Narayanapet
-
పట్టుకు.. ‘పేట’ పుట్టినిల్లు
పట్టు, కాటన్ చీరలకు నారాయణపేట ప్రసిద్ధి. మారుతున్న డిజైన్లు, ఫ్యాషన్‌కు అనుగుణంగా చీరలను నేయడం పేట కార్మికుల ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా పేట పట్టుచీరలు గుర్తింపు పొందాయి. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం ‘పేట’చీరను ధరించారంటే ఇక్కడి పట్టు ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతానికి వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలు పేట పట్టు, కాటన్ చీరలు తీసుకెళ్లడంపరిపాటిగా మారింది.– నారాయణపేట124 ఏళ్ల చరిత్ర..నారాయణపేట చీరలకు పట్టణ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ ఉంది. 124 ఏళ్లకు పైగా ఈ చీరలకు చరిత్ర ఉంది. 1900 నుంచే నారాయణపేటలో చేనేత కార్మికులు మగ్గాలపై కళ్లు చెదిరే పట్టు చీరలు నేసి, తమ నైపుణ్యాన్ని చాటుతూ వస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం పెటెంట్ హక్కును కూడా సాధించుకున్నారు. పూణె, ముంబయి, సాంగ్లీ, షోలాపూర్, గుల్బార్గా, యాద్గీర్, నాగ్‌పూర్, ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ చీరలకు ఆర్డర్లు చేసేవారు ఉన్నారు. కర్ణాటక ప్రాంత వాసులు సైతం ఇక్కడకు వచ్చి చీరలు కొనుగోలు వస్తారు. నారాయణపేట పట్టుచీరకు రుద్రాక్ష, కోటకొమ్మతో బార్డర్ ఉంటుంది. అదే ఐకాన్‌తో పేట పట్టుచీరలను గుర్తించాలని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం పట్టు చీరల్లో నారాయణపేట పట్టు, నివాళి ధనçవతి, ప్లెన్, నివాళి ధనవతికడ్డి, నివాళి శంభుప్లేన్, నివాళి శివశంభుకడ్డి, నిపాణి ప్లేన్బార్డర్, టెంపల్ డిజైన్ వంటివి ముఖ్యమైనవి. నేటి యువత అభిరుచులకు తగ్గట్టు చీరలను ఆర్డర్‌పై నేస్తుంటారు. మాది ఆరవ జనరేషన్మా ముత్తాతల నుంచి పట్టు, కాటన్ చీరలను నేసి విక్రయిస్తున్నాం. మా తాతలు తుకారాం, మోనప్ప, నాగూరావుల వారసత్వంగా మాది ఆరవ జనరేషన్. ఇక్కడ తయారు చేసిన పట్టు, కాటన్ చీరలను దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో వ్యాపారుల ద్వారా విక్రయిస్తాం. – విజయ్‌కుమార్ బసూదే, చేనేత వస్త్రాల వ్యాపారి -
సోనేకా ఠేట్.. నారాయణపేట్
నారాయణపేట: మగువల మనసు దోచే అందమైన, అద్భుతమైన మన్నికకు మారుపేరుగా నిలిచే బంగారు అభరణాలకు నారాయణపేట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి. దాదాపు 128 ఏళ్లుగా పేట బంగారానికి చెక్కుచెదరని ఖ్యాతి ఉంది. ఇక్కడి బంగారం నాణ్యత చూసిన నిజాం ప్రభువు నారాయణపేట్ సోనేకా ఠేట్ (స్వచ్చమైన బంగారం) అని కితాబిచ్చినట్లు ప్రచారం ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారాన్ని విక్రయించడంలో స్థానిక స్వర్ణకారులు నమ్మకాన్ని కూడగట్టుకున్నారు. అందుకే పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సైతం బంగారు నగలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. బంగారు విక్రయానికి 128 ఏళ్లు నారాయణపేటలో 1898వ సంవత్సరం నుంచి బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో వ్యాపారులు బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. నిజాం కాలంలో లహోటికి చెందిన వారు వ్యాపారం భారీగా చేసేవారు. ఆ కాలంలో రాజస్తాన్ నుంచి నారాయణపేటకు వచ్చిన రాంచందర్ మెగరాజ్ భట్టడ్ ఇక్కడ బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఐదు దశాబ్దాలుగా స్థానికంగా బంగారం వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఆరంభంలో అసరం భట్టడ్, వై.సురేశ్, బంగారు బాలప్ప, దత్తురావు, సరాఫ్ హన్మంతు, మహ్మద్ హసన్ సహాబ్ చాంద్ తదితర ఎనిమిది బంగారు దుకాణాలుంటే.. ప్రస్తుతం 100పైగా దుకాణాలకు విస్తరించాయి. హాల్‌మార్క్.. మోనోగ్రామ్ స్థానికంగా దుకాణాల్లో తయారు చేసిన అభరణాలపై చిన్న సైజులో తమ దుకాణం పేరు ముద్రను (మోనోగ్రామ్) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలు చేసిన వారు విక్రయించేందుకు వెళ్తే.. గుర్తు పట్టేందుకు సులభంగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లను వ్యాపారులు బంగారం ప్రియుల కోసం అందుబాటులో ఉంచుతారు. తారాపూర్, అమృత్సర్, ముంబై, మచిలీపట్నంలో డైస్ తయారవుతాయి. మార్కెట్లో డైస్ వచ్చిన పది రోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. హాల్‌మార్క్‌తో కూడిన వివిధ రకాల డిజైన్లలో నగలను హైదరాబాద్, నారాయణపేటలోని బెంగాలీ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మీ నెక్లెస్, లక్ష్మీలాంగ్ చైన్, లాంగ్ చైన్ తదితర రకాల డిజైన్ల అభరణాలు లభిస్తాయి. శుభకార్యం వస్తే చాలు.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు నారాయణపేట సరాఫ్ బజార్ కిటికిటలాడుతుంది. రాష్ట్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, జనగాంలతో పాటు నారాయణపేటలో బంగారం ఎంతో నాణ్యత, మన్నికతో ఉంటుంది. శుభకార్యాలు, పండుగలు ఉన్నప్పుడు పేట బంగారం కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని యాద్గిర్, సేడం, గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని పుణే, షోలాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వాసులు ఎక్కువ వస్తుంటారు. స్విస్ బ్యాంక్ కార్పొరేషన్ నుంచే కొనుగోళ్లు దేశంలోని బంగారు వ్యాపారస్తులు ఆన్లైన్ ద్వారా స్విస్ బ్యాంక్ కార్పొరేషన్‌తో పాటు సెంట్రల్ బ్యాంకుల్లో డీడీలను కట్టి బంగారు బిస్కెట్లను కొనుగోలు చేస్తుంటారు. ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంకులు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ల నుంచి కిలోల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ఆరంభంలో డాలర్ విలువపై హెచ్చుతగ్గు ధరలు కావాల్సిన వారు.. బంగారం కోసం ఆన్లైన్లో ధరను కోట్ చేసి ఉంచితే వారికి అదే ధరకు బంగారం కేటాయిస్తారు. సరాఫ్ బజార్ ఏ ఊళ్లోనైనా కూరగాయల మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్, కిరాణా మార్కెట్, పత్తి బజార్ తదితర బజార్లు ఉండడం సహజం. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో సరాఫ్ బజార్ ఎక్కడా లేదు. నారాయణపేటలో దాదాపు 100 దుకాణాలు వరుసగా ఉండడంతో సరాఫ్ బజార్ అని పేరుపెట్టారు. పెద్ద పెద్ద నగరాల స్థాయిలో పేటలో బులియన్ అండ్ జువెల్లర్స్గా వ్యాపారం కొనసాగుతోంది. తేజాప్తో నాణ్యత ఆభరణాలు నాణ్యతగా ఉన్నాయా?, డూప్లికేటా? అనేది తేజాప్తోనే పరిశీలిస్తారు. డూప్లికేట్ బంగారు నగలైతే వెంటనే అది కాలిపోతూ నల్లగా మారుతుంది. ఒరిజినల్ బంగారాన్ని తేజాప్లో వేసి కరిగించినా ఎలాంటి మార్పు రాదు. తేజప్లో పాత బంగారాన్ని కరిగించి నగల నాణ్యతను గుర్తిస్తారు. టెక్నాలజీ పెరగడంతో ప్రస్తుతం టెస్టింగ్ మెషీన్ ద్వారా బంగారాన్ని పరీక్షిస్తున్నారు. నారాయణపేటలో 24 క్యారెట్లతో నగలు తయారు చేస్తారు. అందుకే అత్యవసర సమయాల్లో అభరణాలను విక్రయిస్తే.. పేట బంగారానికి ఏ మాత్రం విలువ తగ్గదు.30 ఏళ్లుగా వ్యాపారం నేను 30 ఏళ్లుగా బంగారు వ్యాపారం చేస్తున్నా. ముంబై, పుణే, హైదరాబాద్ నగరాల్లో 18, 19 క్యారెట్లతో బంగారు అభరణాలు విక్రయిస్తుంటారు. కానీ ఒక్క నారాయణపేటలోనే ఇప్పటికి 24 క్యారెట్లతో నగలు తయారు చేసి విక్రయిస్తున్నాం. – సరాఫ్ నాగరాజు, వ్యాపారి, నారాయణపేటనాణ్యతకు మారుపేరు.. నమ్మకానికి, నాణ్యతకు, మన్నికకు మారుపేరు నారాయణపేట బంగారు అభరణాలు. 24 క్యారెట్లతో నాణ్యత కూడిన బంగారు అభరణాల విక్రయాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ కొన్న అభరణాలు రీసేల్ చేస్తే 99.12 శాతం ఉంటుంది. అందుకే నారాయణపేట బంగారాన్ని కొనేందుకు అసక్తి చూపుతారు. – హరినారాయణభట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నారాయణపేటఅంతా ‘చొక్క’బంగారమే నారాయణపేటలో స్వర్ణకారులు తయారు చేసేది.. వ్యాపారస్తులు అమ్మేదంతా చొక్క బంగారమే. అభరణాల్లో కల్తీ ఉండదు. పుస్తెలు, వంకి, ఉంగరాలు, నల్లపూసల దండలు, వడ్డాణాలు, నానులు తదితర ఆభరణాలను నాణ్యత, మన్నికతో తయారు చేస్తాం. జాయింట్ల కోసమే కేడీఎం వాడుతాం. వందశాతం నాణ్యతగా ఉంటుంది. – శ్రీనివాస్ చారి, స్వర్ణకారుడు, నారాయణపేటచొక్క బంగారు అభరణాలివే నాను, పుస్తెలతాడు, గొలుసు, రెండు, మూడు వరసల పెద్దగొలుసులు, జిలేబీ చైను, చుట్టూ ఉంగరాలను 24 క్యారెట్లతో తయారు చేస్తారు. చంద్రహార, బోర్మాల్ గుండ్లు, కొలువులు, టెక్కీలు, ఐదారుటెక్కీలు, నెక్లెస్, లాంగ్‌చైన్, వడ్డాణం, వంకీలు, గాజులు, చెవుల కమ్మలు, జుంకీలు, మకరకురందనాలు, గెంటీలు, తార్కాస్ కమ్మలు, కరివేపూలు, ఏడురాళ్ల కమ్మలు, బ్రాస్లెట్లు, లాకెట్లు తదితర ఆభరణాలను కూడా తయారు చేస్తారు. -
సజీవ సమాధికి స్వామీజీ యత్నం
మద్దూరు: ఓ స్వామీజీ ఐదురోజులు సమాధికి ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న పోలీసులు నిలువరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్లలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రెనివట్ల గ్రామానికి చెందిన సత్యానందస్వామి అలియాస్ హనుమంతు కొద్దిరోజులుగా వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడిగా చెలామణి అవుతున్నాడు. ఈయన భార్య ఏడాది క్రితం పొలంలో ఎద్దు పొడవడంతో మృతిచెందింది. దీంతో ఆమెకు పొలంలోనే సమాధి కట్టించి పూజిస్తున్నాడు.అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కొంతమందిని శిష్యులుగా చేసుకున్నాడు. శుక్రవారం అమావాస్య రోజున ‘తాను ఐదు రోజులు సమాధిలోకి వెళతానని.. బయట అఖండభజనలు చేయాలని’ భక్తులకు చెప్పి సమాధిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని సమాధిలో ఉన్న స్వామీజీని బయటకు రప్పించారు. అనంతరం డాక్టర్ స్వామీజీకి వైద్య పరీక్షలు చేయగా, ఆర్యోగం నిలకడగా ఉంది. కొన్నేళ్ల క్రితం స్వగృహంలోనే ఒక అమావాస్య రోజు హనుమంతు మౌనదీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటక చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుండటంతో సొంత పొలంలోనే జీవ సమాధి కోసం ఒక ఆలయం నిర్మించినట్టు గ్రామస్తులు చెప్పారు. -
కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలే: ప్రధాని మోదీ
సాక్షి,నారాయణపేట: మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధికి గ్యారెంటీ అని కాంగ్రెస్ అన్నీ అబద్ధపు హామీలిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం(మే10) నారాయణపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలివి. రాబోయే ఐదేళ్లలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి మోదీ గ్యారెంటీ. పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణకు లక్షల కోట్లు పంపించాం. ఆ డబ్బును బీఆర్ఎస్, కాంగ్రెస్ లూఠీ చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. తెలంగాణప్రజలు డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి ఆలోచించాలని నేను చెప్పాను. అందులో ఎవరి పేరు చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్‌పై మాట్లాడాడు. అంటే డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ దేశానికి ఇప్పటివరకు చేసిందొక్కటే నమ్మకద్రోహం. కాంగ్రెస్ నేతలు ఎన్నికలు వచ్చాక దేశాన్ని విభజించేలా మాట్లాడుతున్నారు. యువరాజు గురువు దక్షిణాది వారిని ఆఫ్రికన్లలా ఉన్నారంటాడు. యువరాజు ఎన్నికల ముందు ప్రేమ దుకాణం తెరుస్తాడు. కాంగ్రెస్ హిందువులను సొంత దేశంలోనే హిందువులను రెండవ తరగతి పౌరులను చేస్తోంది. నేను గుడికి వెళ్లడాన్ని కూడా తప్పు పడుతున్నారు. రామనవమికి మీరు గుడికి వెళ్లరా. పసిపిల్లలు నాపై చూపే ప్రేము కూడా కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగిస్తోంది. కాంగ్రెస్‌కు దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదు. కాంగ్రెస్‌ది హిందువుల పట్ల వ్యతిరేక భావన. 2014లో కేసీఆర్‌ను మీరు ఎన్నుకుంటే ఆయన మిమ్మల్ని మరిచిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది’అని మోదీ విమర్శించారు. -
ఇక ‘హస్తం’ ప్రచారం షురూ!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వడివడిగా సిద్ధమవుతోంది. ప్రధాన పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ఎంపికలో కొంత వెనుకబడినట్టు కనిపించినా ప్రచారంలో మాత్రం ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో సన్నాహక భేటీలు నిర్వహిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతల నేతృత్వంలో అసెంబ్లీ స్థాయి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలను ఈనెల 20లోపు ముగించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ సమావేశాల అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల రాకతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా లోక్‌సభ ఎన్నికల కోసం తన ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకుంటున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు చోట్ల ప్రచారం నిర్వహించేలా ఆయన సభల షెడ్యూల్ తయారవుతోంది. తన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రచారం ప్రారంభం కానుంది. ఇక్కడ సోమవారం నిర్వహించే సభకు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. నేడు కేసీ రాక..: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళి ని సమీక్షించేందుకుగాను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చా ర్జులు, ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచార కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు ఏఐసీసీ అగ్రనేతల ప్రచార షెడ్యూల్, సభల నిర్వహణ ఎక్కడన్న దానిపై కూడా టీపీసీసీ నేతలతో చర్చించనున్నారు. టార్గెట్ బీజేపీ రాష్ట్రంలోని పలు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతలను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది. ముఖ్యంగా బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తోన్న నియోజకవర్గాల నుంచి కమలనాథులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం సంగారెడ్డి అసెంబ్లీ బీజేపీ ఇంచార్జి పులిమామిడి రాజు, మక్తల్ నేత జలంధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీరికి స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. త్వరలోనే మరింత మంది అసెంబ్లీ స్థాయి బీజేపీ నేతలకు కాంగ్రెస్ గాలం వేయనుందని సమాచారం. -
పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు కోట్ల నష్టం!
సాక్షి, మాగనూరు: నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాటన్ జిన్నింగ్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో భారీ స్థాయితో పత్తి దగ్ధమైంది. దాదాపు ఏడు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని బసవేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్లో విద్యుత్ షార్ట్ సర్కూట్ జరిగింది. ఈ సందర్భంగా మిల్లులో నిల్వ చేసుకున్న పత్తి దగ్దమైంది. శనివారం రాత్రి 11గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో మిల్లులో నిల్వ ఉంచిన పత్తి మంటల్లో కాలిపోయింది. సకాలంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో కొంత మేరకు ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం కారణంగా బసవేశ్వర జిన్నింగ్ కాటన్ మిల్లులో పత్తి, పత్తి గింజలు, మిషనరీలు, షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దాదాపు 7 నుండి 8కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని మిల్లు యజమాని దండే తమ్మన్న తెలిపారు. ఈ సందర్భంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొని
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా.. అస్తమా వ్యాధితో బాధపడుతోన్న కర్ణాటక రాష్ట్రం సైదాపూర్ గ్రామానికి చెందిన రెహమాన్‌బేగం(40)ను చికిత్స కోసం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం సంకలమద్దికి తీసుకువచ్చారు. చికిత్స పొందిన అనంతరం తిరుగు ప్రయాణంలో భర్త మౌలాలి(40), కలీల్(43), మరో వ్యక్తి వడివాల్‌తో కారులో కలిసి బయలుదేరారు. ఇదే క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని కార్వాల్లో పనిచేస్తున్న నేవీ ఉద్యోగి దీపక్ సమల్, భార్య భవిత సమల్(35), కూతురు అవిస్మిత సమల్(8)తో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. జక్లేర్ సమీపంలో ఉన్న దాబా దగ్గర అతివేగంగా వచి్చన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో రెహమాన్ బేగం, మౌలాలి, ఖలీల్, భవిత సమాల్, అవిస్మిత సమాల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వడివాల్, దీపక్ సమల్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీపక్ సమల్ పరిస్థితి విషమించడంతో 108లో మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంలాల్ తెలిపారు. దీపక్ సమల్‌కు విశాఖపట్టణానికి బదిలీ కావడంతో అక్కడికి వెళ్లేందుకు హైదరాబాద్‌కు బయలుదేరారని బంధువులు తెలిపారు. కాగా, కార్లలో బెలూన్ల సౌకర్యం ఉన్నప్పటికీ అవి సకాలంలో ఓపెన్ కాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టు చెబుతున్నారు. రోడ్డుపై డివైడర్ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. -
విషాదం: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి
సాక్షి, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంతో ఉన్న రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో ఉన్న జక్లేరు 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు చనిపోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, నేవీ ఉద్యోగి వసంత్ కుమార్‌కు బదిలీ కావడంతో హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో, కుటుంబ సభ్యులు అందరూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక వాసులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. -
నారాయణపేట: డీకే అరుణ ప్రభావం పడనుందా?
నారాయణపేట నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖపోటీ అనివార్యం కానుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పోటీచేసిన రాజేందర్‌రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి బీఆర్ఎస్ తరపున ఆయనే ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలే ఉన్నాయి. అధికార పార్టీపై అసంతృప్తి.. అదే బీజేపీకి బలం కానుంది! అయితే అభివృద్ది విషయంలో తన వంతు కృషి చేశారు. నారాయణపేటను నూతన జిల్లాగా ఏర్పాటు చేయించారు. జిల్లా ఆస్పత్రి కూడ వచ్చింది. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయించారు. అయితే నారాయణపేటకు సాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన జీఓ 69ని అమలు చేయించటంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. జాయమ్మ చెరువు రిజర్వాయర్ చేస్తామన్న హమీ కూడ నెరవేరలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్న హమీకూడ నెరవేరకపోవటంతో ఇక్కడి జనం అసంతృప్తితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. పార్టీ కార్యకర్తలతో నేతలతో ముక్కుసూటిగా మాట్లాడుతుండటంతో క్యాడర్లో నైరాశ్యం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇక్కడ బలంగా ఉండటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన వర్గీయులకే పెద్దపీఠ వేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో ఓటమి పాలై మూడో స్దానానికే పరిమితమయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శివకుమార్‌రెడ్డి 2014లో పోటీ చేసి రెండవస్దానంలో నిలిచారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ రెండవస్దానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయనపై ఇటీవల ఓ మహిళ వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం,కేసు నమోదు కావటం కొంత ఇబ్బందిగా మారింది. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సైతం తప్పించారు. మాస్ ఫాలోయింగ్ ఉండటం ఈయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సైతం ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పోటీ చేయాలని వ్యాపారవేత్త సుజేంద్ర శెట్టి ఆసక్తి కనబరుస్తున్నారు. డీకే అరుణ ప్రభావం బీజేపీకి కలిసోచ్చేనా? ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కొంత క్యాడర్ ఉంది. 2014లో రతంగ్ పాండు రెడ్డి పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించటంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన 20 వేల ఓట్లు సాధించారు. అయితే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న రతంగ్ పాండు రెడ్డిపై సానుభూతి కూడ ఉంది. ఇటీవల బండి సంజయ్ మార్క్ నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్ర, బహిరంగ సభ విజయవంతం కావటంతో ఈసారి బీజేపీ గెలుస్తుందనే ధీమా ఆపార్టీ నేతల్లో కనిపిస్తుంది. బీసీలకు కేటాయించాలని ఆలోచిస్తే పార్టీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ, సత్యయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ డీకే అరుణ ప్రభావం కూడ ఉండే అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు: కర్ణాటక సరిహద్దులో ఉన్న నియోజకవర్గం నారాయణపేట 2019 లో నూతన జిల్లాగా ఏర్పడింది, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు మక్తల్ నియోజకవర్గానికి వెళ్లాయి.నారాయణ చేనేత మరియు పట్టు చీరలకు ప్రసిద్ది,ఇక్కడి బంగారపు ఆభరణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగునీరు లేకపోవటంతో వ్యవసాయభూముల బీళ్లుగా మారాయి.ఉపాధి లేక జనాలు ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణపేటలో ఏర్పాటయ్యింది. -
పంద్రాగస్టు వచ్చిందంటే ఆ ఘాతుకం యాదికొస్తది.. ఎమ్మెల్యేతో పాటు..
సాక్షి, నారాయణపేట: నారాయణపేటలో పంద్రాగస్టు వచ్చిందంటే చాలు 2005, ఆగస్టు 15న జరిగిన మావోయిస్టుల ఘాతుకం ప్రతి ఒక్కరి మనసు కలచివేస్తోంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు మరో తొమ్మిది మంది మావోయిస్టుల తూటాలకు బలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అప్పటి ఎమ్మెల్యే నర్సిరెడ్డి మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో పట్టణంలోని హరిజనవాడలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించేందుకు కొబ్బరికాయ కొడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో అప్పటికే కాపుకాసిన మావోయిస్టులు ఏకే 47తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు మరో తొమ్మిది మంది మృతిచెందగా తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిచెందిన వారిలో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, తనయుడు వెంకటేశ్వర్‌రెడ్డి, అప్పటి మున్సిపల్ కమిషనర్ డీవీ రామ్మోహన్, గన్‌మెన్ రాజారెడ్డి, డ్రైవర్ శ్రీనివాసులు, ఆర్డీఓ కార్యాలయం అటెండర్ సాయిబన్న, మాగనూర్ మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు లోకేశ్వర్‌రెడ్డి, ఊట్కూర్ మండల తిప్రాస్‌పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మోనప్పగౌడ్, రవీందర్‌గౌడ్ ఉన్నారు. ఆ తర్వాత కొద్దిరోజుల వ్యవధిలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణపేటకు చెందిన దూడం విజయ్‌కుమార్, చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి వాహన డ్రైవర్ ఆరీఫ్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో అప్పటి ఆర్డీఓ శివారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి, దివంగత నేత ఘన్‌శ్యాందాస్‌ధరక్, ఎమ్మెల్యే పీఏ భాస్కర్, అవుటి రాజశేఖర్, నాగేందర్, లొట్టి శ్రీనివాస్, సూరి గాయపడి త్రుటిలో తప్పించుకున్న వారిలో ఉన్నారు. వైఎస్సార్ దిగ్భ్రాంతి.. ఈ వార్త విన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే అప్పటి పీసీసీ అధ్యక్షుడు కేశవరావు, ఎంపీ జైపాల్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో అదేరోజు సాయంత్రం నారాయణపేటకు చేరుకొని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యే ఇతరుల మృతదేహాలను చూసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. -
ఒకరికి తెలియకుండా ఒకరిని.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు
సాక్షి, నారాయణపేట(మహబూబ్‌నగర్): ఒకరికి తెలియకుండా మరొకరితో ఇలా నలుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ఓ యువకుడి బండారం బయటపడింది. మొదటి భార్య సఖీ కేంద్రంలో ఫిర్యాదు చేయడంతో ఆ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన శనివారం వెలుగుచూసింది. నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన వెంకట నర్సింహారెడ్డి వ్యవసాయం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. 15ఏళ్ల క్రితం పెళ్లి చేయడానికి పెద్దలు ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లికి చెందిన మహేశ్వరిని చూశారు. అయితే అప్పట్లో అమ్మాయి తరఫు పెద్దలకు ఇష్టలేక వద్దనుకున్నారు. అయినప్పటికీ అమ్మాయి చుట్టూ తిరిగి ప్రేమలో పడేసి 2009లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టాక.. 2014లో భార్యభర్తలు గొడవపడి విడిపోయారు. అయినప్పటికీ భార్యపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేయడంతో ఆమె త్రుటిలో తప్పించుకుంది. దీనిపై కేసు నమోదై జైలుకు వెళ్లి వచ్చాడు. ► జైలు నుంచి వచ్చిన తర్వాత కోయిలకొండ మండలం పారుపల్లికి చెందిన ఓ యువతితో పరిచయం కావడంతో ఆమెకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. ఇతని తీరు నచ్చకపోవడంతో ఆమె విడాకులు తీసుకుని మరో అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ► ఊట్కూర్ మండలం నమస్తాపూర్‌కు చెందిన భర్త నుంచి విడిపోయి కుమారుడితో ఒంటరిగా ఉంటున్న మరో మహిళను ట్రాప్ చేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి గుడిలో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. వీరికి మరో ఇద్దరు మగపిల్లలు పుట్టారు. కాగా, తరుచూ సొంత గ్రామానికి వచ్చి పోతున్న వెంకట నర్సింహారెడ్డి తన పక్క గ్రామమైన అప్పక్‌పల్లిలో మరో అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని, ఆమెను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. ► నెలరోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం మొత్కుపల్లి దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి గురించి తెలిసిన మొదటి భార్య మహేశ్వరి వివరాలు సేకరించగా.. తాను కాకుండా ఒకరి గురించి మరొకరికి తెలియకుండా మరో ముగ్గురిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుంది. అందరితో ఫోన్లో మాట్లాడి వాడి నిజస్వరూపం బయటపెట్టింది. రెండు రోజుల క్రితం సఖీ కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో వారు పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. ► ఈ మేరకు శనివారం ముగ్గురు భార్యలు నారాయణపేట పోలీసుస్టేషన్‌కు రాగా మరొకరు వేరే పెళ్లి చేసుకున్న కారణంగా రాలేదు. మొదటి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిత్యపెళ్లి కొడుకు వెంకట నర్సింహారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నలుగురే కాకుండా మరో ఇద్దరిని వివాహం చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ -
రొబోటిక్స్తో నాలాలు క్లీన్..
ఇంటి చెత్త మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళుతున్నా, బయటి చెత్త నాలాల్లో పారే నీటికి అడ్డు పడుతుంటుంది. వర్షం పడిందంటే ఉప్పొంగే నాలాలు ఇళ్లనూ, వాకిళ్లను ముంచెత్తుతుంటాయి. చెరువుల్లో చెత్త సరే సరి. శుభ్రత గురించి ఎంత చెబుతున్నా రకరకాల మార్గాల ద్వారా చేరే చెత్త దుర్గంధం వెదజల్లుతూనే ఉంటుంది. మ్యాన్‌హోల్స్ లీకై మనుషులు వాటిని శుభ్రం చేయలేక మరణం అంచుల వరకు వెళుతుంటారు. వీటన్నింటికీ పరిష్కారంగా జి.పద్మ రొబోటిక్ డివైజ్‌లను డిజైన్ చేశారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఉంటున్న పద్మ మనుషుల అవసరం లేకుండా నాలాల చెత్తను, డ్రైనేజీలను, చెరువులను శుభ్రం చేయడానికి పరికరాలను తయారుచేశారు. ఈ విషయం గురించి పద్మ మాట్లాడుతూ... ‘నేను పుట్టిపెరిగింది నారాయణపేట. తర్వాత చదువు అంతా హైదరాబాద్‌లోనే. ఉద్యోగరీత్యా కెనడా వెళ్లాను. పదిహేనేళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేశాను. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. తర్వాత తిరిగి సొంత ప్రదేశానికి వచ్చేశాను. నా చిన్నతనంలో చూసిన ప్రాంతాలకు– ఇప్పటికీ చాలా మార్పు కనిపించింది. చిన్నప్పుడు చెరువుల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదం గా అనిపించేది. ఇప్పుడు చెత్తతో, దుర్గంధంతో ఉండటం చూశాను. అలాగే పట్టణాల్లోని నాలాల్లో చెత్త పేరుకు పోవడం, నీళ్లు సాఫీగా వెళ్లకపోవడం గమనించాను. దీనివల్ల వర్షాకాలం జనం పడే అవస్థలు చూశాను. డ్రైనేజీల్లో మనుషులు చేసే పనులు, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలు గమనించాను. డ్రైనేజీల్లో పనిచేసిన కార్మికులు కొంతమంది మరణించిన ఘటనలు కూడా తెలుసు. వీటికి పరిష్కారంగా విదేశాల్లో సాంకేతికంగా చాలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మన ప్రాంతంలో అలాంటి చర్యలేవీ కనిపించలేదు. నాలుగు రోబోటిక్ డివైజ్‌లు ఇప్పటికీ మున్సిపాలిటీ లు 60 శాతం చెత్తను మాత్రమే సేకరిస్తున్నాయి. మిగిలిన 40 శాతం చెత్తను ప్రజలు చెరువులు, నాలాల్లోనే వేస్తున్నారు. వీటిని శుభ్రం చేయడానికి తిరిగి మనుషులను నియమించాల్సి ఉంటుంది. అలాకాకుండా చెరువులు, నాలాలను, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ క్లీన్ చేయడానికి రొబోటిక్ డివైజ్‌లను డిజైన్ చేశాను. ఎన్వీ రొబోటిక్ పేరుతో సంస్థను నడుపుతున్నాను. మా టీమ్‌లో మొత్తం పదిమందిమి ఉన్నాం. ఈ రొబోటిక్ డివైజ్ చెరువులో నుంచి ఒకేసారి టన్ను సామర్థ్యం గల చెత్తను సేకరించి, బయటకు వేస్తుంది. రోజుకు పది టన్నుల ప్లాస్టిక్, ఇతర తేలియాడే వ్యర్థాలను సేకరించగలదు. ముందు పైలట్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో చేశాం. తర్వాత మహబూబ్‌నగర్, నారాయణ్ పేట మున్సిపాలిటీలలో నిర్వహించాం. మంచి ఫలితాలు వచ్చాయి. త్వరలో హైదరాబాద్ లో పనులు చేపట్టాలనుకుంటున్నాం. మరెక్కడా లేని సాంకేతికత ఇలాంటి డివైజ్‌లను ఇప్పటి వరకు ఎవ్వరూ డిజైన్ చేయలేదు. ఈ రోబొటిక్ డివైజ్‌ల తయారీ పూర్తిగా మా సొంత డిజైన్. పేటెంట్‌కి అప్లై చేశాం. ఒక్కో రొబోటిక్ డివైజ్ తయారీకి రూ.6–7 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. నాలా, వేస్ట్ ఫ్లో .. ను పరీక్షించి డివైజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కావల్సిన వస్తువుల కోసం మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. సొంతంగా కొన్ని పరికరాలను తయారుచేయించాల్సి ఉంటుంది. నేననుకున్న ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి దగ్గర బంధువులు, మా కుటుంబం సపోర్ట్ లభించింది. నా ప్రాజెక్ట్ నచ్చి తెలంగాణలోని ‘విహబ్’ సాయం అందించడానికి ముందుకు వచ్చింది.. మనుషులను గౌరవిద్దాం.. వ్యర్థాలను నియంత్రించడంలో మనందరిలో పర్యావరణ బాధ్యత ఉండాలి. అంతేకాదు మన తోటి మనిషిని గౌరవించాలి. అప్పుడు మన చుట్టూ వాతావరణం బాగుంటుంది. మనలో చాలామంది ప్లాస్టిక్‌తో సహా రకరకాల వ్యర్థాలను రోడ్డుకు ఇరువైపులా, నాలాల్లో, చెరువుల్లోనూ పడేస్తుంటారు. పెద్ద ఎత్తున డంప్ అయ్యే చెత్తను చూస్తుంటే భవిష్యత్తు గురించిన భయం కూడా కలుగుతుంది. మన ఇంటి డ్రైనేజీ మ్యాన్‌హోల్‌కి ఉండే మూతనే దాదాపు టన్ను బరువు ఉంటుంది. దానిని ఎత్తాలంటే మనిషి వెన్నెముకపై పడే భారం ఎంత ఉంటుందో గ్రహించవచ్చు. అతనిమీద ఆధారపడే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? అనే ఆలోచన మనందరిలోనూ రావాలి. అలాంటివాటిని ఎత్తడానికి కూడా రొబోటిక్ కంట్రోల్ డివైజ్‌ను డిజైన్ చేశాం. మ్యాన్‌హోల్ కవర్ లిఫ్టర్.. తయారు చేశాం. మ్యాన్‌హోల్ క్లీనర్పైన ఈ డివైజ్‌ను ఉంచితే అదే చెత్తనంతా తీసి, బయటకు వేసేస్తుంది. చెత్త కోసం మనుషులను వినియోగించకుండా, వారిని ఇతర రంగాలకు మళ్లించాలి. చెత్తను శుభ్రం చేయడానికి పరికరాలను ఉపయోగించాలి అన్నదే నా ఆలోచన. మన దగ్గర ఈ విధానంలో ముందు చూపు, త్వరిగతిన పనులు అవడం ఎక్కువ అవసరం’’ అని వివరించారు పద్మ. – నిర్మలారెడ్డి -
గడీల రాజ్యం పోయి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి: బండి సంజయ్
నారాయణపేట: సీఎం కేసీఆర్ పెద్ద మోసకారి.. కేసీఆర్ అంటే కోతల చంద్రశేఖర్ రావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆయన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 11వ రోజు నారాయణపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకుంటే మరింత దిగజారిపోయాయని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పేదలు విసిగిపోయారని, కేసీఆర్‌ను దించాలనే కసితో పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఫాంహౌజ్‌కు నీళ్లు తెచ్చుకోవడానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండమని దుయ్యబట్టారు. ఇక్కడ 3, 4 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావొచ్చని కానీ కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలకు నీళ్లించేందుకు మనసు రాదని అన్నారు. కేంద్రం నిధులిస్తే.. కేసీఆర్ దారి మళ్లించిండు. ఈరోజు వ్యాక్సిన్‌ను ఉచితంగా మోదీ అందించడంవల్లే అందరం కలిసి మాట్లాడుకోగలుతున్నామని తెలిపారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. గడీల రాజ్యం పోయి గరీబోళ్ల ప్రభుత్వం రావాలన్నారు. బాంచన్ బతుకులు కావాలా? పేదల ప్రభుత్వం రావాలన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే ఏం చేసిండు?, ఆత్మహత్యలు ఆగినయా?, నీళ్లు వచ్చినయా?, బస్టాండ్ వచ్చిందా? ఏం సాధించామని అన్నారు. అమెరికా పోయి బార్లలో, పబ్బుల్లో తిరిగేటోడికి ఈ రోజు రాష్ట్ర మంత్రి అయ్యారంటే అది బీజేపీ వేసిన భిక్ష అని తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చి రాష్ట్రాన్ని తెచ్చింది సుష్మా స్వరాజ్ అని గుర్తు చేశారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం..భార్యను పట్టించుకోకపోవడంతో..
సాక్షి, మహబూబ్‌నగర్: ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మండలంలోని చంద్రవంచలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని చంద్రవంచ గ్రామానికి చెందిన బోడ తాయప్ప, ఆయన భార్య గోపమ్మ(38) తరచూ గొడవ పడేవారు. ఇటీవల తాయప్ప వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లిపోయేవాడు. దీంతో భార్య గోపమ్మ తన పిల్లలతోకలిసి అత్తామామల వద్దే ఉంటోంది. చదవండి: మైనేమ్ ఈజ్ సుజి, ఐ యామ్ సింగిల్.. అంటూ వీడియో కాల్ చేసి.. దుస్తులు తీసేసి.. ఈ క్రమంలోనే ఈనెల 27న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని అత్తామామలు గోపమ్మ తల్లిగారి కుటుంబానికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. కానీ అదేరోజు అర్ధరాత్రి పరిస్థితి విషమించి చనిపోయినట్లు మరోమారు సమాచారం ఇచ్చారు. భర్త, అతని కుటుంబ సభ్యులే బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశారని మృతురాలి సోదరుడు కండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంఘటనపై వివాహిత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ఇప్పుడే వస్తానమ్మా... అంటివి కదా కొడుకా! -
కాలనీలు.. కన్నీళ్లు
సాక్షి, నెట్వర్క్: కుండపోత వానకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఏకధాటి వర్షం మహబూబ్‌నగర్, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్ జిల్లాలను కకావిలకం చేసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, ఆయా కాలనీల్లోని ప్రజలు రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడిపారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వరద నీటిలో పడి ఇద్దరు కొట్టుకుపోగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మహబూబ్‌నగర్ పట్టణం రామయ్యబౌలిలో ఇళ్ల మధ్యే నిలిచిన వర్షపు నీరు పాలమూరు కకావికలం శనివారం అర్ధరాత్రి మొదలై.. ఆదివారం ఉదయం వరకు కురిసిన వానతో మహబూబ్‌నగర్ జిల్లా అల్లాడింది. ఒక్క మహబూబ్‌నగర్ పట్టణంలోనే 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు అలుగు పారడంతో దిగువన ఉన్న ఏడు కాలనీల్లోని ఇళ్లలోకి నడుము లోతున నీళ్లు చేరాయి. అర్ధరాత్రి వేళ నీటమునిగిన ఇళ్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ వెంకటేశ్వర్లు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పెద్దచెరువు అలుగు పారడంతో మినీ ట్యాంక్‌బండ్ మీదుగా రాకపోకలను అధికారులు నిలిపివేయించారు. అడ్డాకుల మండలంలోని వర్నె వద్ద మట్టిరోడ్డు వాగులో కొట్టుకుపోయింది. ఈ వర్షంతో మొక్కజొన్న, కంది, పత్తి పంటలకు నష్టమేనని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో అలుగు పారుతున్న పెద్దచెరువు ఉమ్మడి కరీంనగర్‌ను కుమ్మేసింది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీవర్షం కురిసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లోని శివారు కాలనీలు జలమయమయ్యాయి. కరీంనగర్‌లోని పలు కాలనీలు నీటమునగగా, ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. విపత్తుల బృందం రంగంలోకి దిగి డ్రైనేజీల్లో నిండిన నీటిని దారిమళ్లించింది. పద్మానగర్‌లోని వాల్‌మార్ట్ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. సిరిసిల్లలోని బీవైనగర్, అనంతనగర్‌లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. కొత్తచెరువు మత్తడి దూకడంతో ఆటోనగర్, శాంతినగర్, ఆసిఫ్‌పుర, రాళ్లబావి ప్రాంతాలు జలమయమయ్యాయి. తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రహరీ కూలిపోయింది. గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువమానేరు ఉధృతంగా మత్తడి పోస్తుండటంతో సిద్దిపేట–కామారెడ్డి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొట్టుకుపోయిన ఇద్దరు.. వికారాబాద్ జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. జిల్లాలో సగటున 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట్ మండలంలో అత్యధికంగా 104.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగ్నా నదిలో వరద ఉధృతికి యువకుడు కొట్టుకుపోయాడు. ధారూరు మండలం దోర్నాల్కి చెందిన గోరయ్య (35) పీర్ల పండుగలో డప్పులు వాయించేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. ఆదివారం ఉదయం తిరిగి వస్తున్న క్రమంలో నదిదాటుతూ కొట్టుకుపోయాడు. రెండు కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. కాగా, సంగారెడ్డి జిల్లా రేజింతల్ గ్రామ శివారులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తి ఝరాసంగం వైపు నుంచి రేజింతల్ వైపు బైక్‌పై వస్తున్న క్రమంలో కల్వర్టు దాటుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు హద్నూరు పోలీసులు చెప్పారు. జల దిగ్బంధంలో చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణం జలమయమైంది. శనివారం రాత్రి కురిసిన వర్షంతో ఊర చెరువులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరి.. ఆదివారం ఉదయం నుంచి అలుగు పారింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్, గాంధీపార్క్, సెల్లార్ దుకాణాలు, పలు కాలనీలను నీరు ముంచెత్తింది. పోలీస్ స్టేషన్లోకి సైతం నీరు చేరింది. బస్‌స్టేషన్, హాండ్లూమ్ మార్కెట్, గాంధీపార్క్, విద్యానగర్, శాంతినగర్, రాంనగర్, వినాయకనగర్ ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా పడింది. చిన్నకొండూర్ రోడ్డు వరకు సర్వీస్ రహదారి వెంట వరద నీరు పోటెత్తింది. వరద సాఫీగా వెళ్లేందుకు అనువైన కాలువలు లేకపోవడం, సర్వీస్ రోడ్డు వెంట ఉన్న కాలువ సరిపోకపోవడంతో నీరు చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తింది. -
చేనేత మహిళ.. కలల నేతకు అద్దిన కళ
‘‘ఎన్నో చీరలు మగ్గం మీద నేస్తుంటాం. కానీ, ఒక్క చీర కూడా మేం కట్టుకోలేం. బయట దొరికే వందా, రెండు వందల రూపాయల సిల్క్ చీరలు కొనుక్కుంటాం. మా చేతుల్లో రూపుదిద్దుకున్న చీరల డిజైన్లు ఎంత అందంగా ఉన్నాయో కదా, అని ఒకటికి పదిసార్లు చూసుకుంటాం. కానీ, మేం కట్టుకునే చీరల అందం గురించి ఎన్నడూ పట్టించుకోం. అలాంటిది సిరి మేడమ్ మా చీర మాకే కొనిచ్చారు, మేం కట్టుకునేదాకా ఊరుకోలేదు’’ అంటూ విప్పారిన ముఖాలతో తెలిపారు నారాయణపేట్ చేనేత మహిళలు. ‘‘నెల రోజుల క్రితం తెలంగాణలోని నారాయణ్‌పేట్ చేనేత మహిళలను కలిసి, వారి చీరలు వారే కట్టుకున్నప్పుడు ఆ ఆనందాన్ని ఫొటోలుగా తీయాలనిపించింది. అలా తీసుకున్నాను కూడా. వీరికే ఇంకాస్త కట్టూ బొట్టూ మార్చితే మోడల్స్‌కి ఏ మాత్రం తీసిపోరు అనిపించింది. దాంతో ఈ ఆలోచనను సినిమాటోగ్రాఫర్ రఘు మందాటిని కలిసి, ఈ షూట్ ప్లాన్ చేశాను’’ అని వివరించారు ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి. హ్యాండ్లూమ్ డే సందర్భంగా నిన్న హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘తాశ్రిక’ పేరుతో చేనేత మహిళల ఫొటో ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా చేనేతల పట్ల తనకున్న మక్కువను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘పుట్టి పెరిగింది అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్‌లో. కళల లేపాక్షి మాకు దగ్గరే. హైదరాబాద్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. పదహారు ఏళ్లుగా హ్యాండ్లూమ్స్‌తో డిజైన్స్ చేస్తున్నాను. చేనేతలతో యువతరం మెచ్చేలా మోడ్రన్ డ్రెస్సులను రూపొందించి, షోస్ కూడా ఏర్పాటు చేశాను. ఎప్పుడూ చేనేతలతో మమేకమై ఉంటాను కాబట్టి, వారి జీవితాలు నాకు బాగా పరిచయమే. ఆనందమే ముఖ్యం రోజుల తరబడి దారం పోగులను పేర్చుతూ ఒక్కో చీరను మగ్గం మీద నేస్తారు. ఒక్కో చీర 1200 రూపాయల నుంచి ధర ఉంటుంది. కానీ, అవి అంత సులువుగా అమ్ముడుపోవు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు వారి చేతి వృత్తే ఆధారం. చీర ఖరీదైనదని, వారెన్నడూ వాటిని కలలో కూడా కట్టుకోవాలనుకోరు. సాధారణ రోజుల్లోనే వారి కుటుంబ పరిస్థితులు ఎంత గడ్డుగా ఉంటాయో కళ్లారా చూశాను. అలాంటిది కరోనా సమయంలో చేనేత కుటుంబాల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి లేక వారంతా ఎలా ఉన్నారో, వారి నేత చీరలన్నీ అలాగే మిగిలిపోయి ఉంటాయనుకొని ఒకసారి కలిసి వద్దామని వెళ్లాను. అక్కడి వారి పరిస్థితులన్నీ స్వయంగా చూశాక, ఆ మహిళల ముఖాల్లో కొంచెమైనా ఆనందం చూడాలనిపించింది. అలాగే, నాదైన కంటితో వారిని ఇంకాస్త కళగా చూపాలనుకున్నాను. నా స్నేహితుల్లో ఉన్న మేకప్, హెయిర్ స్టైలిస్ట్‌లతో మాట్లాడాను. ఈ క్రమంలో వారానికి ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లడం, అక్కడి మహిళలతో మాట్లాడటం, వాళ్ల కుటుంబ సభ్యుల్లో నేనూ ఒకదాన్నయిపోయాను. ఫొటో షూట్‌కి అనువైన ప్లేస్ కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాం. ఒక ప్రాచీన దేవాలయం కనిపించింది. అక్కడే ఫొటో షూట్‌కి ప్లాన్ చేసుకున్నాం. పదిమంది చేనేత మహిళలను తీసుకొని ఉదయం 5 గంటలకే ఆ దేవాలయానికి చేరుకున్నాం. ముందే అనుకున్నట్టు డిజైనర్ బ్లౌజులు, ఆభరణాలు, మేకప్ సామగ్రి అంతా సిద్ధం చేసుకున్నాం. రెండు కళ్లూ సరిపోలేదు ముస్తాబు పూర్తయ్యాక ఆ చేనేత మహిళల ‘కళ’ చూస్తుంటే నాకే రెండు కళ్లు సరిపోలేదు. వారు చూపించిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అనిపించింది. జాతీయస్థాయి మోడల్స్‌కి వీరేమాత్రం తీసిపోరు అనిపించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫొటో, వీడియో షూట్ చేశాం. వారి అనుభవాలతో కలిపి డాక్యుమెంటరీ రూపొందించాం. ఈ గ్యాలరీలో ప్రదర్శించిన ఈ మహిళల ఫొటోలతో ఉన్న ఫ్రేమ్‌లు వారి వారి ఇళ్లలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ ఫొటోషూట్, డాక్యుమెంటరీ అంతా స్వచ్ఛందంగా పూర్తిచేశాం. నా స్నేహితులు కూడా ఈ పనిలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ఈ రంగంలో ఉన్నందుకు చేనేతకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనిపించింది. ఈ మహిళల ముఖాల్లో కనిపించిన కళ వీరి జీవితాల్లోనూ కనిపించాలి. చేనేతలను ఈ తరం మరింతగా తమ జీవనంలో భాగం చేసుకోవాలన్నదే నా ప్రయ త్నం’’ అని వివరించారు డిజైనర్ హేమంత్ సిరి. గ్యాలరీకి వచ్చినవారంతా అబ్బురంగా చేనేత మహిళల ఫొటోలు, డాక్యుమెంటరీని తిలకించడం, అక్కడే ఉన్న చేనేత మహిళలను ఆప్యాయంగా పలకరించడం, కొందరు చీరలు కొనుక్కోవడం, మరికొందరు మీ నుంచి మేమూ చీరల ఆర్డర్స్ తీసుకుంటాం అంటూ ఫోన్ నెంబర్లు అడిగి తీసుకొని వెళ్లడం.. అక్కడ ఉన్నంతసేపూ కళ్లకు కట్టింది. లేపాక్షి దేవాలయ కళను నారాయణ్‌పేట్ కాటన్ చీరల మీద డిజిటల్ ప్రింట్ చేయించి, డిజైన్ చేసిన ప్రత్యేకమైన చీరలు ఇవి. వీటితోనే డాక్యుమెంటరీ, ఫొటో షూట్ చేశాం. ఇందులో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొన్నారు. వచ్చిన ఆలోచనలను వెంటనే అమల్లో పెట్టడం, అందుకు తగినట్టుగా నారాయణ్‌పేట్ మహిళలు ఆనందంగా సహకరించిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఉద్రిక్తత: కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు
సాక్షి, నారాయణపేట్: మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ కాన్వాయ్‌ను బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో నిరసనకారలపై పోలీసుల లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురుఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కాగా జిల్లా ఆస్పత్రిలో చిల్డ్రన్స్ ఐసీయూ వార్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. -
వాట్సాప్‌లో వైరలై.. మున్నాకి దొరికిన జోడీ
నారాయణపేట: అతని వయసు పెరిగినా శరీరం పొడవు పెరగలేదు. సాధారణంగా ఉన్నవారిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో తనలాంటి వ్యక్తినే వివాహం చేసుకుంటే సమస్య ఉండదని భావించాడు. వెంటనే తన ఫోటో, ప్రొఫైల్‌ను వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు నారాయణపేట జిల్లా అచ్చంపేటకు చెందిన మున్నా. ఆ ఫోటో అటు, ఇటు తిరిగి నారాయణపేట మండలం తిర్మలాపూర్‌కు చెందిన వ్యక్తి వద్దకు చేరింది. వెంటనే ఆయన అదే గ్రామంలో ఉన్న బసప్ప కుమార్తె భాగ్యమ్మకు చూపించాడు. అనంతరం అబ్బాయి ఫోన్ నంబర్ ఆధారంగా వాట్సాప్‌లోనే పెళ్లిచూపులు కానిచ్చారు. ఇద్దరూ ఒప్పుకోవడంతో గురువారం తిర్మల్‌దేవుని సన్నిధిలో మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. -
దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి
సాక్షి, నారాయణపేట : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి తండ్రి కురమయ్య మృతిచెందారు. గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్‌లో కొన్నిరోజులపాటు చికిత్స పొందారు. కొన్ని రోజుల క్రితమే కురమయ్య కుటుంబ సభ్యులు ఆయన్ని తన స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకునివెళ్లారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లోనే మృతి చెందారు. కాగా దిశ అత్యాచార కేసులో ఏ4గా ఉన్న చెన్నకేశవులు పోలీసుతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక ఆయన భార్య రేణుక రెండు రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కురమయ్య మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు గుడిగండ్ల వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక) -
‘ఏబీవీ’ బినామీ బాగోతం బట్టబయలు
సాక్షి, మహబూబ్‌నగర్: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బినామీ బాగోతం బట్టబయలైంది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల, చిట్యాల గ్రామాల్లో 117.14 ఎకరాల భూములను 11 మంది బినామీల పేరిట ఆయన కొనుగోలు చేసిన ఉదంతం వెలుగుచూసింది. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన వెంకటేశ్వరరావు ఏడీజీపీగా పనిచేసిన కాలంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలడం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ ఇచ్చిన నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల కింద వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. అయితే వెంకటేశ్వరరావు తన హోదాను అడ్డుపెట్టుకొని భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మక్తల్ మండల పరిధిలోని పసుపుల, చిట్యాల గ్రామాల్లో బినామీల పేరిట 117.14 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. భూముల కొనుగోలు సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా బంధువులు, కుటుంబ సభ్యులతోపాటు తన నమ్మకస్తుల పేరిట పట్టా చేయించారు. రెండు గ్రామాలు... 117.14 ఎకరాలు పదేళ్ల క్రితం నుంచే పసుపుల గ్రామంలో 52.19 ఎకరాలు, చిట్యాలలో 64.35 ఎకరాల చొప్పున మొత్తం 117.14 ఎకరాలను వెంకటేశ్వరరావు బినామీల పేరిట కొనుగోలు చేశారు. ప్రత్యక్షంగా భూ లావాదేవీలు కొనసాగిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ముందే ఊహించిన ఆయన... ముందు జాగ్రత్తగా భూముల కొనుగోళ్ల విషయంలో మండలానికి చెందిన ఓ రాజకీయ నాయకుడిని రంగంలో దింపారు. ఆయన మధ్యవర్తిత్వంతో ఆయా గ్రామాల్లో భూములను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూముల్లో సాగు చేస్తున్న వెంకటేశ్వరరావు... రైతులతో సాగు చేయిస్తే విషయం బయటకు పొక్కుతుందని భావించి ఆధునిక పద్ధతులను ఎంచుకున్నారు. మందుల పిచికారీ, నూర్పిడి, విత్తనాలు విత్తడం వంటి పనులను యంత్రాల ద్వారా నిర్వహిస్తూ కూలీల అవసరాన్ని తగ్గించి జాగ్రత్తపడినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పొలంలోనే ఫాంహౌస్ ఏర్పాటు చేసుకున్న వెంకటేశ్వరరావు... నెలకోసారి కచ్చితంగా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి వెళతారని గ్రామస్తులు తెలిపారు. కృష్ణా నది టు వ్యవసాయ క్షేత్రం.. కృష్ణానది వద్ద మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న దృశ్యం తన వ్యవసాయ క్షేత్రం నుంచి సుమారు 3 కి.మీ. మేర కృష్ణా నది ఒడ్డున ఉన్న దత్తాత్రేయస్వామి ఎత్తిపోతల పథకం పక్కనే దానికి సమాంతరంగా మరో చిన్నపాటి ఎత్తిపోతలను వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు 10 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటు చేసి కృష్ణా నది భూగర్భం నుంచి పెద్ద పైప్లైన్ల ద్వారా నీటిని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తున్నారు. ఇదే తరహాలో చిట్యాల వాగులోనూ 10 హెచ్‌పీ మోటారును ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి తరలిస్తున్న నీటిని వ్యవసాయ క్షేత్రంలో భారీగా నిర్మించిన సంప్‌లో నిల్వ చేస్తున్నారు. అక్కడ ప్రత్యేక మోటార్ల ద్వారా పంటలకు సాగునీరు చేరవేస్తున్నారు. వాటికితోడు పొలంలో అక్కడక్కడా మరో 8 బోర్లు కూడా వేశారు. గతంలో పండ్ల తోటలు వేసిన ఆయన తర్వాత వరిని సాగు చేస్తున్నారు. కృష్ణా నది గర్భం నుంచి నేరుగా తన పొలాలకు సాగునీరు చేరవేస్తున్న వెంకటేశ్వరరావు తీరుపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూముల కొనుగోళ్ల విషయంలోనూ తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని పసుపుల గ్రామానికి చెందిన ఆనంద్‌గౌడ్ ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. పడకేసిన లిఫ్టు.. 3,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పసుపులలో రూ. 76 లక్షలతో 1987లో నిర్మించిన దత్తాత్రేయ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం పడకేసింది. దాని నిర్వహణ బాధ్యతను మొదట్లో ప్రభుత్వమే చూసుకున్నా 2002లో రైతులకు అప్పగించడంతో నిర్వహణ భారమై రైతులు ఉపయోగించుకోలేకపోయారు. తాజాగా ఆ లిఫ్టుకు పక్కనే ఆ పథకానికి సమాంతరంగా వెంకటేశ్వరరావు భారీ మోటార్లతో నీటిని తరలించడం గ్రామస్తులను విస్మయానికి గురి చేస్తోంది. భారీగా విద్యుత్ వినియోగం.. వ్యవసాయ క్షేత్రానికి నీటి తరలింపు కోసం ఏర్పాటు చేసిన మోటార్లతో విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. కృష్ణా తీరం వద్ద ఉన్న నాలుగు 10 హెచ్‌పీ మోటార్లలో ఒక్కొక్కటి 12 గంటలు పని చేస్తే.. ఏడు కిలోవాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందని, దీన్ని కమర్షియల్‌గా లెక్కిస్తే రూ. 900 బిల్లు అవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. అదే 5 హెచ్‌పీ మోటార్లు పనిచేస్తే రూ. 450 వరకు బిల్లు వస్తుందన్నారు. ఈ లెక్కన ఏళ్ల నుంచి నిరంతరంగా పని చేస్తున్న ఈ భారీ మోటార్లతో విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సర్వీసు చార్జీల కింద రైతులు ప్రతి నెలా చెల్లించే రూ. 30 మాదిరిగానే ఈ భారీ మోటార్లకూ వెంకటేశ్వరరావు అదే చెల్లింపులు చేయడం గమనార్హం. 11 మంది మీద పట్టాలు... రెండు గ్రామాల్లో తాను కొనుగోలు చేసిన 117.14 ఎకరాలను వెంకటేశ్వరరావు 11 మంది పేరిట పట్టాలు చేసినట్లు రెవెన్యూ రికార్డులు చూపుతున్నాయి. అయితే వారందరూ స్థానికేతరులు కావడం గమనార్హం. వారు ఎవరో? ఎక్కడి వారో తెలియదని గ్రామస్తులు చెబుతున్నారు. పట్టాలు పొందిన వారిలో కొరుమర్లు వెంకట సత్యనాగమణి తప్ప మిగిలిన వారందరూ తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు బంధు పేరిట ఆర్థిక సహాయాన్ని సైతం పొందడం గమనార్హం. 2018 ఖరీఫ్, రబీ, 2019 ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం కింద మొత్తం రూ. 9,23,900 లబ్ధి పొందారు. మరో రూ. 10,98,400 మంజూరై చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. భూమికి భూమి ఇస్తామని ఇవ్వలేదు... మేం ఆరుగురు అన్నదమ్ములం. గ్రామంలో మాకు 12.24 ఎకరాల భూమి ఉండేది. అందులో రెండెకరాల భూమిని అన్నదమ్ములం అందరి సమ్మతంతో మా గ్రామానికి చెందిన ఆశప్పకు అమ్మినం. 2005లో మా గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి వెంకటేశ్వరరావు సార్ మీ పదెకరాల భూమి అడుగుతుండ్రు. దానికి బదులు మరోచోట పంటలు బాగా పండే భూమి ఇస్తరు అన్నరు. అప్పుడు మేం ఇద్దరినీ నమ్మి భూమి రిజిస్ట్రేషన్ చేసినం. అప్పట్నుంచీ ఇప్పటివరకు మాకు ఎక్కడా భూమి ఇవ్వలేదు. రూ. 20 వేలు మాత్రమే ఇచ్చారు. భూమి ఇప్పించాలని అడుగుతుంటే మా గ్రామ పెద్ద మనిషి తిప్పించుకుంటున్నడు. నాకు న్యాయం చేయండి. – ఆనంద్‌గౌడ్ (పసుపుల గ్రామం) తక్కువ ధరలకు భూములు కొన్నారు.. ఎవరో డీఐజీ సార్ అట. అప్పట్లో తక్కువ ధరలకు ఇక్కడ భూములు కొన్నారు. కృష్ణా నది నుంచి పైప్లైన్ల ద్వారా నేరుగా పొలాలకు నీరు తీసుకెళ్తున్నరు. డబ్బున్న వాళ్లకు ఏదైనా చెల్లుతది. మా లాంటి వాళ్లకు అన్నీ ఆంక్షలే. – లక్ష్మణ్, స్థానికుడు ఏబీ వెంకటేశ్వరరావు బినామీల పేరిట చేపట్టిన భూ కొనుగోళ్లు ఇలా.. (నోట్: ఎకరం=40 గుంటలు) -
నారాయణపేటలో భూ మాయ!
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బాపూర్ శివారులోని సర్వే నం. 30/ఏఅ, ఖాతా నం. 635లో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆనంద (భర్త పేరు వెంకట్‌రెడ్డి) అక్రమంగా పొందారు. ఆమె పేరుతో పట్టాపాసు పుస్తకాలు మంజూరయ్యాయి. హద్దులు తెలియకపోవడంతో అక్రమంగా పట్టా పొందిన ఈ భూమిని సాగు చేయడం లేదు. అయినా ‘రైతుబంధు’ ద్వారా పెట్టుబడి సాయం మాత్రం క్రమం తప్పకుండా పొందుతున్నారు. ఇలా 2018–19లో రూ.18వేలు, 2019–20లో రూ.22,500 తీసుకున్నారు. అలాగే సర్వే నం.30/ఆ ఖాతా నం.372లో లక్ష్మి (భర్త పేరు నాగరాజు) రెండెకరాలకు పట్టాపాసు పుస్తకాలు తీసుకున్నా సాగు చేయడంలేదు. 2018–19లో రూ.ఎనిమిది వేలు, 2019–20లో రూ.పది వేల పెట్టుబడి సాయం మాత్రం తీసుకున్నారు. ఇలాంటి రైతులు పదుల సంఖ్యలో ఉన్నారు. రెవెన్యూ అధికారుల అవినీతితో అక్రమ పట్టాలు పొందిన వీరు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం తీసుకుంటూనే ఉన్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ ఊట్కూరు: తవ్విన కొద్దీ అక్రమాలు.. ఒకదాని తర్వాత మరొకటి.. ఎవరికీ అంతుబట్టకుండా ప్రభుత్వ భూములను కాజేసే కొందరు రెవెన్యూ ఉద్యోగులు.. వారికి సహకరించే మరికొందరు అధికారులు.. ఆలస్యంగా వెలుగుచూస్తున్న అక్రమాలతో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం వార్తల్లోకెక్కింది. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని గుట్టుచప్పుడు కాకుండా వాటిని తమ కుటుంబ సభ్యుల పేతో పట్టాలు చేయడం.. ఇతరులకు అమ్ముకోవడం ఆ మండల రెవెన్యూ అధికారులు కొందరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇదే మండలంలోని దంతన్‌పల్లి, ఊట్కూర్, బాపూర్ శివారులో ఎనిమిది సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న 21.81ఎకరాలను తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో పట్టా చేసిన స్థానిక వీఆర్వో, ముగ్గురు వీఆర్ఏల ఉదంతం వెలుగుచూడక ముందే బాపూర్ శివారులో మరో 75 ఎకరాల ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట పట్టా చేసినట్టు ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఆ మండలంలో ప్రభుత్వ భూ బదలాయింపు 96.81 ఎకరాలకు చేరింది. బాపూర్ శివారులోని సర్వే నం.157, 158, 164, 30లో ఉన్న 150 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో 75 ఎకరాల అన్యాక్రాంతమైందని 2018లోనే ఆ గ్రామస్తులు గుర్తించారు. ఏడాది క్రితం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల జాబితాను గ్రామసభలో చదవి వినిపించడంతో 75 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదే క్రమంలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతర రైతులకు పట్టాలు చేశారని అప్పట్లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ అప్పటి తహసీల్దార్ తిరుపతయ్యను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అయితే నామమాత్రంగా రికార్డులను పరిశీలించిన అధికారులు అక్రమార్కులను కాపాడారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విచారణ అనంతరం గ్రామస్తులు మళ్లీ ఆందోళన చేపడతారనే ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు అక్రమ పట్టాలు పొందిన రైతులకు హద్దులు కేటాయించలేదు. దీంతో పట్టా పాసు పుస్తకాలు తీసుకున్న రైతులు ఆ భూముల్లో సాగు చేయడం లేదు. అయితే పెట్టుబడిసాయం పొందడం గమనార్హం. సర్వే నం.30లోనే అత్యధికంగా సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే.. అందులో 30 నుంచి 40 ఎకరాల వరకు ఇతరుల పేరిట పట్టా అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక సర్వే నం.157, 158 164 లలో మిగిలిన మరో 30 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఆది నుంచి అదే తీరు..! ఊట్కూరు మండలంలో భూ అక్రమాలు కొత్తేమీ కాదు. అధికారుల పర్యవేక్షణ లోపమో.. అవినీతి కారణమో తెలియదు కానీ అక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2009లో నకిలీ పట్టా పాసు పుస్తకాలు తయారు చేసిన ఐదుగురు వీఆర్వోలు వాటిని రైతులకు అమ్మిన విషయం సంచలనం రేపింది. ఈ సంఘటనలో వీఆర్వోలను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు అక్రమ పట్టాలు పొందిన 36 మంది రైతులపై కేసు నమోదు చేశారు. ఈ తతంగంలో సదరు వీఆర్వోలు కొందరు దళారులను నియమించుకుని వ్యవహారమంతా నడిపించారు. అప్పట్లో కలెక్టరేట్ నుంచి కొత్త పాసు పుస్తకాలను తెచ్చి రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి, స్టాంపులు వేసి దళారుల చేతుల మీదుగా బినామీ రైతులకు అందించారు. ఒక పాసు పుస్తకానికి రూ.పది వేల నుంచి రూ.20 వేల వరకు డబ్బులు దండుకుని మండలంలోని పగిడిమారి, మొగ్దూంపూర్, అమీన్పూర్ తదితర గ్రామాల బినామీ రైతులకు అందించారు. నకిలీ పాస్ పుస్తకాలు పొందిన రైతులు మక్తల్ కో–ఆపరేటివ్ బ్యాంకు ద్వారా లక్షలాది రూపాయల రుణాలు పొందారు. అదే సమయంలో విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది మక్తల్ కో–ఆపరేటివ్ సొసైటీకి Ðవెళ్లి బ్యాంకులో బోగస్ పుస్తకాలను పట్టుకుని ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు 2009 ఆగస్టు 26న 36 మంది రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో అప్పటి డిప్యూటీ తహసీల్దార్ ఉండటం గమనార్హం. తాజాగా.. అదే స్థాయిలో ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట పట్టా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండదండలున్నాయనీ.. అందుకే ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట పట్టా చేస్తున్నా.. తమ పై స్థాయి అధికారులకు తప్పుడు నివేదికలు పంపుతూ అక్రమార్కులను కాపాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుత నారాయణపేట కలెక్టర్ హరిచందన దాసరి ఎలా స్పందిస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంటారా? లేదా? అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అనేది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వ భూమిపై సర్వే చేట్టాలి మండలంలోని ఊట్కూర్, దంతన్‌పల్లి, బాపూర్ శివారులో ప్రభుత్వ భూమిని అక్రమంగా కుటుంబ సభ్యులపై పట్టాలు చేసుకున్న రెవెన్యూ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మండలంలోని ప్రభుత్వ భూములపై మళ్లీ సర్వే చేపట్టి అక్రమంగా పట్టాలు చేసుకున్న వారి నుంచి భూమిని స్వా«దీనం చేసుకోవాలి. మిగులు భూమిని నిరుపేద దళితులు, జోగినీలకు పంపిణీ చేయాలి. – హాజమ్మ, ఊట్కూరు బాధ్యులపై చర్య తీసుకోవాలి ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమం అవినీతి అధికారులకు వరంలా మారింది. మండలంలో అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ సిబ్బంది, వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఊట్కూర్, దంతన్‌పల్లి, బాపూర్, పెద్దపొర్ల, చిన్నపొర్ల, మల్లెపల్లి, ఏర్గాట్పల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూమిపై అధికారులు రిటైర్డ్ తహసీల్దార్‌తో దర్యాప్తు చేయించి.. భూమిని స్వా«దీనం చేసుకోవాలి. – సలీం, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట విచారణ చేపడతాం మండలంలో పలు చోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్టు ఫిర్యాదులు అందాయి. వీటన్నింటిపై విచారణ చేపట్టి అక్రమంగా ఇతరుల పేరిట పట్టాలు చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా భూములు పొందిన వారిపైనా చర్యలు తప్పవు. ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట పట్టాలు చేయడం నేరం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులను నివేదిస్తాం. – దానయ్య, తహసీల్దార్, ఊట్కూర్ -
ఒక్క ఓటు, మూడు ఓట్లతో లక్కీవీరులు..
సాక్షి, నారాయణపేట: ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న మాటను ఈ సంఘటన నిజం చేస్తున్నట్లుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసి ప్రత్యర్థికన్నా ఒక్కటంటే ఒక్కటే ఓటు ఎక్కువ రావడంతో విజయం వరించింది. నారాయణపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్‌సలీం సమీప అభ్యర్థి చలపతిపై ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించి లక్కీ వీరుడుగా నిలిచారు. బీజేపీ అభ్యర్థికి 310 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సలీంకు 311ఓట్లు వచ్చాయి. ఒక ఓటుతో గెలుపొందారని అధికారులు వెల్లడించారు. బీజేపీ వారు పట్టుబట్టడంతో అధికారులు రీకౌంటింగ్ చేశారు. సలీంకు ఒక్క ఓటు అధికంగా రావడంతో ధ్రువీకరించి సరి్టఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మహ్మద్‌సలీం మాట్లాడుతూ కౌన్సిలర్‌గా గెలవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దొంగఓట్లు వేయడాన్ని తాను అడ్డుకోవడం వల్లే గెలుపు సాధ్యమైందని చెప్పారు. మూడు ఓట్లతో గెలుపు శాంతినగర్ (అలంపూర్): వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 7వ వార్డు అభ్యర్థి ఎన్.అజయ్‌కుమార్ మూడంటే.. మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేదవతికి 358 ఓట్లు రాగా.. అజయ్‌కుమార్‌కు 361ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేదవతి ఓట్లు రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరింది. అభ్యర్థి కోరిక మేరకు రెండో పర్యాయం అధికారులు ఓట్లు లెక్కించారు. రెండోసారి లెక్కించినప్పటికి 3 ఓట్లు ఆధిక్యత లభించడంతో అజయ్‌కుమార్‌ను విజేతగా అధికారులు ప్రకటించారు. -
ఎన్నికల ఖర్చు చెప్పాల్సిందే!
సాక్షి, నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చులపై ఎన్నికల వ్యయ పరిశీలకులతో ప్రత్యేక నిఘా బృందాలతో పర్యవేక్షించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో జిల్లా పర్చేజెస్ కమిటీలో రేట్ ఆఫ్ చార్ట్‌ను నిర్ణయిస్తూ శుక్రవారం సర్క్యులర్‌ను విడుదల చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నివేదించాల్సిన ఖర్చుల వివరాలను ఈ రేట్ ఫర్ చార్ట్‌ను ఆధారంగా చేసుకొని బిల్లులను మున్సిపల్ కమిషనర్లకు ఎప్పటికప్పుడు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ధరలు ఇలా.. లౌడ్ స్పీకర్స్, యాంపిల్ ఫైర్, మైక్రోఫోన్ లేబర్ చార్జీలతో కలిపి ఒకరోజుకు రూ.1,450, కన్స్ట్రక్షన్ ఆఫ్ పోడియం ఒకరోజుకు రూ.2,850, ఫ్లెక్సీ బ్యానర్ సైజ్ 10/12 రూ.1,200, క్లాత్ బ్యానర్ రూ.200, క్లాత్ ఫ్లాగ్స్ రూ.40, ప్లాస్టిక్ ప్లాగ్స్ సైజ్ 6/4 రూ.8, పోస్టర్ సింగిల్ కలర్ 18/23 రూ.8, మల్టీకలర్ పోస్టర్ సైజ్ 18/23 రూ.10, హోర్డింగ్ సైజ్ 8/12 లేబర్ చార్జీలతో కలిపి రూ.8,500, కటౌట్స్ (ఉడెన్) లెబర్ చార్జెస్‌తో 14/4 రూ.9 వేలు, కటౌట్స్ క్లాత్, ప్లాస్టిక్ 12/4 రూ.5 వేలు, వీడియోగ్రాఫర్, కెమెరామెన్ రూ.1,250, ఎరక్షన్ ఆఫ్ గేట్స్ 15/12 రూ.2,800గా ధరలు నిర్ణయించారు. వాహనాల చార్జీలు.. వాహనాల చార్జీల విషయానికి వస్తే జీపు డ్రైవర్ బత్తతో కలిపి రూ.1,500, టెంపో/ ట్రక్ రూ.2,900, సుమో ఒకరోజుకు ఏసీ రూ.2 వేలు, ప్యూల్ రూ.వెయ్యి, నాన్ ఏసీ రూ.1,200, ప్యూల్ రూ.650, వ్యాన్ (డీసీఎం) ఒకరోజుకు రూ.2,900, ఫ్యూల్ రూ.వెయ్యి, వ్యాలీస్ ఒకరోజు ఏసీ రూ.2 వేలు, నాన్ ఏసీ రూ.1,200, ఇన్నోవా ఏసీ ఒకరోజు రూ.2,500, కారు ఒక రోజుకు రూ.1,200, త్రీ వీలర్ ఒకరోజుకు రూ.750, హోటల్ చార్జీలు ఏసీ రూ.1,600 ఒకరోజుకు, నాన్ ఏసీ రూ.800లు గెస్ట్‌హౌస్ రూ.400, చార్జెస్ ఆఫ్ డ్రైవర్స్ జీతాలు ఒకరోజు బత్త రూ.500, కుర్చీలు ఒకరోజుకు రూ.9, సోఫా రూ.250, హియరింగ్ చార్జెస్ హోర్డింగ్ సైట్స్ మున్సిపాలిటీ అథారిటీస్ రూ.500, టెంట్లు సైజు 18/36 రూ.800, 12/24 రూ.600, రూ.700, కార్పెట్స్ బిగ్ సైజ్ రూ.200, స్మాల్ సైజ్ రూ.150, సైడ్ వాల్స్ రూ.125, వాటర్ డ్రమ్స్ ఒకరోజుకు రూ.50, గ్లాసులు రూ.3, రైస్ ప్లేట్స్ రూ.4, ఐరన్ టేబుల్ రూ.50గా ధరలను నిర్ణయించారు. మొత్తంగా ప్రతి కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి కౌంటింగ్ వరకు రూ.లక్ష మించకుండా ఖర్చుచేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. -
మేడం.. నేను పోలీస్‌నవుతా !
సాక్షి, నారాయణపేట : పట్టణంలోని జంగిడిగడ్డ ఏరియా.. బుధవారం సాయంత్రం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక్కసారిగా ఒకదాని వెంట మరొకటి వాహనాలు రయ్.. రయ్ మంటూ దూసుకొచ్చాయి. అందులో నుంచి పెద్దఎత్తున పోలీసులు దిగి ఇంటింటికి తిరుగుతూ జల్లెడ పట్టారు. అక్కడున్న వారంతా పోలీసులు వచ్చారేంటి అంటూ భయం భయంగా చూస్తున్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన ఎస్పీ చేతన అక్కడే ఉన్న చిన్నారులతో ముచ్చటించింది. ఐశ్వర్య అనే అమ్మాయి ముందుకు వచ్చి మేడం.. నేను పెద్దయ్యాక పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటూ ఎస్పీని అడిగింది. వెంటనే ఎస్పీ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని వెరీగుడ్.. మంచిగా చదువుకుంటే పోలీసు అవుతావని చెప్పింది. పోలీసులు ఎందుకు ఉంటారని అడగగా.. దొంగలను పట్టుకోడానికి అంటూ బదులిచ్చింది. పోలీసు వాహనాల శబ్దం ఎలా ఉంటుంది అనగానే అక్కడున్న చిన్నారులంతా కుయ్.. కుయ్ అని వినిపించడంతో శెభాష్ అంటూ.. అందరికి చాక్లెట్లు ఇచ్చి, వారితో ఫొటో దిగారు. -
మహబూబ్‌నగర్‌లో రైతుబంధు కొందరికే..!
సాక్షి, మహబూబ్‌నగర్: రైతులకు ఆర్థిక చేయూత అందించి వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయం నేటికీ చాలామంది రైతులకు అందలేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నా సాయం రాలేదు. పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో 79,263 మంది ఉన్నారు. తొలి విడతలో మురిపించి.. రెండో విడతలో ఆశలు రేపి.. మూడో విడతకల్లా ఉసూరుమనిపించారని అన్నదాతలు వాపోతున్నారు. దీనికి తోడు బ్యాంకు రుణాలు మాఫీ కాకపోవడంతో కొత్తవి పొందలేకపోతున్నారు. దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 90శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు తెలుస్తున్నా.. వాస్తవానికి ఆ మేరకు కూడా ఖాతాల్లో డబ్బు జమ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని, ఎప్పుడు అవుతుందని అధికారులను అడగడం కనిపిస్తోంది. అధికారులు ఖాతాల్లో డబ్బు జమ విషయమై ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇస్తే ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండదు. గత ఖరీఫ్, రబీ సీజన్లకు గాను ప్రభుత్వం ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.8వేల సాయం అందించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఎకరాకు రూ.5వేలకు పెంచింది. అంటే రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ. 10వేల సాయం అందాల్సి ఉంది. 2018 ఖరీఫ్‌లో 2,82,783 మంది రైతులకు రూ.219.67 కోట్లు అందించారు. రబీలో 2,62,612 మంది రైతులకు రూ.307.7 కోట్లు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం కింద రెండు సీజన్లకు కలిపి రూ.697.33 కోట్లు కేటాయించినా.. రూ.526.33 కోట్లు మాత్రమే పెట్టుబడి సాయం కింద రైతులు అందించారు. అందని సాయం... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పాలమూరు జిల్లాలో 1,78,012మంది రైతులకు పెట్టుబడి సాయం గా రూ.223.71 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1,16,141మంది రైతులకు రూ.135.55 కోట్లు సాయంగా అందించారు. ఇంకా 61,871 మంది రైతులకు రూ.88.16 కోట్ల పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. నారాయణపేట జిల్లాకు సంబంధించి 1,33,689మంది రైతులకు రూ.207.73కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇప్పటి వరకు 1,16,297మంది రూ.159.69 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా 17,392మంది సంబంధించి రూ.48.04కోట్లు పెండింగ్‌లో ఉంది. దీంతో సదరు రైతులు తమకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకునేందుకు నిత్యం కార్యాలయా ల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ, బ్యాం కు అధికారులను సంప్రదించినా సరైన సమాధానం లభించడం లేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నా తమకు పెట్టుబడి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు రాలేదు నాకు గ్రామంలో రెండెకరాల భూమి ఉంది. ఖరీఫ్‌లో రైతుబంధు డబ్బులు అందలేదు. అదనులో పంట సాగు చేస్తేనే దిగుబడి బాగా వస్తుంది. డబ్బులు లేక సాగు ఆలస్యమైంది. పెట్టుబడి కోసం వడ్డీకి డబ్బులు తీసుకున్నాను. ఈసారి కొంతమందికే మాత్రమే రైతుబంధు డబ్బులు వచ్చాయి. సర్కార్ త్వరగా డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి. – కేశవులుయాదవ్, రైతు, బోయపల్లి ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో అర్హత ఉన్న ప్రతి రైతు వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశాం. ఇందులో 1,16,141 మందికి పెట్టుబడి సాయం అందగా మరో 61,871 మంది రైతులకు రావాల్సి ఉంది. రైతుబంధు అందని వారి వివరాలను ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే రైతులకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి