
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఎర్టీగా కారు ఆటోను ఢీకొట్టింది. ఆటో సూర్యాపేట నుంచి అర్వపల్లి వెళ్తుండగా అంజనాపురి కాలనీ క్రాసింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వాహనాల మధ్య ఆటో చిక్కుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment