సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఒకదాని వెనుక ఒకటి వరుసగా వెళుతున్న నాలుగు కార్లు, ఒక లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో విజయవాడ- హైదరాబాద్ హైవే మీద మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 108, హైవే అంబులెన్సుల ద్వారా గాయపడినవారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
కామారెడ్డిలో రోడ్డుప్రమాదం
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆటో ఫల్టీలు కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అహ్మద్ పాషా, ఆజంపూరకు చెందిన ఎస్‌కే ఇర్ఫాన్‌గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment