
సాక్షి, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంతో ఉన్న రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో ఉన్న జక్లేరు 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు చనిపోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, నేవీ ఉద్యోగి వసంత్ కుమార్‌కు బదిలీ కావడంతో హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో, కుటుంబ సభ్యులు అందరూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక వాసులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment