సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే, 17 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment