తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగకు సమయం సమీపించింది. మే 13న జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా స్వస్థలాలకు తరలి వెళ్లడంతో శనివారం ఉదయం నుంచే రోడ్లన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో(శనివారం, ఆదివారం సోమవారం పోలింగ్) ఊర్లకు వెళ్లేవారితో పలు టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది.
హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకోవడంతో హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు నల్లగొండ జిల్లా కొర్లపాడు టోల్ గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి.
ఎన్టీఆర్ జిల్లా
- జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పెరిగిన వాహనాల రద్దీ.
- ఏపీలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్రకు భారీగా తరలిస్తున్న ఓటర్లు.
- వాహనాల రద్దీతో పెంచిన కౌంటర్లు.
పంతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.
- హైదరాబాద్ నుంచి భారీగా తరలి వెళ్తున్న ఆంధ్ర ఓటర్లు.
- పంతంగి నుంచి చౌటుప్పల్ హయత్ నగర్ వరకు భారీగా వాహనాలు.
- ఉదయం నుంచి గంటలకు నిలిచిపోయిన వాహనాలు.
- నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న వాహనాల రద్దీ.
హైదరాబాద్‌లో స్థిర పడ్డ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి..
- పోలింగ్‌కు ముందే తమ గ్రామాలకు చేరుకునేలా హైదరాబాద్ నుంిచి పయనం.
- ప్రయాణీకుల రద్దీతో బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట లాడుతున్నాయి.
- రైలు టిక్కెట్లు కొన్నప్పటికీ రైలు ఫుల్ కావడంతో బస్సులలో వెళ్లడానికి ఆరంఘర్ చౌరస్తాకు చేరుకుంటున్న ప్రయాణీకులు.
- సంక్రాంతి, దసరాకు కనిపించినంత రద్దీ కనబడుతుంది.
- గత నెల రోజుల క్రితమే రైళ్లు, బస్సుల రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓటర్లు.
Comments
Please login to add a commentAdd a comment