
సాక్షి, వరంగల్ అర్బన్: ఖిలా వరంగల్ మండలం నక్కలపెళ్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మహాలక్ష్మీ కాటన్ మిల్లులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారని పోలీసులు వెల్లడించారు. అయితే, అప్పటికే మంటలు తీవ్రమవడంతో గోదాంలో నిల్వ చేసిన పత్తి బెయిళ్లన్నీ కాలిపోయినట్లు తెలిసింది. ప్రమాదంలో రెండు కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మిల్లు యాజమాని వాపోయారు. కాగా, ఘటనపై అగ్నిమాపక అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment