సాక్షి, మాగనూరు: నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాటన్ జిన్నింగ్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో భారీ స్థాయితో పత్తి దగ్ధమైంది. దాదాపు ఏడు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని బసవేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్‌లో విద్యుత్ షార్ట్ సర్కూట్ జరిగింది. ఈ సందర్భంగా మిల్లులో నిల్వ చేసుకున్న పత్తి దగ్దమైంది. శనివారం రాత్రి 11గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో మిల్లులో నిల్వ ఉంచిన పత్తి మంటల్లో కాలిపోయింది. సకాలంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో కొంత మేరకు ప్రమాదం తప్పింది.
అగ్ని ప్రమాదం కారణంగా బసవేశ్వర జిన్నింగ్ కాటన్ మిల్లులో పత్తి, పత్తి గింజలు, మిషనరీలు, షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దాదాపు 7 నుండి 8కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని మిల్లు యజమాని దండే తమ్మన్న తెలిపారు. ఈ సందర్భంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment