పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
Published Wed, Feb 15 2017 11:32 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
–రూ.కోటి నష్టం
ఆదోని అర్బన్: స్థానిక ఐశర్య కాటన్ పత్తి ఫ్యాక్టరీలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో దాదాపు రూ.కోటి విలువైన పత్తి దగ్ధమైనట్లు అంచనా. ప్రమాదం ఎలా జరిగిందో విచారించాల్సి ఉందని అగ్నిమాపక కేంద్రం అధికారి ప్రభాకర్ తెలిపారు. రాశులుగా పోసిన పత్తి నుంచి ఒక్క సారిగా చెలరేగిన మంటలతో ఫ్యాక్టరీలో ఉన్న కూలీలు, హమాలీలు తీవ్ర భయాందోళనలకు గురి పరుగులు తీశారు. ఫ్యాక్టరీ యజమాని సోమశేఖర్‌గౌడుతో పాటు మరో ఇద్దరు వెంటనే పట్టణంలో ఉన్న అగ్ని మాపక కేంద్రం అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రెండు వాహనాలతో ఫ్యాక్టరీకి చేరుకున్న అగ్ని మాపక కేంద్రం సిబ్బంది నీరు చిమ్మి మంటలను అదుపు చేశారు. అయితే మంటలు భారీగా ఉండడంతో రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది.
Advertisement
Advertisement