు
-
HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగకు సమయం సమీపించింది. మే 13న జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా స్వస్థలాలకు తరలి వెళ్లడంతో శనివారం ఉదయం నుంచే రోడ్లన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో(శనివారం, ఆదివారం సోమవారం పోలింగ్) ఊర్లకు వెళ్లేవారితో పలు టోల్గేట్ల వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది.హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకోవడంతో హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు నల్లగొండ జిల్లా కొర్లపాడు టోల్ గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి. ఎన్టీఆర్ జిల్లాజగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పెరిగిన వాహనాల రద్దీ.ఏపీలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్రకు భారీగా తరలిస్తున్న ఓటర్లు.వాహనాల రద్దీతో పెంచిన కౌంటర్లు.పంతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.హైదరాబాద్ నుంచి భారీగా తరలి వెళ్తున్న ఆంధ్ర ఓటర్లు.పంతంగి నుంచి చౌటుప్పల్ హయత్ నగర్ వరకు భారీగా వాహనాలు.ఉదయం నుంచి గంటలకు నిలిచిపోయిన వాహనాలు.నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న వాహనాల రద్దీ.హైదరాబాద్‌లో స్థిర పడ్డ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి..పోలింగ్‌కు ముందే తమ గ్రామాలకు చేరుకునేలా హైదరాబాద్ నుంిచి పయనం. ప్రయాణీకుల రద్దీతో బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట లాడుతున్నాయి.రైలు టిక్కెట్లు కొన్నప్పటికీ రైలు ఫుల్ కావడంతో బస్సులలో వెళ్లడానికి ఆరంఘర్ చౌరస్తాకు చేరుకుంటున్న ప్రయాణీకులు.సంక్రాంతి, దసరాకు కనిపించినంత రద్దీ కనబడుతుంది.గత నెల రోజుల క్రితమే రైళ్లు, బస్సుల రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓటర్లు. -
హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఎర్టీగా కారు ఆటోను ఢీకొట్టింది. ఆటో సూర్యాపేట నుంచి అర్వపల్లి వెళ్తుండగా అంజనాపురి కాలనీ క్రాసింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వాహనాల మధ్య ఆటో చిక్కుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, నల్గొండ: హైదరాబాద్– విజయవాడ హైవే(NH 65)పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమతుల స్వామి(పెద్దగట్టు) జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమం కానుంది. ఫిబ్రవరి 9వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆదివారం నుంచి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 5న తెల్లవారుజాము నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు గమనించాలన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు..టేకుమట్ల నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ఈ వాహనాలన్నీ నామాపురం వద్ద జాతీయ రహదారి 65పై కలుస్తాయని పేర్కొన్నారు. భారీ, సరకు రవాణా వాహనాలు మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నాయకన్‌గూడెం నుంచి కోదాడకు వెళ్లేలా పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనదారులను స్వామినారాయణ గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వకట్ట మీదుగా 365బీబీ ఖమ్మం జాతీయరహదారిపైకి రోళ్లబావి తండా మీదుగా మళ్లించనున్నారు. ఇక్కడి నుంచి వాహనాలు రాయినిగూడెం వద్దకు చేరుకొని హైదరాబాద్ వైపునకు వెళ్తాయి. హెవీ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ను మాత్రం కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకోవాలి. చదవండి: అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన -
హైదరాబాద్–విజయవాడ ఎన్‌హెచ్-65పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి నం.65లో నందిగామ సెక్షన్‌కు సంబంధించి ఇప్పటికే నాలుగు లేన్లు ఉన్నందున ప్రస్తుతానికి ఆరు లేన్ల అవసరం లేదని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో తెలిపారు. ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ సెక్షన్‌లోని 40 కి.మీ.నుంచి 221.5 కి.మీ. వరకు మొత్తం 181.5 కిలోమీటర్ల పొడవైన రహదారి నాలుగు లేన్లుగా ఉందని వివరించారు. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్‌కు నాలుగు లేన్లు సరిపోతాయని పేర్కొన్నారు. కాగా 15వ కిలోమీటర్ నుంచి 40వ కిలోమీటర్ వరకు ఆరు లేన్ల పనులు ఇప్పటికే ప్రారంభమ య్యాయని తెలిపారు. అంతేగాక ఎన్‌హెచ్–65లోని నందిగామ–ఇబ్రహీంపట్నం–విజయవాడ సెక్షన్ (పొడవు 49.2 కి.మీ.)ను 2004లోనే నాలుగు లేన్లుగా చేశామన్నారు. ఎన్‌హెచ్ 65లో 17 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించామన్నారు. అక్కడ పేవ్మెంట్ మార్కింగ్, సైన్ బోర్డులు, సోలార్ బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు వంటి ప్రమాద నివారణ చర్యలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. అలాగే ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు కూడా తీసుకుంటామని గడ్కరీ లిఖితపూర్వకంగా తెలిపారు. -
వాట్ యాన్ ఐడియా.. లారీ కాదండోయ్.. ఫైవ్ స్టార్ స్టైల్ హోటల్!
సాక్షి, కోదాడరూరల్(నల్గొండ) : వారికొచ్చిన ఓ ఐడియాతో లారీని ఫైవ్‌స్టార్ లుక్‌లో హోటల్‌గా తయారు చేశారు.. ఇద్దరు వ్యక్తులు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన శివ అతని స్నేహితుడు యశ్వంత్ పాత లారీని కొనుగోలు చేసి దానిని ప్రయాణికులను, ప్రజలను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి హోటల్‌గా మార్చారు. దానిని హైదరాబాద్ విజయవాడ రహదారిపై తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్‌రోడ్‌లో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం టిఫిన్, ఫాస్ట్ ఫుడ్‌తో పాటు పలు రకాల టీలు, కాఫీలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే రెస్టారెంట్ తరహాలో రూపొందించి అన్ని రకాల తినుబండారాలు అందిస్తామని అంటున్నారు. ఈ హోటల్ రహదారిపై వచ్చిపోయే ప్రయాణికులు వాహనాలను నిలిపి ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు చిన్న ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో రోడ్డు వెంట పెట్టి హోటల్స్ నిర్వహించడం చూశాము కానీ ఈ తరహాలో చూడలేదని ప్రయాణికులు అంటున్నారు. -
‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్
సాక్షి, చిట్యాల (నల్గొండ): రోడ్లపై ప్రమాదాలు జరగకుండా, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు అక్కడక్కడ బారిగేట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ బారిగేట్లపై ఆగి వెళ్లుము.. చూసి వెళ్లుము, వేగం కన్నా.. ప్రాణం మిన్న వంటి సూక్తులు రాస్తుంటారు. కానీ, చిట్యాలలోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన బారిగేట్‌పై పోలీసులు వినూత్న హెచ్చరికను రాయించారు. ‘స్త్రీలను కాదు.. బండి రోడ్డువైపు చూసి నడుపు’ అని బారిగేట్‌పై రాసి ఉంది. దీనిని చూసిన వాహనదారులు ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని చెప్పి మోసం చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ -
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఒకదాని వెనుక ఒకటి వరుసగా వెళుతున్న నాలుగు కార్లు, ఒక లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో విజయవాడ- హైదరాబాద్ హైవే మీద మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 108, హైవే అంబులెన్సుల ద్వారా గాయపడినవారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కామారెడ్డిలో రోడ్డుప్రమాదం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆటో ఫల్టీలు కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అహ్మద్ పాషా, ఆజంపూరకు చెందిన ఎస్కే ఇర్ఫాన్‌గా గుర్తించారు. -
స్వామీజీతో ప్రచారం.. కి.మీ మేర ట్రాఫిక్ జామ్..!
సాక్షి, నల్లగొండ : నార్కెట్ పల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నార్కెట్ పల్లి-చిట్యాల మధ్య కిలోమీటర్ల పొడవున వాహనాలు జామ్ కావడంతో కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ సిబ్బంది చేతులెత్తేశారు. బుధవారం రోజున వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే సర్వ రోగాలు నయమవుతాయని ఓ స్వామీజీ చెప్పడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వచ్చారు. హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వేణుగోపాలస్వామి దర్శనం కోసం వచ్చిన వేలాదిమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులను తప్పుదోవ పట్టించేందుకు కావాలనే స్వామీజీ చేత ప్రచారం చేయించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
విజయవాడలో దింపుతామని చెప్పి..
- క్యాబ్‌లో యువతిపై లైంగికదాడికి యత్నం - ఎల్బీనగర్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన - నిందితులను అరెస్టు చేసిన పోలీసులు - నిందితుల్లో ఒకరు ఇటీవల కానిస్టేబుల్‌గా ఎంపిక సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లో ప్రయాణిస్తున్న యువతిపై డ్రైవర్, మరో యువకుడు లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ కేసును ఛేదించిన రాచకొండ కమిషరేట్ పరిధిలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు నిందితు లిద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో ఏఆర్ విభాగానికి ఎంపిక య్యాడు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు వెళ్లేందుకు బయలుదేరి... గుంటూరుకు చెందిన ఓ యువతి మాదాపూర్‌లో హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచే స్తోంది. ఆమె బుధవారం తెల్లవారు జామున మాదాపూర్ నుంచి రిజిస్టర్డ్ క్యాబ్‌లో బయలుదేరి ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంది. విజయవాడ వెళ్లేందుకు వాహనాల కోసం ఎదురు చూస్తుండగా ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న నాగోల్ జయపురికాల నీకి చెందిన దంతూరి వేణు (25), నేరేడ్ మెట్కు చెందిన బి.ఇమ్మానియేల్(25) ఆమెను గమనించారు. ఆమె విజయవాడ వెళ్ళే ప్రయ త్నాల్లో ఉన్నట్లు గమనించి కుట్ర పన్నారు. సమీపంలోని హోటల్లో ఉన్న తమ స్నేహి తుడు నిల్సన్, అతడి స్నేహితుడైన క్యాబ్ డ్రైవర్ రవితేజ వద్దకు వెళ్లారు. వారి వద్ద ద్విచక్ర వాహనం వదిలి బలవంతంగా క్యాబ్ తీసుకున్నారు. డ్రైవింగ్ సీటులో ఉన్న వేణు తాము విజయవాడ వెళ్తు న్నామని యువతితో చెప్పాడు. ఆ క్యాబ్‌లోనే ఉన్న ఇమ్మానియేల్‌ను మరో ప్రయాణికుడిగా భావించి ఆమె అందులోకి ఎక్కింది. కారు విజయవాడ హైవే పైకి చేరిన తర్వాత వేణు, ఇమ్మానియేల్ మాట్లాడుకోవడం ఆమె గమనించింది. దీంతో కారు ఆపాలని కోరినా వారు పట్టించు కోలేదు. హయత్‌నగర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి య త్నించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఇమ్మానియేల్ కారు దిగి పారిపోయాడు. కారు ను ముందుకు తీసుకు వెళ్ళిన వేణు నల్లగొండ జిల్లా పంతంగి టోల్గేట్ సమీపంలోకి చేరు కున్నాడు. అక్కడ టోల్‌ట్యాక్స్ చెల్లించడానికి కారు ఆపాల్సి వస్తుం దని, అప్పుడు యువతి గోల చేస్తే ఇబ్బందని భావించి టోల్‌గేట్‌కు కాస్త దూరంలో యువ తిని బలవంతంగా రోడ్డు పైకి తోసేసి వెనక్కి వచ్చేశాడు. రంగంలోకి దిగిన ఎస్వోటీ బాధితురాలు ఆ కారు నంబర్‌ను ఏపీ28టీవీ0051గా నమోదు చేసుకుని కంట్రోల్ రూమ్ ద్వారా చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్వోటీ ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు కారు చిరునామాను ఛేదించి యజమానిని గుర్తించారు. కొత్తూరులో ఉండే యజమాని శివకుమార్ రెండు రోజుల క్రితమే కారును రవితేజకు లీజుకు ఇచ్చారు. శివకుమార్ ద్వారానే రవితేజకు ఫోన్ చేయించి దిల్‌సుఖ్‌నగర్‌కు పిలిపించారు. రవితేజ ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు ఇమ్మానియేల్, వేణులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. పోలీసులు కేసును ఎల్బీనగర్ ఠాణాకు బదిలీ చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. కారుతోపాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. -
హైవేపై ప్రమాదమా..1033కు ఫోన్ చేయండి..
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్-విజయవాడ హైవే ఎంపిక చౌటుప్పల్: జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో ఏటా వేలాదిమంది చనిపోతున్నారు...ఈ ప్రమాదాలను నివారించే దిశగా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ)అడుగులేస్తోంది. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా దేశంలోని హైవేలన్నింటిపై అంబులెన్సుల ఏర్పాటుకు ఉపక్రమించింది. మొట్టమొదటగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఎన్హెచ్ఏఐ అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సులను ఏర్పాటు చేయనుంది. కేవలం హైవేలపై జరిగే ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ఆదుకునేందుకు 1033 నంబరును కేటాయించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 60 కిలోమీటర్లకు ఒక అంబులెన్సు చొప్పున 270 కి.మీ.ల పరిధిలో 5 అంబులెన్సులను ఏర్పాటు చేసింది. ఇవి..నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహడ్, మునగాల, కృష్ణా జిల్లా నందిగామ మండలం చిల్లక ల్లు, కీసర టోల్‌ప్లాజాల వద్ద అందుబాటులో ఉంటాయి.